Gam Gam Ganesha OTT: ఓటీటీలోకి తెలుగు క్రైమ్ కామెడీ మూవీ.. ఏ రోజు నుంచి స్ట్రీమింగ్ అంటే?-anand deverakonda gam gam ganesha ott streaming on amazon prime crime comedy movie gam gam ganesha digital premiere ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gam Gam Ganesha Ott: ఓటీటీలోకి తెలుగు క్రైమ్ కామెడీ మూవీ.. ఏ రోజు నుంచి స్ట్రీమింగ్ అంటే?

Gam Gam Ganesha OTT: ఓటీటీలోకి తెలుగు క్రైమ్ కామెడీ మూవీ.. ఏ రోజు నుంచి స్ట్రీమింగ్ అంటే?

Sanjiv Kumar HT Telugu
Jun 04, 2024 12:18 PM IST

Gam Gam Ganesha OTT Streaming: ఓటీటీలోకి వచ్చేయనుంది ఆనంద్ దేవరకొండ నటించిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ గం గం గణేశా. ఇటీవల మే 31న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైన గం గం గణేశా మూవీ ఓటీటీ పార్టనర్, రిలీజ్ డేట్ ఇదేనంటూ వార్తలు వస్తున్నాయి.

ఓటీటీలోకి తెలుగు క్రైమ్ కామెడీ మూవీ.. ఏ రోజు నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి తెలుగు క్రైమ్ కామెడీ మూవీ.. ఏ రోజు నుంచి స్ట్రీమింగ్ అంటే?

Gam Gam Ganesha OTT Release: విజయ్ దేవరకొండ తమ్ముడు చిన్న రౌడీ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ క్రైమ్ కామెడీ మూవీ గం గం గణేశా. ఈ సినిమాకు ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వం వహించారు. ఈ మూవీతోనే తెలుగులో డైరెక్టర్‌గా ఆయన పరిచయం అయ్యాడు.

దర్శకుడి లాగానే గం గం గణేశా నిర్మాత వంశీ కారుమంచి సైతం ఇదే మూవీతో టాలీవుడ్‌లో ప్రొడ్యూసర్‌గా అరంగేట్రం చేశారు. హైలైఫ్ ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్ లో తన స్నేహితుడు కేదార్ సెలగంశెట్టితో కలిసి ఆయన ఈ సినిమాను నిర్మించారు. యాక్షన్ క్రైమ్ కామెడీ మూవీగా వచ్చిన ఈ సినిమా ఈ నెల 31న గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ అయింది.

సినిమా విడుదలైనప్పటి నుంచి గం గం గణేశాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. కథ పాతదైనప్పటికీ టేకింగ్ బాగుందని, ఆనంద్ దేవరకొండ యాక్టింగ్ సూపర్బ్‌గా ఉందని ప్రశంసలు వచ్చాయి. సినిమాలో కామెడీతోపాటు ట్విస్టులు అదిరిపోయాయని నెటిజన్స్, పలువురు రివ్యూవర్స్ రివ్యూలు ఇచ్చారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేయనుంది.

గం గం గణేశా సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ సొంతం చేసుకుంది. అందుకు భారీగానే మొత్తం చెల్లించారని సమాచారం. ఇక ఈ సినిమాను ఓటీటీలోకి థియేట్రికల్ రిలీజ్‌కు 30 రోజుల తర్వాతే తీసుకురానున్నట్లు టాక్ నడుస్తోంది. కలెక్షన్స్, టాక్ పరంగా మార్పులు జరిగే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ఈ సినిమా జూలై మొదటి వారంలో లేదా జూన్ చివరి వారంలో ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.

కాగా ఈ సినిమాలో నయన సారిక, ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్‌గా నటించారు. జబర్దస్త్ ఇమ్మాన్యూయెల్, బిగ్ బాస్ ప్రిన్స్ యావర్, వెన్నెల కిశోర్ ఇతర కీలక పాత్రలు పోషించారు. అలాగే ఈ సినిమాకు ఆర్ఎక్స్ 100 మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ సంగీతం అందించాడు. అయితే, గం గం గణేశా సినిమాలో పాటలు అంతగా బాగా లేవని నెగెటివ్ టాక్ వచ్చింది.

సినిమా స్టోరీ, సెకండాఫ్‌లో బోర్ కొట్టించే సీన్స్ ఉన్నాయని రివ్యూవర్స్ చెప్పారు. ఇక ఈ మూవీ ఒక వస్తువు చుట్టూ సాగుతుంది. ఆ వస్తువు ఏంటీ, అందులో ఏముంది.. అది చివరికీ హీరోకు దొరికిందా లేదా అనే ప్లాట్‌తో సినిమా ఉంటుంది. ఇదిలా ఉంటే, రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోదరుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆనంద్ దేవరకొండ.

ఇటీవల బేబి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆనంద్ దేవరకొండ దొరసాని చిత్రంతో హీరోగా డెబ్యూ ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే ఓటీటీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇందులో బొంబాయ్ చట్నీ తయారు చేసే యువకుడిగా ఆకట్టుకున్నాడు.

అనంతరం పుష్పక విమానం మూవీతో కూడా మంచి పేరే తెచ్చుకున్నాడు ఆనంద్ దేవరకొండ. పెళ్లయిన రోజే భార్య లేచిపోతే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో సస్పెన్స్ క్రైమ్ కామెడీ సినిమాగా పుష్పక విమానం తెరకెక్కింది. ఆ తర్వాత హైవే అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఆనంద్ దేవరకొండ. ఆ చిత్రం మాత్రం ప్లాప్‌గా నిలిచింది.

టీ20 వరల్డ్ కప్ 2024