తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mahesh Babu Thalapathy Vijay: మహేష్ బాబు, దళపతి విజయ్ కలిసి నటించాలనుకున్న ఆ పాన్ ఇండియా సినిమా ఏంటో తెలుసా?

Mahesh Babu Thalapathy Vijay: మహేష్ బాబు, దళపతి విజయ్ కలిసి నటించాలనుకున్న ఆ పాన్ ఇండియా సినిమా ఏంటో తెలుసా?

Hari Prasad S HT Telugu

21 November 2023, 15:12 IST

    • Mahesh Babu Thalapathy Vijay: టాలీవుడ్, కోలీవుడ్ సూపర్ స్టార్లు మహేష్ బాబు, దళపతి విజయ్ కలిసి ఓ సినిమాలో నటించాలని అనుకున్న విషయం తెలుసా? అది కూడా మణిరత్నం డైరెక్షన్ లో కావడం విశేషం.
దళపతి విజయ్, మహేష్ బాబు
దళపతి విజయ్, మహేష్ బాబు

దళపతి విజయ్, మహేష్ బాబు

Mahesh Babu Thalapathy Vijay: మహేష్ బాబు, దళపతి విజయ్.. తెలుగు, తమిళ సినిమా ఇండస్ట్రీల్లో సూపర్ స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న ఈ హీరోలు కలిసి ఓ సినిమాలో నటిస్తే ఎలా ఉంటుంది? ఆ ఊహే చాలా అద్భుతంగా ఉంది కదూ. కానీ ఈ ఇద్దరూ కలిసి నటించే ఆ అరుదైన సందర్భం చాలా దగ్గరగా వచ్చి మళ్లీ దూరమైంది.

ట్రెండింగ్ వార్తలు

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. స్క్రిప్ట్, టైటిల్ ఫిక్స్ అయినా పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

ఇంతకీ మహేష్, విజయ్ కలిసి నటించాల్సిన ఆ సినిమా ఏంటో తెలుసా? పాన్ ఇండియా స్థాయిలో గతేడాది, ఈ ఏడాది రెండు భాగాలుగా రిలీజై బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టిన పొన్నియిన్ సెల్వన్ అంటే నమ్మగలరా? దేశం గర్వించదగిన డైరెక్టర్లలో ఒకడైన మణిరత్నం ఈ రెండు సినిమాలకు దర్శకత్వం వహించాడు. అతడే మహేష్, విజయ్ లను తన సినిమాలో నటింపజేయాలని భావించాడు.

నో చెప్పిన మహేష్, విజయ్

పొన్నియిన్ సెల్వన్ మూవీలో వందియాదవన్, అరుణ్‌మొళి వర్మన్ పాత్రల కోసం మణిరత్నం ఈ ఇద్దరు స్టార్ హీరోలను మొదట అనుకున్నాడట. అరుణ్‌మొళి వర్మన్ పాత్ర కోసం మహేష్ బాబును, వల్లవరైయన్ వందియాదవన్ పాత్రకు దళపతి విజయ్ అయితే బాగుంటుందని మణిరత్నం భావించాడు. ఇదే ప్రతిపాదనతో ఈ ఇద్దరు స్టార్లను అతడు కలిశాడు.

అయితే దీనికి ఈ ఇద్దరూ నో చెప్పారట. దీంతో ఈ పాత్రలను కార్తీ, జయం రవిలతో చేయించాల్సి వచ్చింది. పొన్నియిన్ సెల్వన్ మూవీలో అరుణ్‌మొళి వర్మన్ (రాజ రాజ చోళ) పాత్రను జయం రవి, వందియాదవన్ పాత్రను కార్తీ పోషించారు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా రచయిత జయమోహన్ వెల్లడించడం విశేషం.

తన కలల ప్రాజెక్ట్ అని, నాలుగు దశాబ్దాలుగా ఈ సినిమా తీయడానికి తాను ప్రయత్నిస్తున్నట్లు మణిరత్నం చాలా సందర్భాల్లో చెప్పాడు. మొత్తానికి గతేడాది తొలి భాగాన్ని, ఈ ఏడాది రెండో భాగాన్ని రిలీజ్ చేశాడు. తమిళనాట అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా పొన్నియిన్ సెల్వన్ 1 నిలిచింది. కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా ఈ సినిమాలను తెరకెక్కించారు.

ఒకవేళ మణరత్నం భావించినట్లు ఈ సినిమాలో మహేష్, విజయ్ నటించి ఉంటే ఎలా ఉండేదో ఊహించుకోండి. ఈ ఇద్దరినీ ఇప్పటి వరకూ అలాంటి పాత్రల్లో ప్రేక్షకులు చూడలేదు. అదే జరిగి ఉంటే పీఎస్ 1, పీఎస్ 2 తెలుగు, తమిళ భాషల్లో మరింత పెద్ద హిట్ అయి ఉండే అవకాశాలను కొట్టి పారేయలేం.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం