తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gv Prakash Kumar: నాని దసరా సినిమాను మిస్ చేసుకున్న హీరో.. కారణం చెప్పిన మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్

GV Prakash Kumar: నాని దసరా సినిమాను మిస్ చేసుకున్న హీరో.. కారణం చెప్పిన మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్

Sanjiv Kumar HT Telugu

08 November 2024, 11:01 IST

google News
  • GV Prakash Kumar About Matka Movie: మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా పలు సినిమాలతో అలరించాడు. తాజాగా వరుణ్ తేజ్ మట్కా మూవీకి సంగీతం అందించాడు జీవీ ప్రకాష్ కుమార్. ఈ నేపథ్యంలో నాని నటించిన దసరా మూవీలో ఓ పాత్ర చేయాల్సింది అని రివీల్ చేశాడు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రకాష్ కుమార్.

నాని దసరా సినిమాను మిస్ చేసుకున్న హీరో.. కారణం చెప్పిన మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్
నాని దసరా సినిమాను మిస్ చేసుకున్న హీరో.. కారణం చెప్పిన మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్

నాని దసరా సినిమాను మిస్ చేసుకున్న హీరో.. కారణం చెప్పిన మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్

Music Director GV Prakash Kumar: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ 'మట్కా'. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, బాలీవుడ్ హాట్ బాంబ్ నోరా ఫతేహి హీరోయిన్స్‌గా చేస్తున్నారు. ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, హీరో జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'మట్కా' నవంబర్ 14న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకుని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు.

అమరన్, లక్కీ భాస్కర్, ఇప్పుడు మట్కా. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు. ఎలా అనిపిస్తోంది?

-చాలా హ్యాపీగా ఉంది. దీపావళికి వచ్చిన అమరన్, లక్కీ భాస్కర్ ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకోవడం సంతోషంగా ఉంది. మట్కా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని పూర్తి నమ్మకం ఉంది. మట్కా డైరెక్టర్ కరుణ కుమార్ గారికి అద్భుతమైన స్క్రిప్ట్ నాలెడ్జ్ ఉంది. ఆయనకి ఉన్న డార్క్ ఫిలిం మేకింగ్ స్టయిల్ బ్రిలియంట్. మట్కా చాలా మంచి స్క్రిప్ట్. నాకు చాలా నచ్చింది. మట్కా తప్పకుండా మరో బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది.

మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ స్క్రిప్ట్‌కి ఇస్తారా?

-నా ఫస్ట్ ప్రిఫరెన్స్ స్క్రిప్ట్‌కి ఉంటుంది. తర్వాత డైరెక్టర్ గురించి కూడా ఆలోచిస్తాను. తను ఇంతకుముందు ఎలాంటి సినిమాలు చేశారు? తన ఫిల్ మేకింగ్ స్టైల్ ఏమిటి, విజువల్‌గా కథని ఎలా తీస్తారనేది కూడా చూస్తాను. కరుణ్ కుమార్ గారు స్క్రిప్ట్ పరంగా, విజువల్‌గా, టెక్నికల్‌గా చాలా అద్భుతమైన డైరెక్టర్. చాలా హై బడ్జెట్‌తో ఈ సినిమాను గ్రాండ్‌గా తీశారు. లక్కీ భాస్కర్, అమరన్ లానే ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది.

డైరెక్టర్ కరుణ కుమార్ గురించి ?

-కరుణ్ కుమార్ గారు చాలా అద్భుతమైన రైటర్. డార్క్ జోనర్ సినిమా చేయడంలో ఆయనదిట్ట. ఆయన సినిమాల్లో రా నెస్ ఉంటుంది. ఆయన కథలు నేచురల్‌గా ఉంటాయి. ఈ సినిమాలో కరుణ్ కుమార్ గారితో కలిసి పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.

మట్కాలో మీకు ఇష్టమైన సాంగ్ ఏంటి?

-రెట్రో జోన్‌లో చేసిన లేలే రాజా సాంగ్ నాకు చాలా ఇష్టం. 80స్ బ్యాక్ డ్రాప్‌లో బప్పిలహరి స్టైల్‌లో చేసిన సాంగ్ అది. ఆ సాంగ్ చేసినప్పుడు చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది.

యాక్టర్‌గా తెలుగులో ఎప్పుడు సినిమా చేస్తున్నారు?

-నిజానికి నాని 'దసరా'లో ఒక క్యారెక్టర్ నేను చేయాల్సింది. కానీ, నా డేట్స్ కుదరలేదు. మంచి కథ, క్యారెక్టర్ ఉంటే డెఫినెట్‌గా చేస్తాను.

మీకు ఇష్టమైన జానర్ ఏంటి?

-నాకు లవ్ స్టోరీస్ చేయడం ఇష్టం. మంచి పాటలు చేయడానికి ఆ జోనర్ చాలా బాగుంటుంది. సెల్వ రాఘవన్ గారితో ఒక లవ్ స్టోరీ చేస్తున్నాను.

మీ 100 సినిమా గురించి ?

- సుధా కొంగర గారితో నా వందో సినిమా చేస్తున్నాను. సినిమా అనౌన్స్‌మెంట్ త్వరలోనే వస్తుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం