తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Malayalam Ott: ఇసుక మాఫియాపై వ‌చ్చిన మాలీవుడ్‌ యాక్ష‌న్ మూవీ - ఏ ఓటీటీలో చూడాలంటే?

Malayalam OTT: ఇసుక మాఫియాపై వ‌చ్చిన మాలీవుడ్‌ యాక్ష‌న్ మూవీ - ఏ ఓటీటీలో చూడాలంటే?

19 December 2024, 9:35 IST

google News
  • Malayalam OTT: మ‌ల‌యాళం యాక్ష‌న్ డ్రామా మూవీ క‌డ‌క‌న్ మూవీ స‌న్ నెక్స్ట్ ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఇసుక మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ మూవీలో హ‌కీమ్ షాజ‌హాన్‌, రంజిత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమాకు గోపీ సుంద‌ర్ మ్యూజిక్ అందించాడు.

మ‌ల‌యాళం ఓటీటీ
మ‌ల‌యాళం ఓటీటీ

మ‌ల‌యాళం ఓటీటీ

Malayalam OTT: ఇసుక మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చిన మ‌ల‌యాళం మూవీ క‌డ‌క‌న్ థియేట‌ర్ల‌లో రిలీజైన ప‌ది నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకివ‌స్తోంది. క‌డ‌క‌న్ మూవీకి సాజిల్ మాంపాడ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ ఏడాది మార్చిలో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ ఆడియెన్స్‌తో పాటు క్రిటిక్స్‌ను మెప్పించింది.

క‌డ‌క‌న్ మూవీ స‌న్ నెక్స్ట్ ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. డిసెంబ‌ర్ 20 నుంచి ఈ మ‌ల‌యాళం మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.

మాలీవుడ్‌లోకి ఎంట్రీ...

క‌డ‌క‌న్ సినిమాలో హ‌కీమ్ షాజ‌హాన్‌, రంజిత్, శ‌ర‌త్ స‌భా, జాఫ‌ర్ ఇడుక్కి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఈ యాక్ష‌న్ డ్రామా మూవీ ద్వారా హీరోహీరోయిన్ల‌తో పాటు ప‌లువురు న‌టీన‌టులు మాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

ఇసుక మాఫియా నేప‌థ్యంలో వాస్త‌వంగా జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌కు ఫిక్ష‌న‌ల్ అంశాల‌ను జోడించి ఈ క‌థ‌ను త‌యారు చేసుకున్న‌ట్లు ప్ర‌మోష‌న్స్‌లో ద‌ర్శ‌కుడు వెల్ల‌డించాడు. ఇసుక మాఫియా క్రైమ్ చిక్కుకొని కొంద‌రు అమాయ‌కులు ఎలా ప్రాణాల‌ను కోల్పోతున్నారు అనే మెసేజ్‌ను ఈ మూవీలో చూపించారు.

మూవీ క‌థ ఇదే...

నీలంబూర్ ఏరియాలో ఇసుక మాఫియా గ్యాంగ్స్ లీడ‌ర్స్ మ‌ణి, సుల్ఫీ మ‌ధ్య విభేదాలు ఉంటాయి. కుటుంబాల మ‌ధ్య ఉన్న స్నేహం ఇసుక అక్ర‌మ ర‌వాణా కార‌ణంగా శ‌త్రుత్వంగా మారుతుంది. ల‌క్ష్మిని సుల్ఫీ ప్రాణంగా ప్రేమిస్తాడు. ఆమె ప్రేమ కోసం మాఫియా బిజినెస్‌కు దూరంగా వెళ్లిపోవాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. అనుకోకుండా సుల్ఫీ లోక‌ల్ సీఐ రంజిత్‌తో గొడ‌వ‌ప‌డ‌తాడు.

మ‌ణితో చేతులు క‌లిపిన రంజిత్ సుల్ఫీని దెబ్బ తీసేందుకు కుట్ర‌లు ప‌న్నుతాడు. సుల్ఫీని అరెస్ట్ చేయాల‌ని అనుకుంటాడు. రంజిత్‌, మ‌ణి ప్లాన్స్‌ను సుల్ఫీ ఎలా ఎదుర్కొన్నాడు? ఇసుక మాఫియా అక్ర‌మ దందాను వ‌దిలిపెడ‌తాన‌ని ప్రియురాలికి ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకున్నాడా? లేదా? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

గోపీ సుంద‌ర్ మ్యూజిక్‌...

క‌డ‌క‌న్ మూవీకి గీత గోవిందం ఫేమ్‌ గోపీ సుంద‌ర్ మ్యూజిక్ అందించాడు. ఈ మూవీ స‌క్సెస్‌లో గోపీ సుంద‌ర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కీల‌కంగా నిలిచింది. మంజుమ్మేల్ బాయ్స్‌, అన్వేషిప్పిమ్ కండేతుమ్ లాంటి సినిమాల‌తో పోటీప‌డి థియేట‌ర్ల‌లో క‌డ‌క‌న్ మూవీ మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.కాన్సెప్ట్‌తో పాటు యాక్ష‌న్ సీక్వెన్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి.

తదుపరి వ్యాసం