Naa Saami Ranga: నా సామిరంగ మూవీకి అన్ని కోట్లు తీసుకున్న నాగార్జున.. వాళ్లతో పోలిస్తే తక్కువే!-nagarjuna remuneration for naa saami ranga 10 cr but less than chiranjeevi balakrishna ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Naa Saami Ranga: నా సామిరంగ మూవీకి అన్ని కోట్లు తీసుకున్న నాగార్జున.. వాళ్లతో పోలిస్తే తక్కువే!

Naa Saami Ranga: నా సామిరంగ మూవీకి అన్ని కోట్లు తీసుకున్న నాగార్జున.. వాళ్లతో పోలిస్తే తక్కువే!

Sanjiv Kumar HT Telugu
Jan 07, 2024 07:49 AM IST

Nagarjuna Remuneration For Naa Saami Ranga: టాలీవుడ్ మన్మథుడు నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ నా సామిరంగ. విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్న నా సామిరంగ సినిమాకు నాగార్జున అన్ని కోట్ల పారితోషికం తీసుకున్నాడని టాక్ నడుస్తోంది.

నా సామిరంగ మూవీకి అన్ని కోట్లు తీసుకున్న నాగార్జున.. వాళ్లతో పోలిస్తే తక్కువే!
నా సామిరంగ మూవీకి అన్ని కోట్లు తీసుకున్న నాగార్జున.. వాళ్లతో పోలిస్తే తక్కువే!

Nagarjuna Remuneration For Naa Saami Ranga: టాలీవుడ్ కింగ్, మన్మథుడు అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మాస్, యాక్షన్, రొమాంటిక్ మూవీ నా సామిరంగ. మలయాళంలో సూపర్ హిట్ కొట్టిన పొరింజు మరియమ్ జోస్ మూవీకి రీమేక్‌గా నా సామిరంగ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు కొరియోగ్రాఫర్‌గా పని చేసిన విజయ్ బిన్ని తొలిసారి మెగా ఫోన్ పట్టుకుని దర్శకత్వం వహిస్తున్నారు. అంటే నా సామిరంగ సినిమాతో విజయ్ బిన్ని దర్శకుడిగా తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు.

ఇక శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌తో నా సామిరంగ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. అలాగే నా సామిరంగ చిత్రానికి శివేంద్ర దాశరధి సినిమాటోగ్రఫీ అందించారు. రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందించారు. ఆస్కార్ విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ నా సామిరంగ మూవీ భారీ అంచనాలతో సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఇదిలా ఉంటే నా సామిరంగ సినిమా విడుదల నేపథ్యంలో నాగార్జున రెమ్యునరేషన్ హాట్ టాపిక్‌గా మారింది. పలు తాజా నివేదికల ప్రకారం నా సామిరంగ సినిమాకు నాగార్జున రూ. 10 కోట్ల పారితోషికం తీసుకున్నాడని సమాచారం. అయితే, నాగార్జునకు తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ ఉంది. కానీ, నాగార్జున రెమ్యునరేషన్ విషయంలో కాస్తా వెనుకబడ్డారు. గత రెండు చిత్రాలకు రూ. 6 నుంచి 8 కోట్లు తీసుకున్న నాగార్జున ప్రస్తుతం 10 కోట్లకు పెంచారు.

అయితే, నాగార్జున తోటి సీనియర్ హీరోలు మాత్రం భారీ మొత్తంలో పారితోషికం అందుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఒక్కో సినిమాకు రూ. 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. నందమూరి నటసింహం బాలకృష్ణ కాస్తా అటు ఇటుగా రూ. 30 కోట్లు పుచ్చుకుంటున్నారు. ఇక విక్టరీ వెంకటేష్ రూ. 10 కోట్లకుపైగా రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. ఈ ముగ్గురు స్టార్ హీరోలతో పోలిస్తే నాగార్జున తక్కువ పారితోషికం అందుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరోవైపు నా సామిరంగ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయినట్లు సమాచారం. నా సామిరంగ థియేట్రికల్ హక్కులు రూ. 32 కోట్లకు పలికినట్లు తెలుస్తోంది. అయితే, నైజాం ఏరియా హక్కులను నాగార్జున తీసుకున్నారు. వాటిని నాగ్ దాదాపుగా రూ. 15 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. నిర్మాత దిల్ రాజుతో కలిసి నాగార్జున నా సామిరంగ సినిమా విడుదల చేయనున్నారట. మరి నాగార్జునకు సెంటిమెంట్ అయిన సంక్రాంతికి విడుదలవుతున్న నా సామిరంగతో నాగ్ ఎన్ని కోట్లు లాభం తెచ్చుకుంటారో చూడాలి.

ఇదిలా ఉంటే, నాగార్జునకు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఆయన చిత్రాలకు కూడా మంచి మార్కెట్ ఉంటుంది. అయితే, ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన నాగార్జున ఈ మధ్యకాలంలో ప్లాప్స్ అందుకుని వెనుకబడ్డారు. నాగార్జున సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ వసూలు చేయడం లేదు. బిగ్ బాస్ 7 తెలుగుకు హోస్ట్‌గా చేయడానికి ముందు ఘోస్ట్ మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుందో తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా సరైనా హిట్ లేకుండా సతమతం అవుతున్న నాగార్జున నా సామిరంగ సినిమాపైనా గంపెడు ఆశలు పెట్టుకున్నారు.

Whats_app_banner