Romantic Comedy OTT:ఓటీటీలోకి తెలుగు హీరోయిన్ నటించిన కన్నడ బ్లాక్‌బస్టర్ రొమాంటిక్ కామెడీ మూవీ
23 September 2024, 10:08 IST
OTT: తెలుగు హీరోయిన్ మాళవికా నాయర్ కృష్ణమ్ ప్రణయ సఖి మూవీతో కన్నడంలో ఎంట్రీ ఇచ్చింది. 2024లో కన్నడంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సెకండ్ మూవీగా నిలిచిన కృష్ణమ్ ప్రణయ సఖి ఓటీటీలోకి రాబోతోంది. అమెజాన్ ప్రైమ్‌లో అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
రొమాంటిక్ కామెడీ ఓటీటీ
Romantic Comedy OTT: టాలీవుడ్ హీరోయిన్ మాళవికా నాయర్ కృష్ణమ్ ప్రణయ సఖి మూవీతో కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. రొమాంటిక్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ ఏడాది కన్నడంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో సెకండ్ ప్లేస్‌లో నిలిచింది.
గోల్డెన్ స్టార్ గణేష్...
కృష్ణమ్ ప్రణయ సఖి మూవీలో గోల్డెన్ స్టార్ గణేష్ హీరోగా నటించాడు. ఈ రొమాంటిక్ మూవీకి దండుపాళ్యం ఫేమ్ శ్రీనివాసరాజు దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో మాళవికానాయర్‌తో పాటు శరణ్య శెట్టి మరో కథానాయికగా కనిపించింది.
అమెజాన్ ప్రైమ్‌లో...
మాళవికానాయర్ కన్నడ డెబ్యూ మూవీ ఓటీటీలోకి వస్తోంది. కృష్ణమ్ ప్రణయ సఖి ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నది. అక్టోబర్ 4న అమెజాన్ ప్రైమ్‌లో కృష్ణమ్ ప్రణయ సఖి మూవీ రిలీజ్ కానున్నట్లు చెబుతోన్నారు. కన్నడంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
30 కోట్ల కలెక్షన్స్...
కృష్ణమ్ ప్రణయ సఖి మూవీపై ఫస్ట్ వీక్‌లో మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కాన్సెప్ట్‌తోపాటు కామెడీ బాగుండటం, మౌత్‌టాక్ కారణంగా వసూళ్లు రోజురోజుకు పెరుగుతూ వచ్చాయి. ఎనిమిది కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 30 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. ఈ ఏడాది కన్నడంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
కృష్ణమ్ ప్రణయ సఖి కథ ఇదే...
కృష్ణ (గణేష్) హార్వర్డ్ యూనివర్సిటీలో ఎమ్‌బీఏ పూర్తి చేసి ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటుంటాడు. 30 ఏళ్లు వచ్చిన పెళ్లి ఊసు ఎత్తకపోవడంతో కుటుంబసభ్యులే అతడి కోసం సంబంధాలు చూడటం మొదలుపెడతారు. తమది పెద్ద ఉమ్మడి కుటుంబం కావడంతో ఫ్యామిలీలో అడ్జెస్ట్ అయ్యే అమ్మాయిని ప్రేమించి పెళ్లిచేసుకోవాలని కృష్ణ ఆశపడతాడు. అలాంటి టైమ్‌లోనే ప్రణయ (మాళవికానాయర్) అతడికి పరిచయం అవుతుంది.
అనాథశ్రమంలో పెరిగిన ప్రణయ...ఆ ఆశ్రమ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుంది. తొలిచూపులోనే ప్రణయను ఇష్టపడిన కృష్ణ ఆమె ప్రేమ కోసం కోటీశ్వరుడిననే నిజాన్ని దాచి డ్రైవర్‌గా నాటకం ఆడుతాడు.
మరోవైపు కృష్ణను పెళ్లిచేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బతుకుతుంటుంది జాహ్నవి (శరణ్య శెట్టి). ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరీ ఎలాంటి మలుపులు తిరిగింది? ప్రణయ, జాహ్నవిలలో కృష్ణ ఎవరిని పెళ్లిచేసుకున్నాడు? కృష్ణ ఆడిన నాటకం ప్రణయకు తెలిసిందా? లేదా అన్నదే కృష్ణమ్ ప్రణయ సఖి మూవీ కథ.
ఎవడే సుబ్రహ్మణ్యంతో...
నాని, విజయ్ దేవరకొండ హీరోలుగా నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మాళవికానాయర్. మహానటి, ట్యాక్సీవాలా, కళ్యాణ వైభోగమే సినిమాలతో ప్రేక్షకులను మెప్పించింది. గ్లామర్‌కు దూరంగా యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్రలపై ఫోకస్ పెడుతూ తెలుగులో సినిమాలు చేస్తోంది.
ప్రభాస్ కల్కిలో…
ప్రభాస్ కల్కిలో గెస్ట్ పాత్రలో మాళవికా నాయర్ నటించింది. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా అభిలాష్ కంకర దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీలో మాళవికా నాయర్ హీరోయిన్‌గా నటిస్తోంది.