Star Comedian: ఒక్కో ఎపిసోడ్‌కు రూ.12 లక్షలు వసూలు చేసే కమెడియన్.. ఒకప్పుడు చెత్త కుప్పలో దొరికింది తిన్నదని తెలుసా?-star comedian bharti singh success story now earning 12 lakhs per episode once ate food from dustbin ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Star Comedian: ఒక్కో ఎపిసోడ్‌కు రూ.12 లక్షలు వసూలు చేసే కమెడియన్.. ఒకప్పుడు చెత్త కుప్పలో దొరికింది తిన్నదని తెలుసా?

Star Comedian: ఒక్కో ఎపిసోడ్‌కు రూ.12 లక్షలు వసూలు చేసే కమెడియన్.. ఒకప్పుడు చెత్త కుప్పలో దొరికింది తిన్నదని తెలుసా?

Hari Prasad S HT Telugu
Sep 04, 2024 11:25 AM IST

Star Comedian: ఈ స్టార్ కమెడియన్ ఇప్పుడు ఒక్కో ఎపిసోడ్ చేయడానికి ఏకంగా రూ.12 లక్షలు వసూలు చేస్తోంది. కానీ ఒకప్పుడు ఆమె తినడానికి సరైన తిండి లేక చెత్తకుప్పల్లో దొరికింది కూడా తిన్నదన్న విషయం మీకు తెలుసా? ఆమె సక్సెస్ స్టోరీ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఒక్కో ఎపిసోడ్‌కు రూ.12 లక్షలు వసూలు చేసే కమెడియన్.. ఒకప్పుడు చెత్త కుప్పలో దొరికింది తిన్నదని తెలుసా?
ఒక్కో ఎపిసోడ్‌కు రూ.12 లక్షలు వసూలు చేసే కమెడియన్.. ఒకప్పుడు చెత్త కుప్పలో దొరికింది తిన్నదని తెలుసా?

Star Comedian: చెత్తకుప్పల్లో దొరికింది తింటూ ఇప్పుడో స్టార్ కమెడియన్ గా ఎదిగిన ఈ వ్యక్తి సక్సెస్ స్టోరీ ఎవరికైనా ఆదర్శప్రాయమే. ఇలాంటి సక్సెస్ స్టోరీలు అన్ని సినిమా ఇండస్ట్రీల్లోనూ మన చూసినా.. ఈమెది మాత్రం మరింత ప్రత్యేకం. ఒకప్పుడు తినడానికి తిండి లేని పరిస్థితి నుంచి ఇప్పుడు ఎపిసోడ్ కు రూ.12 లక్షలు వసూలు చేసిన కమెడియన్ భారతీ సింగ్ స్టోరీ తెలుసుకుంటారా?

భారతీ సింగ్ సక్సెస్ స్టోరీ

భారతీ సింగ్.. తన మాటలతో మాయ చేస్తూ కామెడీ పండించే స్టార్ కమెడియన్. ఈమె బాలీవుడ్ లో పెద్ద స్టార్ ఏమీ కాదు. కానీ టీవీ షోల ద్వారా దేశమంతా తెలిసిన నటే. అయితే ఈమె చిన్నతనంలో ఎన్ని కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చిందన్నది మాత్రం చాలా మందికి తెలియదు. కటిక దరిద్రాన్ని అనుభవించిందామె.

ఇప్పుడు తన కామెడీ షోలతో పెద్ద సెలబ్రిటీగా మారిపోయి విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నా.. రెండేళ్ల వయసు ఉన్నప్పుడే తన తండ్రిని కోల్పోయిన ఆమె ఎదిగిన తీరు మాత్రం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ మధ్య టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారతీ సింగ్ తన గత జీవితం గురించి చెప్పుకొచ్చింది.

పేదరికాన్ని జయించాలనే..

ఆ ఇంటర్వ్యూలో భారతీ సింగ్ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. "నా దృష్టి ఎప్పుడూ పేదరికాన్ని జయించడంపైనే ఉండేది. నాకు రెండేళ్లప్పుడే మా నాన్న కన్నుమూశాడు. మా అన్నలు, అక్కలు వాళ్ల ఉద్యోగాలు మానేశారు.

వాళ్లు ఓ ఫ్యాక్టరీలో పని చేసేవాళ్లు. బ్లాంక్లెట్లు తయారు చేసే ఫ్యాక్టరీ అది. నా కుటుంబంతో చాలా పేదరికం అనుభవించాను. మరోసారి అలాంటిది చూడకూడదని అనుకున్నాను" అని భారతీ చెప్పింది.

అమ్మ టాయిలెట్లు కడిగేది

తన తల్లి టాయిలెట్లు క్లీన్ చేసేదని కూడా ఇదే ఇంటర్వ్యూలో భారతీ తెలిపింది. తాను కూడా చెత్తకుప్పల్లో దొరికింది తిన్నట్లు కూడా గుర్తు చేసుకుంది. "కొంతమంది సగం ఆపిల్ తిని చెత్తకుప్పల్లో పడేసేవారు. వాళ్లకు పాపం తగులుతుందని నేను అనుకునేదాన్ని. వాళ్లు అందులో పడేస్తే దానిని తీసుకొని మిగిలిన దానిని తినేయాలని అనిపించేది" అని భారతీ చెప్పింది.

తాను ఇంత పేదరికం అనుభవిస్తున్నా.. చిన్నతనం నుంచే ఆమెకు మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉండేది. దాంతోనే స్కూళ్లో తన ఫ్రెండ్స్ ను నవ్వించేది. అలా ఓసారి నేషనల్ యూత్ ఫెస్టివల్లో భారతీ సింగ్ చెప్పిన జోక్స్ కమెడియన్ సుదేశ్ లెహ్రీ దృష్టిలో పడ్డాయి. అతని ప్రోత్సాహంతోనే ఓ కామెడీ షోలో పాల్గొని ఎంపికైంది.

మారిపోయిన జీవితం

ఇక అక్కడి నుంచి ఆమె వెనుదిరిగి చూడలేదు. అప్పుడు ముంబైలో అడుగుపెట్టిన ఆమె మళ్లీ వెనక్కి వెళ్లలేదు. అలా మెల్లగా ఇండియాలోనే అత్యధిక మొత్తం అందుకునే కమెడియన్లలో ఒకరిగా నిలిచింది. ఆమె కామెడీ సర్కస్ కే మహాబలి, కామెడీ నైట్స్ బచావ్, ది కపిల్ శర్మ షోలాంటి ఎన్నో షోల ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది.

కొన్ని షోలకు హోస్ట్ గా కూడా వ్యవహరించింది. ప్రస్తుతం లాఫర్ చెఫ్స్ అనే రియాల్టీ షో హోస్ట్ చేస్తోంది. ఈ షోకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం భారతీ సింగ్ ఒక్కో ఎపిసోడ్ కు ఏకంగా రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షలు వసూలు చేస్తుండటం విశేషం.