Vijay Sethupathi: పుష్పలో క్యారెక్టర్ రిజెక్ట్ చేశారా? విజయ్ సేతుపతి ఏం చెప్పారంటే..-vijay sethupathi gives clarity on pushpa rejection rumours ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijay Sethupathi: పుష్పలో క్యారెక్టర్ రిజెక్ట్ చేశారా? విజయ్ సేతుపతి ఏం చెప్పారంటే..

Vijay Sethupathi: పుష్పలో క్యారెక్టర్ రిజెక్ట్ చేశారా? విజయ్ సేతుపతి ఏం చెప్పారంటే..

Vijay Sethupathi - Maharaja Movie: మహారాజా సినిమా మంచి సక్సెస్ అవుతోంది. ఈ సందర్భంగా తెలుగు వెర్షన్ కోసం నేడు ప్రెస్‍మీట్‍లో మాట్లాడారు విజయ్ సేతుపతి. పుష్ప సినిమాలో తాను క్యారెక్టర్ రిజెక్ట్ చేశానన్న రూమర్లపై స్పందించారు.

Vijay Sethupathi: పుష్పలో క్యారెక్టర్ రిజెక్ట్ చేశారా? విజయ్ సేతుపతి ఏం చెప్పారంటే..

Vijay Sethupathi: తమిళ స్టార్ నటుడు, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రస్తుతం మహారాజ సినిమా సక్సెస్‍తో సంతోషంగా ఉన్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం మంచి కలెక్షన్లను దక్కించుకుంటోంది. గత శుక్రవారం జూన్ 14న రిలీజైన మహారాజ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. విజయ్ సేతుపతి నటనకు మరోసారి చాలా ప్రశంసలు దక్కుతున్నాయి. మహారాజ మూవీ సక్సెస్ కావడంతో తెలుగు వెర్షన్ కోసం నేడు (జూన్ 17) హైదరాబాద్‍లో ప్రెస్‍మీట్ నిర్వహించింది మూవీ టీమ్. ఈ మీట్‍‍లో ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు విజయ్ సేతుపతి.

రిజెక్ట్ చేయలేదంటూనే..

అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో విజయ్ సేతుపతి ఓ పాత్ర చేసేందుకు తిరస్కరించారని అప్పట్లో రూమర్లు వచ్చాయి. ఈ విషయంపై నేడు ఆయనకు ప్రశ్న ఎదురైంది. అయితే తాను పుష్ప సినిమాలో పాత్రను రిజెక్ట్ చేయలేదని సేతుపతి తెలిపారు.

పుష్పలో క్యారెక్టర్ రిజెక్ట్ చేయలేదంటూనే అన్ని చోట్ల నిజాలు చెప్పకూడదని విజయ్ అనడం కొసమెరుపు. “నేను రిజెక్ట్ చేయలేదు. కానీ అన్ని ప్లేస్‍ల్లో, అన్ని టైమ్‍ల్లో నిజం చెప్పకూడదు. లైఫ్ బాగుండదు. కొన్ని అబద్ధాలు చెప్పడం మంచిది” అని విజయ్ సేతుపతి అన్నారు. దీంతో మళ్లీ కన్‍ఫ్యూజన్ మిగిల్చారు.

నేను స్టార్ అని అనుకోను

హీరోగా 50 సినిమాలు చేసిన తర్వాత స్టార్‌డమ్‍ను మేనేజ్ చేసేందుకు ఏమైనా చేస్తారా అనే ప్రశ్నకు కూడా విజయ్ సేతుపతి స్పందించారు. “చేస్తాను. నేను స్టార్ అని నేను అనుకోను. అదే నేను చేసే మంచి ఎక్సర్‌సైజ్” అని తన మార్క్ ఆన్సర్ చెప్పారు.

మహారాజ సక్సెస్ మీట్‍కు ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన కూడా వచ్చారు. బుచ్చిబాబుతో ఉప్పెన చిత్రంలో సేతుపతి నటించారు. బుచ్చిబాబు తనకు తమ్ముడి లాంటి వాడని, రామ్‍చరణ్‍తో అతడు సినిమా చేస్తుండడం తనకు చాలా సంతోషంగా ఉందని సేతుపతి అన్నారు.

మహారాజ చిత్రంలో విజయ్ సేతుపతి నటనపై భారీగా ప్రశంసలు వస్తున్నాయి. ఈ రివేంజ్ యాక్షన్ డ్రామా సినిమాను డైరెక్టర్ నిథిలన్ తిలకన్ తెరకెక్కించారు. అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, నటరాజ్, భారతీరాజా, అభిరామి కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి అజ్నీష్ లోకనాథ్ సంగీతం అందించారు. ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి.

మహారాజ సినిమా మూడు రోజుల్లోనే రూ.32.6 కోట్ల కలెక్షన్లు దక్కించుకుంది. జూన్ 14న రిలీజైన ఈ మూవీకి ఫస్ట్ డే మోస్తరుగా కలెక్షన్లు వచ్చాయి. అయితే, పూర్తిగా పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్ రావటంతో కలెక్షన్లు పెరిగాయి. మొదటి రోజు కంటే మూడో రోజే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమాలో విజయ్ సేతుపతి పర్ఫార్మెన్స్, స్క్రీన్‍ప్లేపై చాలా ప్రశంసలు వస్తున్నాయి. ఈ మూవీ కలెక్షన్ల జోరు ఇంకా కొనసాగేలా కనిపిస్తోంది. తమిళంతో పాటు తెలుగులోనూ మహారాజ చిత్రం మంచి వసూళ్లను సాధిస్తోంది. మహారాజ కోసం తెలుగులోనూ విజయ్ సేతుపతి బాగా ప్రమోషన్లు చేయగా.. మూవీ కూడా బాగుండడం కలిసి వచ్చింది.