OTT Top Movies: ఈ వారం ఓటీటీల్లోకి రానున్న టాప్-5 సినిమాలు.. యాక్షన్, హారర్, రొమాంటిక్..
OTT Top 5 Movie this Week: ఓటీటీల్లో ఈ వారం కూడా చాలా సినిమాలు స్ట్రీమింగ్‍కు రానున్నాయి. వివిధ జానర్ల చిత్రాలు అడుగుపెట్టనున్నాయి. అయితే, వీటిలో ఐదు చిత్రాలు ఇంట్రెస్టింగ్‍గా ఉన్నాయి.
ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో ఈ వారం కూడా చాలా చిత్రాలు క్యూ కడుతున్నాయి. ఓటీటీల్లో నయా కంటెంట్ చూడాలనుకునే వారికి చాలా ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి. అయితే, ఈ వారం (సెప్టెంబర్ నాలుగో వారం) కొన్ని సినిమాలు ఇంట్రెస్టింగ్‍గా కనిపిస్తున్నాయి. సూపర్ హిట్ మూవీ సరిపోదా శనివారం ఈ వారమే ఓటీటీలోకి వస్తోంది. ఓ తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ కూడా అందుబాటులోకి రానుంది. మరిన్ని చిత్రాలు కూడా వచ్చేస్తున్నాయి. ఈ వారం ఓటీటీల్లోకి అడుగుపెట్టనున్న టాప్-5 సినిమాలు ఏవో ఇక్కడ చూడండి.
సరిపోదా శనివారం
నేచురల్ స్టార్ హీరో నాని హీరోగా నటించిన యాక్షన్ డ్రామా మూవీ సరిపోదా శనివారం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‍బస్టర్ అయింది. ఈ చిత్రం ఈ గురువారం (సెప్టెంబర్ 26) నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‍కు రానుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన సరిపోదా శనివారం ఆగస్టు 27వ తేదీన థియేటర్లలో రిలీజైంది. రూ.100కోట్లకు పైగా కలెక్షన్లతో సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్, ఎస్‍జే సూర్య కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాను సెప్టెంబర్ 26 నుంచి నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో చూసేయవచ్చు.
డిమోంటీ కాలనీ 2
హారర్ థ్రిల్లర్ చిత్రం ‘డిమోంటీ కాలనీ 2’ జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో సెప్టెంబర్ 27న స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ మూవీ తమిళంలో ఆగస్టు 15న.. వారం తర్వాత తెలుగులో థియేటర్లలో రిలీజైంది. ఈ సీక్వెల్ మూవీకి మంచి టాక్‍తో పాటు అంచనాలకు తగ్గట్టు కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమాకు అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించగా.. అరుళ్‍నిథి, ప్రియా భవానీ శంకర్ లీడ్ రోల్స్ చేశారు. డిమోంటీ కాలనీ 2 మూవీ జీ5లో సెప్టెంబర్ 27న తమిళం, తెలుగులో అడుగుపెట్టనుంది.
వాళ
మలయాళ కామెడీ డ్రామా మూవీ ‘వాళ: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బాయ్స్’ సెప్టెంబర్ 23వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఆనంద్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 15న థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రంలో సిజూ సన్నీ, జ్యోతియర్, అమిత్, సాఫ్ బ్రోస్, అనురాజ్ ముఖ్యమైన పాత్రలు చేశారు.
లవ్ సితార
శోభితా ధూళిపాళ్ల లీడ్ రోల్ చేసిన ‘లవ్ సితార’ చిత్రం నేరుగా జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ శుక్రవారం సెప్టెంబర్ 27నే ఈ చిత్రం జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఈ రొమాంటిక్ డ్రామా చిత్రానికి వందన కటారియా దర్శకత్వం వహించారు. లవ్ సితార చిత్రంలో రాజీవ్ సిద్ధార్థ్ కూడా ఓ ప్రధాన పాత్ర చేశారు.
వాళై
తమిళ చిల్ట్రన్ డ్రామా మూవీ ‘వాళై’ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. కర్ణమ్, మామన్నన్ చిత్రాలను తెరకెక్కించిన మారి సెల్వరాజ్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. స్నేహితులైన చిన్నారుల మధ్య ఈ మూవీ స్టోరీ సాగుతుంది. ఆగస్టు 23న ఈ చిత్రం థియేటర్లలో రిలీజైంది. వాళై సినిమాలో పోన్వెల్, రఘుల్, కలైయారాసన్, నిఖిల విమల్, కర్ణన్ జానకీ కీలకపాత్రలు పోషించారు.