తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Churuli Review: చురులి రివ్యూ.. ట్విస్టులతో మతి పోగొట్టే మలయాళ ఓటీటీ మూవీ.. ఎలా ఉందంటే?

Churuli Review: చురులి రివ్యూ.. ట్విస్టులతో మతి పోగొట్టే మలయాళ ఓటీటీ మూవీ.. ఎలా ఉందంటే?

Sanjiv Kumar HT Telugu

05 June 2024, 12:51 IST

google News
  • Churuli Movie Review In Telugu: అదిరిపోయే ట్విస్టులతో మతి పోగొట్టే మలయాళ సినిమా చురులి. ప్రస్తుతం సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మలయాళ సైన్స్ ఫిక్షన్, టైమ్ లూప్, హారర్, సస్పెన్స్ మూవీ ఎలా ఉందో చురులి రివ్యూలో తెలుసుకుందాం.

చురులి రివ్యూ.. ట్విస్టులతో మతి పోగొట్టే మలయాళ ఓటీటీ మూవీ.. ఎలా ఉందంటే?
చురులి రివ్యూ.. ట్విస్టులతో మతి పోగొట్టే మలయాళ ఓటీటీ మూవీ.. ఎలా ఉందంటే?

చురులి రివ్యూ.. ట్విస్టులతో మతి పోగొట్టే మలయాళ ఓటీటీ మూవీ.. ఎలా ఉందంటే?

టైటిల్: చురులి

నటీనటులు: చెంబన్ వినోద్ జోస్, వినయ్ ఫోర్ట్, జోజు జార్జ్, సౌబిన్ షాహిర్, జాఫర్ ఇడుక్కి, గీతి సంగీత తదితరులు

కథ: వినయ్ థామస్

దర్శకత్వం: లిజో జోస్ పెల్లిస్సేరీ

సినిమాటోగ్రఫీ: మధు నీలకందన్

సంగీతం: శ్రీరాగ్ సాజీ

నిర్మాతలు: లిజో జోస్ పెల్లిస్సేరీ, చెంబన్ వినోద్ జోస్

ఓటీటీ ప్లాట్‌ఫామ్: సోనీ లివ్

Churuli Review In Telugu: మలయాళ సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. అలాంటిది మైండ్ బ్లాక్ అయ్యేలా, మెదడుకు పదును పెట్టడంతో మతి పోగొట్టే మలయాళ సినిమానే చురులి. మలయాళ స్టార్ యాక్టర్స్ జోజు జార్జ్, సౌబిన్ షాహిర్ నటించిన ఈ సినిమాలో చెంబన్ వినోద్ జోస్, వినయ్ ఫోర్ట్ ప్రధాన పాత్రలు పోషించారు.

ఏలియన్స్-హారర్

సైన్స్ ఫిక్షన్, టైమ్ లూప్, ఏలియన్స్, సస్పెన్స్, హారర్ వంటి సైంటిఫిక్ అంశాలతో తెరకెక్కిన ఈ మలయాళ సినిమా చురులి 2021 ఫిబ్రవరిలో వచ్చింది. అదే సంవత్సరం నవంబర్‌లో సోనీ లివ్ ఓటీటీలో మలయాళంతోపాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది చురులి మూవీ. ఐఎమ్‌డీబీ 10కి 7 రేటింగ్ ఇచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చురులి రివ్యూలో చూద్దాం.

కథ:

జాయ్ (సౌబిన్ షాహిర్) అనే క్రిమినల్‌ను పట్టుకునేందుకు ఆంటోనీ (ఏఎస్సై), షాజీవన్ (కానిస్టేబుల్)గా పేర్లు మార్చుకుని దట్టమైన అడవి మధ్యలో ఉండే చురులి అనే గ్రామంలోకి వెళ్తారు ఇద్దరు అండర్ కవర్ పోలీసులు. చురులిలో తంకన్ (జోజు జార్జ్) అనే వ్యక్తి రబ్బర్ తోటలో గుంతలు తవ్వడానికి వచ్చిన కూలీలుగా తమను పరిచయం చేసుకుంటారు. ఆ సమయంలో తంకన్ ఊరిలో లేకపోవడంతో వారిని కల్లు దుకాణం యజమాని (జాఫర్ ఇడుక్కి) పనిలో పెట్టుకుంటాడు.

హైలెట్స్

జాయ్‌ ఎవరో తెలుసుకుని పట్టుకునేందుకు కల్లు దుకాణంలో చేరుతారు ఆంటోనీ, షాజీవన్. చురులిలోకి అడుగుపెట్టిన ఆ పోలీసులకు ఎదురైన అనుభవాలు ఏంటీ? అక్కడున్న గ్రామస్థులు ప్రవర్తన ఎలా ఉంది? రాత్రుళ్లు షాజీవన్‌కు వచ్చే కలలకు అర్థం ఏంటీ? షాజీవన్‌కే ఎందుకు ఏలియన్స్ కనిపిస్తున్నారు? జాయ్‌ను పోలీసులు పట్టుకున్నారా? అసలు జాయ్ చేసిన నేరాలు ఏంటీ? అనే విషయాలు తెలియాలంటే కచ్చితంగా చురులి చూడాల్సిందే.

విశ్లేషణ:

చురులి మూవీ ఒక అబ్సర్డ్ సైంటిఫిక్ అండ్ లూప్ థ్రిల్లర్ మూవీ. అబ్సర్డ్ అంటే ప్రేక్షకుడు తనకు ఇష్టమొచ్చినట్లుగా ఊహించుకోవచ్చు. ఈ సినిమా పూర్తి కాగానే ఆడియెన్స్‌లో వివిధ రకాల ఆలోచనలు పరుగెత్తుంటాయి. అసలు ఈ సినిమాలో ఏముంది, ఏం చూపించారు అనే ఫీలింగ్ కూడా వస్తుంది. కానీ, మూవీలో అక్కడక్కడ కొన్ని హింట్స్ వదిలాడు డైరెక్టర్. సినిమాను చాలా కాన్సంట్రేట్‌గా చూస్తే తప్పా మూవీలోని లాజిక్, హింట్స్ అర్థం కావు.

ముందు చెప్పిన కథలాగే

చురులి మూవీ ఒక కథతో ప్రారంభం అవుతుంది. ఆ కథలో ఉన్నట్లుగానే సినిమా ఉంటుంది. తర్వాత జాయ్ అనే క్రిమినల్ కోసం ఇద్దరు పోలీసులు పేర్లు మార్చుకోవడం, చురులిలోకి జీపులో వెళ్లడంతో కథ స్టార్ట్ అవుతుంది. పోలీసులు వెళ్లేటప్పుడే వాళ్లు ఎక్కడికి వెళ్తున్నారో కూడా డైరెక్టర్ హింట్ ఇస్తాడు. కర్రలతో చేసిన బ్రిడ్జిని జీప్ దాటగానే పెద్ద ట్విస్ట్ ఎదురవుతుంది.

పది నిమిషాలకే ట్విస్ట్

ఆంటోనీ, షాజీవన్‌తో అప్పటివరకు ప్రేమగా, చాలా మర్యాదగా మాట్లాడిన జీపు డ్రైవర్‌, అందులో ఉన్న మిగతా వాళ్లు బ్రిడ్జి దాటగానే మారిపోతారు. కారణం లేకుండా ఇద్దరి తిడుతూ అగ్రెసివ్‌గా బిహేవ్ చేస్తుంటారు. దాన్ని బట్టే తెలుస్తుంది చురులి గ్రామం ఎలా ఉంటుందో. దీని నుంచి చాలా రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఆ గ్రామాన్ని ఏలియన్స్ కంట్రోల్ చేస్తుంటారని, అందుకే బార్డర్ దాటగానే గ్రామస్థుల మైండ్ వాటి కంట్రోల్‌లోకి వెళ్తుందని అర్థం చేసుకోవచ్చు.

మైండ్ పోయే నేరేషన్

అయితే, సినిమాలో ఉన్న ట్విస్టులు, హింట్స్ జాగ్రత్తగా పరిశీలిస్తే తప్పా అర్థం చేసుకోలేం. వాటికి మైండ్ పోవాల్సిందే. సినిమాలో ఏలియన్స్ కనిపించడం, ఒకానొక సమయంలో షాజీవన్ విచిత్రంగా ప్రవర్తించడం, అతన్ని ఇదివరకే చూసినట్లు గ్రామస్థులు చెప్పడం అన్నీ వింత ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి. ఇక సన్నివేశాలకు వచ్చే బీజీఎమ్ అదిరిపోయింది. ఏలియన్స్ వస్తున్నట్లు ఇచ్చే ఇండికేషన్ బీజీఎమ్ కొత్తగా ఉంటుంది.

డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్

Churuli Explained In Telugu: ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు చాలా బాగుంటాయి. క్లైమాక్స్‌లో ఏం జరిగిందే చాలా వరకు ప్రేక్షకులకు అర్థం కాదు. సినిమా ఒక లూప్‌లో జరుగుతుందని అర్థం చేసుకోవాలి. కాకపోతే చాలమందికి సినిమా అంతగా నచ్చదు. కానీ, ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది ఈ చురులి మూవీ. మెదడుకు పని చెప్పే సినిమాలు ఇష్టముండే వాళ్లు ఈ చురులిని కచ్చితంగా చూడాల్సిందే.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం