Maharaja OTT Release Date: విజయ్ సేతుపతి మహారాజా ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా.. ఎందులో వస్తోందంటే?
07 July 2024, 20:39 IST
- Maharaja OTT Release Date: తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించిన లేటెస్ట్ మూవీ మహారాజా ఓటీటీ రిలీజ్ డేట్ దాదాపు కన్ఫమ్ అయింది. బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ సాధించిన ఈ సినిమా త్వరలోనే రాబోతోంది.
విజయ్ సేతుపతి మహారాజా ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా.. ఎందులో వస్తోందంటే?
Maharaja OTT Release Date: విజయ్ సేతుపతి నటించిన మహారాజా మూవీ రిలీజై సుమారు నెల అవుతోంది. అయితే ఇప్పటికీ ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై ఎలాంటి అధికారిక అప్డేట్ లేదు. కానీ తాజాగా సోషల్ మీడియాలో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై బజ్ నెలకొంది. బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మహారాజా ఓటీటీ రిలీజ్ డేట్
విజయ్ సేతుపతి నటించిన 50వ సినిమా మహారాజా. ఈ సినిమా రిలీజ్ కు ముందు విజయ్ 50వ సినిమాగానే ఆసక్తి రేపినా.. రిలీజ్ తర్వాత ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నిథిలన్ సామినాథన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఊహించని విజయం సాధించింది. రూ.100 కోట్లకుపైగా వసూలు చేసింది. ఇప్పుడీ మూవీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో జులై 12 నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
తెలుగులోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కానుండటం విశేషం. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి దక్కించుకుంది. సినిమాలో బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ విలన్ గా నటించగా.. మమతా మోహన్ దాస్, నటరాజ్, భారతీరాజా, అభిరామ్ లాంటి వాళ్లు కూడా నటించారు. అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందించాడు.
మహారాజా స్టోరీ ఏంటి?
ఈ సినిమాలో మహారాజ అనే బార్బర్ పాత్ర పోషించారు విజయ్ సేతుపతి. మహారాజ (విజయ్ సేతుపతి) భార్య చనిపోగా.. అతడు తన కూతురు జ్యోతితో కలిసి జీవిస్తుంటాడు. ఓ రోజు హఠాత్తుగా మహారాజ పోలీస్ స్టేషన్‍కు వెళతాడు. తమపై ముగ్గురు దాడి చేశారని, తమ కూతురిని కాపాడిన లక్ష్మిని అపహరించుకు వెళ్లారని ఫిర్యాదు చేస్తాడు.
లక్ష్మిని కాపాడాలని కంప్లైంట్ ఇస్తాడు. అయితే, లక్ష్మి పోలికలను మహారాజ సరిగా చెప్పడు. దీంతో పోలీసులు ముందుగా ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరిస్తారు. ఆ తర్వాత కేసు నమోదు చేస్తారు. అసలు మహారాజ, అతడి కూతురుపై దాడి చేసిందెవరు.. లక్ష్మి ఎవరు.. చివరికి లక్ష్మిని పట్టుకున్నారా.. అనేదే ఈ మూవీలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. మహారాజ సినిమా కథనం బాగుందని, థ్రిల్లింగ్‍గా ఉందనే టాక్ పాజిటివ్ టాక్ వచ్చింది.
మహారాజ సినిమాను ఆసక్తికర కథనంతో క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు దర్శకుడు నిథిలన్. తమిళంలో రూపొందిన మహారాజ చిత్రం తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ అయింది. తెలుగు వెర్షన్ కోసం కూడా మూవీ టీమ్ ప్రమోషన్లను బాగా చేసింది. ప్రీ-రిలీజ్ ప్రెస్‍మీట్‍లోనూ విజయ్ సేతుపతి పాల్గొన్నారు. కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. తెలుగు యంగ్ హీరో సుహాస్‍తో ఓ ఇంటర్వ్యూలో విజయ్ ముచ్చటించారు.