Mammootty Records:ఒకే ఏడాదిలో 39 సినిమాలు - హీరోగా 400 మూవీస్ - మెగాస్టార్ రికార్డును బ్రేక్ చేయడం అసాధ్యమే!
20 March 2024, 13:01 IST
Mammootty Records: ఒకే ఏడాదిలో అత్యధిక సినిమాలు చేసిన రికార్డు మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి పేరు మీద ఉంది. 1985 ఏడాదిలో మమ్ముట్టి ఏకంగా 39 సినిమాలు చేశాడు.
మమ్ముట్టి
Mammootty Records: ఇదివరకు ఏడాదికి హీరోలు నాలుగైదు సినిమాలు చేయడం గొప్పగా ఫీలయ్యేవారు. ఇప్పుడు ఏడాదికి ఓ సినిమా చేయడమే గొప్పగా మారిపోయింది. ప్రభాస్, మహేష్‌బాబు, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు రెండు, మూడేళ్లకు ఓ సినిమా చేస్తున్నారు.
39 సినిమాలు...
మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి మాత్రం 1985 సంవత్సరంలో ఏకంగా 39 సినిమాలు చేశాడు. ఓ ఇయర్‌లో అత్యధిక సినిమాలు చేసిన హీరోగా మమ్ముట్టి నిలిచాడు. 39 సినిమాల్లో చాలా వరకు హీరోగా నటించిన సినిమాలే ఉన్నాయి. కొన్నింటిలో గెస్ట్ రోల్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపించాడు. మమ్ముట్టి ఈ రికార్డు నెలకొల్పి 19 ఏళ్లయినా ఇప్పటివరకు ఏ హీరో అతడి రికార్డును బ్రేక్ చేయలేకపోయాడు. అతడు 1982 సంవత్సరంలో హీరోగా ఏకంగా 24 సినిమాలు చేశాడు మమ్ముట్టి. ఓ ఏడాదిలో అత్యధిక సినిమాలు చేసిన హీరో కూడా అతడే కావడం గమనార్హం. వీటిలో ఇరవైకి పైగా సినిమాలు హిట్టయ్యాయి.
నాలుగేళ్లలో 143 సినిమాలు...
1983 ఏడాదిలో మమ్ముట్టి 35 సినిమాలు చేశాడు. 1984లో 34, 1985లో 39 సినిమాలు చేశాడు. 1986లో మమ్ముట్టి 35 సినిమాల్లో నటించాడు. నాలుగేళ్లలో ఏకంగా 143 సినిమాల్లో నటించాడు. నాలుగేళ్లలో ఓ హీరో చేసిన అత్యధిక సినిమాలు కూడా ఇవే కావడం గమనార్హం. రోజు 15 నుంచి 16 గంటల వరకు షూటింగ్ చేసిన సందర్భాలున్నాయని మమ్ముట్టి గతంలో ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
హీరోగా నాలుగు వందల సినిమాలు...
సుదీర్ఘ కెరీర్‌లో మమ్ముట్టి హీరోగా 403 సినిమాలు చేశాడు. కన్నూర్ స్క్వాడ్ మమ్ముట్టి హీరోగా నటించిన 400వ సినిమా. త్ ఇండస్ట్రీలో హీరోగా అత్యధిక సినిమాల్లో నటించిన రికార్డ్ కూడా మమ్ముట్టి పేరు మీద ఉంది. కన్నూర్ స్క్వాడ్ మూవీ బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. కన్నూర్ స్క్వాడ్‌లో నిజాయితీపరుడైన పోలీస్ ఆఫీసర్‌గా మమ్ముట్టి నటించాడు. మమ్ముట్టి ఇప్పటివరకు మూడు నేషనల్ అవార్డులను అందుకున్నాడు.
భ్రమయుగం రికార్డులు...
గత కొన్నాళ్లుగా పాత్రల పరంగా వైవిధ్యతకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారు మమ్ముట్టి. లేటెస్ట్ మూవీ భ్రమయుగంలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన మాంత్రికుడి పాత్రలో మమ్ముట్టి తన అసమాన నటనతో అదరగొట్టాడు. భ్రమయుగం మూవీ 10 రోజుల్లోనే యాభై కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. అతి తక్కువ టైమ్‌లో ఈ ఘనతను సాధించిన మలయాళం మూవీగా భ్రమయుగం నిలిచింది. గత మూడేళ్లుగా మమ్ముట్టి నటించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద యాభై కోట్ల వసూళ్లను సాధించాయి. ఈ రికార్డును సౌత్ ఇండస్ట్రీలో నెలకొల్పిన ఏకైక హీరో కూడా మమ్ముట్టి కావడం విశేషం.
విలన్‌గా మమ్ముట్టి...
భ్రమయుగంతో పాటు రోషాక్, పురు, అబ్రహం ఓజ్లర్ సినిమాల్లో మమ్ముట్టి విలన్‌గా నటించాడు. కాథల్ ది కోర్ మూవీలో హోమో సెక్సువల్ క్యారెక్టర్ చేశాడు. ఈ మలయాళం సినిమాలన్నీ కమర్షియల్ సక్సెస్‌లుగా నిలిచాయి. తెలుగులో ఇటీవల రిలీజైన యాత్ర 2లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాత్రలో మమ్ముట్టి నటించాడు. మలయాళం మాత్రమే కాకుండా తమిళం, తె లుగు భాషల్లో మమ్ముట్టి సినిమాలు క్రేజ్ ఉంది.
టాపిక్