Bigg Boss 8 Elimination: ఈ వారం బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఇతడే - రోహిణికి సారీ చెప్పిన పృథ్వీ
26 October 2024, 22:24 IST
Bigg Boss 8 Elimination: బిగ్‌బాస్ 8 తెలుగు ఎనిమిదో వారంలో ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరన్నది తెలిసిపోయింది. ఈ వీక్ మెహబూబ్ దిల్ సే హౌజ్ నుంచి బయటఅడుగుపెట్టనున్నట్లు సమాచారం. శనివారం ఎపిసోడ్‌లో గంగవ్వతో పాటు నిఖిల్, పృథ్వీలపై నాగార్జున ప్రశంసలు కురిపించాడు.
బిగ్‌బాస్ 8 తెలుగు ఎలిమినేషన్
Bigg Boss 8 Elimination: ఈ వీక్ బిగ్‌బాస్ 8 తెలుగు నుంచి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరన్నది కన్ఫామ్ అయ్యింది. మెహబూబ్ దిల్ సే హౌజ్ నుంచి ఎలిమినేట్ కాబోతున్నట్లు సమాచారం. వైల్డ్ కార్డ్ ద్వారా రెండు వారాల క్రితమే బిగ్‌బాస్‌లోకి మెహబూబ్ దిల్ సే ఎంట్రీ ఇచ్చాడు. కేవలం ఇరవై రోజుల్లోనే అతడు హౌజ్ నుంచి బయట అడుగుపెట్టనున్నట్లు వార్తలొస్తున్నాయి.
నామినేషన్స్‌లో ఉన్నది వీళ్లే...
ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ అందులో నిజం లేదని, సింగిల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వారం నామినేషన్‌లో మొత్తం అరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇందులో నిఖిల్, ప్రేరణ, విష్ణుప్రియతో పాటు పృథ్వీ, మెహబూబ్, నయనిపావని ఉన్నారు.
నయని పావని వర్సెస్ మెహబూబ్...
నామినేషన్స్‌లో చివరగా నయని పావని, మెహబూబ్ ఉండనున్నట్లు తెలుస్తోంది. నయని పావనిని సేవ్ చేసిన బిగ్‌బాస్ మెహబూబ్‌ను హౌజ్ నుంచి ఎలిమినేట్ చేసినట్లు చెబుతోన్నారు. కమ్యూనిటీ రిలేటెడ్ టాపిక్ మెహబూబ్‌కు మైనస్‌గా మారినట్లు సమాచారం. అదే అతడికి ఓటింగ్ తక్కువగా రావడానికి కారణమైందని అంటున్నారు.
యారోగెంట్ బిహేవియర్ కూడా...
ఫిజికల్ టాస్క్‌లు బాగానే ఆడుతోన్న అతడి యారోగెంట్ బిహేవియర్ కూడా అతడిపై నెగెటివిటీ పెరగడానికి కారణమైందని అంటోన్నారు. నయని పావని ఆటతీరు గొప్పగా లేకపోయినా తప్పులు చేసి కంటెస్టెంట్స్‌కు టార్గెట్ అయిన సందర్భాలు తక్కువగా ఉండటం వల్ల ఆమె సేఫ్ అయినట్లు సమాచారం. . ఓటింగ్‌లో నిఖిల్, విష్ణుప్రియకు ఎక్కువ ఓట్లు వచ్చినట్లు చెబుతోన్నారు. పృథ్వీని లవ్‌స్టోరీస్ కాపాడినట్లు తెలుస్తోంది.
గంగవ్వపై ప్రశంసలు...
బిగ్‌బాస్ శనివారం ఎపిసోడ్‌లో వచ్చి రావడంతోనే గంగవ్వను కన్ఫేషన్ రూమ్‌కు రమ్మని ఆర్డర్ వేశాడు నాగార్జున. కన్ఫేషన్ రూమ్‌లోకి వచ్చిన గంగవ్వపై ప్రశంసలు కురిపించాడు. ఇరగదీశావని మెచ్చుకున్నాడు. కన్ఫేషన్ రూమ్‌లో జరిగిన సంభాషణ గురించి ఎవరికి చెప్పొద్దని గంగవ్వతో అన్నాడు నాగార్జున. ఆ తర్వాత హౌజ్‌కు మెగా చీఫ్ అయినా విష్ణుప్రియను అభినందించాడు.
రాయల్స్ గజగజ
ఫిజికల్ టాస్క్‌లో పృథ్వీ ఆటతీను చిరుతలా ఉందని అన్నాడు. నువ్వు బరిలో ఉంటే రాయల్స్‌కు గజగజ అని నాగార్జున చెప్పాడు. పృథ్వీ, రోహిణి మధ్య గొడవలో ఎవరిది తప్పన్నదానిపై నాగార్జున క్లారిటీ ఇచ్చాడు. పృథ్వీ చేత రోహిణికి సారీ చెప్పించాడు. పృథ్వీ, నిఖిల్‌ను చూస్తుంటే ఆర్ఆర్ఆర్ లో ఇద్దరు హీరోలను చూసినట్లుగా అనిపించిందని అన్నాడు. సంచాలక్‌గా నిఖిల్ నిర్ణయాలు మాత్రం బాగాలేవని క్లాస్ ఇచ్చాడు.