Kalki 2898 Ad OTT: ప్రభాస్ కల్కి రిలీజ్ ఆ ఓటీటీలోనే...రెండు నెలల తర్వాతే స్ట్రీమింగ్!
Kalki 2898 Ad OTT: కల్కి మూవీ ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నది. ఎనిమిది వారాల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. ఆగస్ట్‌లో కల్కి అమెజాన్ ప్రైమ్‌లో రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు.
Kalki 2898 Ad OTT: ప్రభాస్ కల్కి మూవీ నేడు(జూన్ 27న) వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. పురాణాలకు గ్రాఫిక్స్, విజువల్స్ హంగులను జోడించి దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కి మూవీని తెరకెక్కించాడు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీలో కమల్ హాసన్ విలన్‌గా కనిపించగా అమితాబ్‌బచ్చన్, దీపికా పదుకోణ్ కీలక పాత్రల్లో కనిపించారు.
దాదాపు ఆరు వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే దాదాపు నలభై కోట్ల వరకు రాబట్టింది. తొలిరోజు కల్కి మూవీ వంద కోట్లకుపైనే వసూళ్లను రాబట్టే అవకాశం ఉన్నట్లు టాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అమెజాన్ ప్రైమ్ వీడియో...
కాగా కల్కి మూవీ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నది. కల్కి డిజిటల్ స్ట్రీమింగ్ అమెజాన్‌లోనే అని టైటిల్ కార్డ్స్‌లో చిత్ర యూనిట్ ప్రకటించింది. భారీ పోటీ మధ్య దాదాపు 150 కోట్లకు ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి.
స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కల్కి మూవీ థియేటర్లలో రిలీజైన ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీ రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆగస్ట్ నెలాఖరున కల్కి మూవీ ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు. ఆగస్ట్‌లోనే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ రానున్నట్లు సమాచారం.
మహాభారతం స్ఫూర్తితో...
మహాభారతానికి సైన్స్ ఫిక్షన్ అంశాలను ముడిపెడుతూ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ మూవీని తెరకెక్కించాడు. ఇందులో భైరవ అనే సూపర్ హీరోగా ప్రభాస్ కామెడీ టైమింగ్, అతడిపై చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్స్ అభిమానులను ఆకట్టుకుంటోన్నాయి. అమితాబ్ బచ్చన్, ప్రభాస్ మధ్య వచ్చే సీన్స్ గూస్‌బంప్స్‌ను కలిగిస్తున్నాయి.
సుప్రీమ్ యాశ్కిన్ క్యారెక్టర్‌లో విలన్‌గా ఈ మూవీలో కమల్‌హాసన్ కనిపించాడు. అశ్వత్థామగా అమిగాబ్‌బచ్చన్ నటించాడు. కల్కి మూవీలో టాలీవుడ్ డైరెక్టర్లు ఆర్‌జీవీ, రాజమౌళితో యంగ్ హీరోలు దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ గెస్ట్ పాత్రల్లో కనిపించారు. మృణాల్ ఠాకూర్, అన్నాబెన్, శోభన, రాజేంద్రప్రసాద్, పశుపతితో పాటు పలువురు తెలుగు, తమిళ నటులు కీలక పాత్రల్లో కనిపించారు.
కల్కి కథ ఇదే...
భూమి మొత్తాన్ని నాశనం చేసి కాంప్లెక్స్ పేరుతో సుప్రీమ్ యాశ్కిన్ కొత్త వరల్డ్‌ను క్రియేట్ చేస్తాడు. ఆ వరల్డ్ లోకి ఎంట్రీ భైరవ ఎందుకు ప్రయత్నించాడు? కాంప్లెక్స్ నుంచి తప్పించుకున్న సుమతి ఎవరు? ఆమెను అశ్వత్థామ ఎందుకు కాపాడాడు అన్నదే ఈ మూవీ కథ.
ఈ సినిమాలోని గ్రాఫిక్స్, విజువల్స్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఉన్నాయని అభిమానులు అంటున్నారు. దాదాపు ఆరు వందల కోట్ల బడ్జెట్‌తో వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ ఈ మూవీని తెరకెక్కించాడు. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు.