Mammootty Movies on OTT: ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన మ‌మ్ముట్టి సినిమాలు ఇవే - వీటిపై ఓ లుక్కేయండి-bramayugam to rorschach mammootty must watch malayalam movies on ott ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Bramayugam To Rorschach Mammootty Must Watch Malayalam Movies On Ott

Mammootty Movies on OTT: ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన మ‌మ్ముట్టి సినిమాలు ఇవే - వీటిపై ఓ లుక్కేయండి

Mar 14, 2024, 01:26 PM IST Nelki Naresh Kumar
Mar 14, 2024, 01:26 PM , IST

మ‌ల‌యాళం సినీ ప‌రిశ్ర‌మ‌లో వైవిధ్య‌త‌కు పెట్టింది పేరు మ‌మ్ముట్టి. మ‌ల‌యాళంలో మ‌మ్ముట్టి చేసిన ప్ర‌యోగాలు ఏ న‌టుడు చేయ‌లేదంటే అతిశ‌యోక్తి లేదు. ఇటీవ‌ల కాలంలో ప్ర‌యోగాత్మ‌క క‌థాంశాల‌తో మ‌మ్ముట్టి చేసిన ప‌లు సినిమాలు ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తున్నాయి. ఈ సినిమాలు ఏ ఓటీటీలో చూడొచ్చంటే?

మ‌మ్ముట్టి హీరోగా న‌టించిన భ్ర‌మ‌యుగం మార్చి 15 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. బ్లాక్ అండ్ వైట్ ఫార్మెట్‌లో తెర‌కెక్కిన ఈ హార‌ర్ మూవీ థియేట‌ర్ల‌లో 80 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. భ్ర‌మ‌యుగం సినిమాకు రాహుల్ స‌దాశివ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. 

(1 / 5)

హోమోసెక్సువ‌ల్ కాన్సెప్ట్‌తో మ‌మ్ముట్టి చేసిన కాథ‌ల్ ది కోర్ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో ఇటీవ‌ల రిలీజైంది. ఈ మ‌ల‌యాళం మూవీలో జ్యోతిక కీల‌క పాత్ర‌లో న‌టించింది. 

(2 / 5)

మ‌మ్ముట్టి పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించిన క‌న్నూర్ స్క్వాడ్ మూవీ  విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకున్న‌ది. య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా డైరెక్ట‌ర్ రాబీ వ‌ర్గీస్ రాజ్ తెర‌కెక్కించిన  ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా స‌క్సెస్‌గా నిలిచింది.  క‌న్నూర్ స్వ్యాడ్ మూవీని డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో ఓటీటీ ఫ్యాన్స్ చూడొచ్చు. 

(3 / 5)

మ‌మ్ముట్టి విల‌న్‌గా న‌టించిన పురు మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. త‌క్కువ కులం వాడిని పెళ్లిచేసుకుంద‌నే కోపంతో త‌న సోద‌రిని హ‌త‌మార్చిన పోలీస్ ఆఫీస‌ర్‌గా మ‌మ్ముట్టి త‌న విల‌నిజంతో అభిమానుల‌ను భ‌య‌పెట్టాడు. 

(4 / 5)

మ‌ల‌యాళం సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ రొషాక్ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. ఈ మూవీలో చ‌నిపోయిన వ్య‌క్తిపై ప్ర‌తీకారం తీర్చుకునే వ్య‌క్తిగా మ‌మ్ముట్టి క‌నిపించాడు. నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్ చేశాడు. 

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు