Naga Chaitanya |బాక్సర్ లుక్ లో నాగచైతన్య...
14 May 2022, 8:50 IST
మనం తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కె కుమార్ కలయికలో రూపొందుతున్న చిత్రం థాంక్యూ. సినిమా చిత్రీకరణ పూర్తయింది. సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ట్విట్టర్ లో షేర్ చేసిన కొత్త ఫొటోల్లో నాగచైతన్య బాక్సర్ లుక్ లో కనిపించి అభిమానులను సర్ ప్రైజ్ చేశారు.
నాగచైతన్య
ఈ ఏడాది సంక్రాంతికి బంగార్రాజుతో పెద్ద విజయాన్ని అందుకున్నారు నాగచైతన్య. ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో తండ్రి నాగార్జునతో కలిసి నటించారు. సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా బంగార్రాజు నిలిచింది.
ఈ సక్సెస్ తర్వాత థాంక్యూ సినిమాతో నాగచైతన్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఓ యువకుడి జీవితంలోని భిన్న దశలను ఆవిష్కరిస్తూ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది.
సినిమాలోని నాగచైతన్య కొత్త పోస్టర్ ను కెమెరామెన్ పీసీ శ్రీరామ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో బాక్సర్ గా చైతూ కనిపిస్తున్నారు. చేతికి గ్లోవ్స్ ధరించి రఫ్ లుక్ తో డిఫరెంట్ గా డిజైన్ చేసిన నాగచైతన్య పోస్టర్ ఆకట్టుకుంటోంది. చైతన్య మంచి నటుడు అంటూ పీసీ శ్రీరామ్ పేర్కొన్నారు. తమన్ ఈ సినిమాకు ఆల్ టైమ్ హై మ్యూజిక్ ఇచ్చాడంటూ పేర్కొన్నారు. పీసీ శ్రీరామ్ షేర్ చేసిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో అక్కినేని అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
ఈ ప్రేమకథలో రాశీఖన్నా, అవికాగోర్, మాళవికానాయర్ కథానాయికలుగా నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నట్లు సమాచారం. త్వరలోనే థాంక్యూ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
టాపిక్