తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Naga Chaitanya |అఖిల్ దర్శకుడితో నాగచైతన్య సినిమా

Naga Chaitanya |అఖిల్ దర్శకుడితో నాగచైతన్య సినిమా

HT Telugu Desk HT Telugu

23 May 2022, 6:22 IST

google News
  • టాలీవుడ్‌లో మ‌రో కొత్త కాంబినేష‌న్ కుదిరినట్లు స‌మాచారం. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ ద్వారా రీఎంట్రీ ఇచ్చిన ద‌ర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌తో నాగ‌చైత‌న్య ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

నాగ‌చైత‌న్య
నాగ‌చైత‌న్య (twitter)

నాగ‌చైత‌న్య

బంగార్రాజు త‌ర్వాత సినిమాల‌కు చిన్న‌పాటి విరామం ఇచ్చిన నాగ‌చైత‌న్య మ‌ళ్లీ స్పీడు పెంచారు. వ‌రుస‌గా కొత్త సినిమాల్ని సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేస్తున్నారు. స‌ర్కారువారి పాట‌తో భారీ స‌క్సెస్ అందుకున్న ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్‌తో  నాగ‌చైత‌న్య‌తో ఓ సినిమా చేయ‌బోతున్నారు. 14 రీల్స్ ప్ల‌స్ సంస్థ నిర్మించ‌నున్న ఈ సినిమా త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి రానున్న‌ది. 

తాజాగా చైతూ మ‌రో చిత్రానికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ద‌ర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌తో అత‌డు ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. బొమ్మ‌రిల్లుతో తొలి అడుగులోనే ప్ర‌శంస‌ల‌ను అందుకున్నాడు భాస్క‌ర్‌. ఈ సినిమా త‌ర్వాత అత‌డికి ఆ స్థాయి విజ‌యం మ‌ళ్లీ ద‌క్క‌లేదు. తిరిగి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌తో ఫామ్‌లోకి వ‌చ్చిన భాస్క‌ర్ ఇటీవ‌లే నాగ‌చైత‌న్య‌కు ఓ క‌థ‌ను వినిపించిన‌ట్లు స‌మాచారం. 

యూత్‌ఫుల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొంద‌నున్నట్లు చెబుతున్నారు. నేటిత‌రం ఫ్యామిలీస్ ఎదుర్కొంటున్న ఓ స‌మ‌స్య‌ను చ‌ర్చిస్తూ ద‌ర్శ‌కుడు సిద్ధం చేసిన క‌థ న‌చ్చ‌డంతో నాగ‌చైత‌న్య ఈ సినిమాను అంగీక‌రించిన‌ట్లు స‌మాచారం. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించ‌బోతున్న‌ట్లు తెలిసింది. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. 

కాగా నాగ‌చైత‌న్య హీరోగా న‌టించిన థాంక్యూ చిత్రం జూలై 8న రిలీజ్ కానుంది. విక్ర‌మ్ కె కుమార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ దర్శకుడితోనే దూత అనే వెబ్‌సిరీస్ చేస్తున్నారు నాగ‌చైత‌న్య‌. హార‌ర్ క‌థాంశంతో రూపొందుతున్న ఈ వెబ్‌సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్న‌ది. 

తదుపరి వ్యాసం