OTT: ఓటీటీలో దూసుకెళుతున్న ఆమిర్ ఖాన్ కుమారుడి సినిమా.. ట్రెండింగ్‍లో టాప్
OTT: మహారాజ్ సినిమా నేరుగా ఓటీటీలోకి అడుగుపెట్టింది. కోర్టులో కేసులను ఎదుర్కొని ఆలస్యంగా స్ట్రీమింగ్‍కు వచ్చింది. అయితే, ఈ చిత్రానికి భారీ వ్యూస్ దక్కుతున్నాయి. ప్రస్తుతం ఓటీటీలో టాప్‍లో ట్రెండ్ అవుతోంది.
బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ తెరంగేట్రం చేశారు. ‘మహారాజ్’ అనే పీరియాడిక్ బయోపిక్ మూవీతో సినిమాల్లోకి అడుగుపెట్టారు. ఈ చిత్రం థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చింది. ఈ మూవీ స్ట్రీమింగ్‍కు ముందే వివాదం రేగింది. కోర్టులో పిటిషన్ నమోదైంది. అయితే, ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించడంతో జునైద్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించిన మహారాజ్ చిత్రం జూన్ 21న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ట్రెండింగ్‍లో టాప్
మహారాజ్ సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో దూసుకెళుతోంది. ప్రస్తుతం (జూన్ 26) ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఇండియా ట్రెండింగ్ సినిమాల్లో టాప్‍లోకి వచ్చేసింది. స్ట్రీమింగ్‍కు వచ్చిన ఐదు రోజుల్లోనే అగ్రస్థానంలో ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
మహారాజ్ సినిమాకు మల్హోత్రా పి సిద్ధార్థ్ దర్శకత్వం వహించారు. 1800ల బ్యాక్‍డ్రాప్‍తో ఈ చిత్రం తెరకెక్కింది. ప్రముఖ పాత్రికేయుడు, సంఘ సంస్కర్త కరందాస్ ముల్జీ జీవితంపై ఈ చిత్రం తెరకెక్కింది. ముల్జీ పాత్రను జునైద్ ఖాన్ పోషించారు. ఓ బాబా ఆరాచకాలను ముల్జీ వెలుగులోకి తీసుకొచ్చి పోరాడడంపై ఈ చిత్రం రూపొందింది.
సౌరభ్ షా రచించిన పుస్తకం ఆధారంగా మహారాజ్ మూవీని దర్శకుడు మల్హోత్రా తెరకెక్కించారు. ఈ సినిమాకు మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. అయితే, జునైద్ ఖాన్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. మొదటి చిత్రంలోనే అతడు తన యాక్టింగ్ టాలెంట్‍తో మెప్పించారు. ఈ చిత్రంలో జయదీప్ అహ్లావత్, షాలినీ పాండే, శార్వరీ వాఘ్, మెహర్ విజ్, హేమంత్ చౌదరి కీలకపాత్రలు పోషించారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ మహారాజ్ మూవీకి సొహైల్ సేన్ సంగీతం అందించారు.
కోర్టు కేసు
మహారాజ్ చిత్రంపై గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ చిత్రం తమ మనోభావాలను కించపరిచేలా అభ్యంతరకంగా ఉందని, రిలీజ్ ఆపాలని ఓ హిందూ సంఘం పిటిషన్ వేసింది. దీంతో జూన్ 14న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కావాల్సిన ఈ చిత్రంపై న్యాయస్థానం స్టే విధించింది. అనంతరం ఈ చిత్రాన్ని చూసి ఎలాంటి అభ్యంతరకరమైన విషయాలు లేవని నిర్ధారించిన కోర్టు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కాస్త ఆలస్యంగా జూన్ 21న మహారాజ్ మూవీ స్ట్రీమింగ్‍కు వచ్చింది. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో మంచి వ్యూస్ సాధిస్తోంది.
నెట్‍ఫ్లిక్స్‌లో ప్రస్తుతం (జూన్ 26) టాప్-10లో సినిమాలు
- మహారాజ్ - హిందీ
- ట్రిగర్ వార్నింగ్ - ఇంగ్లిష్
- కొకైన్ బీర్ - ఇంగ్లిష్
- బడే మియా చోటే మియా - హిందీ
- లాపతా లేడీస్ - హిందీ
- క్రూ - హిందీ
- షైతాన్ - హిందీ
- డ్రాకులా అన్‍టోల్డ్ - ఇంగ్లిష్
- గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి - తెలుగు
- అండర్ పారిస్ - ఫ్రెంచ్
వెబ్ సిరీస్‍ల విభాగంలో ప్రస్తుతం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో కోటా ఫ్యాక్టరీ మూడో సీజన్ టాప్‍లో ట్రెండ్ అవుతోంది. ఐఐటీ, జేఈఈ కోచింగ్‍ల వెనుక ఉన్న విషాదాలపై ఈ సిరీస్ రూపొందింది. జూన్ 20వ తేదీన కోటా ఫ్యాక్టరీ మూడో సీజన్ స్ట్రీమింగ్‍కు వచ్చింది. జితేంద్ర కుమార్ ఈ సిరీస్‍లో ప్రధాన పాత్ర పోషించారు. ప్రతిశ్ మెహతా ఈ సీజన్‍కు దర్శకత్వం వహించారు.
టాపిక్