Naga Chaitanya | నాగచైతన్య థాంక్యూ రిలీజ్ డేట్ ఫైనల్...
14 May 2022, 11:57 IST
అభిమానులకు శనివారం నాగచైతన్య గుడ్‌న్యూస్ వినిపించారు. తాను హీరోగా నటిస్తున్న థాంక్యూ సినిమా రిలీజ్ డేట్‌ను వెల్లడించారు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కానుందంటే...
నాగచైతన్య
నాగచైతన్య హీరోగా నటిస్తున్న థాంక్యూ రిలీజ్ డేట్‌ను చిత్రయూనిట్ ఖరారు చేసింది. డివిభిన్నమైన ప్రేమకథతో రూపొందుతున్న ఈ చిత్రానికి విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఓ యువకుడి జీవితంలోని భిన్న దశలను ఆవిష్కరిస్తూ ఈ సినిమా రూపొందుతోంది. శనివారం ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ వెల్లడించింది. జూలై 8న సినిమాను వరల్డ్‌వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. ఇందులో నాగచైతన్య పాత్ర డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తుందని సమాచారం. నాలుగైదు లుక్స్ లో అతడు కనిపిస్తాడని చెబుతున్నారు.
ఈ సినిమాలో రాశీఖన్నా, మాళవికానాయర్, అవికాగోర్ కథానాయికలుగా నటిస్తున్నారు. బీవీఎస్ రవి ఈ చిత్రానికి కథను అందిస్తున్నారు. గతంలో విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో మనం సినిమా చేశారు నాగచైతన్య. కొత్త తరహా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించింది. మనం తర్వాత మళ్లీ వీరిద్దరు కలయికలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా తర్వాత విక్రమ్ కె కుమార్ తో దూత అనే వెబ్ సిరీస్ చేయబోతున్నారు నాగచైతన్య. ఈ వెబ్ సిరీస్ తోనే చైతూ డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
టాపిక్