తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Ott: ఇర‌వై రోజుల్లోనే ఓటీటీలోకి సుధీర్‌బాబు కొత్త సినిమా - స్ట్రీమింగ్ డేట్ ఇదేనా??

Telugu OTT: ఇర‌వై రోజుల్లోనే ఓటీటీలోకి సుధీర్‌బాబు కొత్త సినిమా - స్ట్రీమింగ్ డేట్ ఇదేనా??

20 October 2024, 8:42 IST

google News
  • Family Drama OTT: సుధీర్‌బాబు హీరోగా న‌టించిన మా నాన్న సూప‌ర్ హీరో మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన ఇర‌వై రోజుల్లోనే ఓటీటీలోకి రానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. దీపావ‌ళి కానుక‌గా అక్టోబ‌ర్ 31 లేదా న‌వంబ‌ర్ 1 నుంచి ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ  జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు చెబుతోన్నారు.

ఫ్యామిలీ డ్రామా ఓటీటీ
ఫ్యామిలీ డ్రామా ఓటీటీ

ఫ్యామిలీ డ్రామా ఓటీటీ

Family Drama OTT: సుధీర్‌బాబు హీరోగా న‌టించిన మా నాన్న సూప‌ర్ హీరో మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన ఇర‌వై రోజుల్లోనే ఓటీటీలోకి రానున్న‌ట్లు స‌మాచారం. తండ్రీకొడుకుల అనుబంధంతో తెర‌కెక్కిన ఈ మూవీతో అభిలాష్ కంక‌ర ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. సాయిచంద్‌, షాయాజీ షిండే కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఆర్ణ హీరోయిన్‌గా న‌టించింది.

కాన్సెప్ట్ బాగుంది కానీ...

అక్టోబ‌ర్ 11న థియేట‌ర్ల‌లో రిలీజైన మా నాన్న సూప‌ర్ హీరో మూవీ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని అందుకున్న‌ది. కాన్సెప్ట్‌, తండ్రీకొడుకుల అనుబంధాన్ని స్క్రీన్‌పై ఆవిష్క‌రించిన తీరు బాగుందంటూ కామెంట్స్ వినిపించాయి.కానీ క‌మ‌ర్షియ‌ల్‌గా మాత్రం మా నాన్న సూప‌ర్ హీరో స‌రైన విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది.

జీ5 ఓటీటీ...

కాగా థియేట‌ర్ల‌లో రిలీజైన ఇర‌వై రోజుల్లోనే మా నాన్న సూప‌ర్ హీరో మూవీ ఓటీటీలోకి రానున్న‌ట్లు స‌మాచారం. థియేట్రిక‌ల్ రిలీజ్‌కు ముందే సుధీర్‌బాబు మూవీ ఓటీటీ హ‌క్కుల‌ను జీ5 సొంతం చేసుకున్న‌ది. దీపావ‌ళి కానుక‌గా అక్టోబ‌ర్ 31 లేదా న‌వంబ‌ర్ 1 నుంచి మా నాన్న సూప‌ర్ హీరో మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానున్న‌ట్లు చెబుతోన్నారు.

మా నాన్న సూప‌ర్ హీరో మూవీ క‌థ ఇదే...

చిన్న‌త‌నంలోనే త‌ల్లిని కోల్పోతాడు జానీ (సుధీర్‌బాబు) . లారీ డ్రైవ‌ర్‌గా ప‌నిచేసే తండ్రి చేయ‌ని త‌ప్పుకు జైలు పాల‌వుతాడు. అత‌డికి ఇర‌వై ఐదేళ్లు శిక్ష ప‌డుతుంది. అనాథ‌శ్ర‌మం నుంచి జానీని శ్రీనివాస్(షాయాజీ షిండే)ద‌త్త‌త తీసుకుంటాడు. అత‌డిని అనుక్ష‌ణం ద్వేషిస్తునే ఉంటాడు.

జానీకి మాత్రం శ్రీనివాస్‌ను ఎంత‌గానే అభిమానిస్తుంటాడు. తండ్రి చేసిన అప్పుల్ని తీర్చుతుంటాడు. పొలిటీషియ‌న్‌ను మోసం చేసిన కేసులు శ్రీనివాస్ జైలు పాల‌వుతాడు. తండ్రిని జైలు నుంచి విడిచిపించాలంటే కోటి రూపాయ‌లు జానీకి అవ‌స‌ర‌మ‌వుతాయి.

ప్ర‌కాష్ (సాయిచంద్‌) అనే వ్య‌క్తికి కోటిన్న‌ర రూపాయ‌ల లాట‌రీ త‌గులుతుంది. ఆ డ‌బ్బులు తీసుకురావ‌డానికి త‌న‌కు తోడుగా కేర‌ళ‌కు ర‌మ్మ‌ని జానీని ప్ర‌కాష్‌ కోరుతాడు. ప్ర‌కాష్ లాట‌రీ డ‌బ్బుల‌తో కొట్టేసి వాటితో తండ్రి శ్రీనివాస్‌ను జైలు నుంచి విడిపించాల‌నే స్వార్థంతో జానీ అందుకు ఒప్పుకుంటాడు. ఈ జ‌ర్నీలో ఏం జ‌రిగింది? జానీని శ్రీనివాస్ ద్వేషించ‌డానికి కార‌ణం ఏమిటి? ప్ర‌కాష్‌కు జానీకి ఉన్న సంబంధం ఏమిట‌న్న‌దే ఈ మూవీ క‌థ‌.

పాన్ ఇండియ‌న్ మూవీ...

సుధీర్‌బాబు హిట్టు కొట్టి చాలా రోజులు అవుతోంది. క‌థాంశాలు, పాత్ర‌ల ప‌రంగా ప్ర‌యోగాలు చేస్తోన్న బాక్సాఫీస్ వ‌ద్ద మాత్రం ఈ సినిమాలు వ‌ర్క‌వుట్ కావ‌డం లేదు. అత‌డి గ‌త సినిమాలు హ‌రోంహ‌ర‌, మామా మ‌శ్చీంద్ర‌, హంట్ డిజాస్ట‌ర్స్‌గా నిలిచాయి. ప్ర‌స్తుతం జ‌ఠాధ‌ర పేరుతో ఓ పాన్ ఇండియ‌న్ సినిమా చేస్తోన్నాడు సుధీర్‌బాబు.

తదుపరి వ్యాసం