తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Movies: ఈవారం ఓటీటీల్లో సినిమాలు వెబ్ సిరీసులు కలిపి 21 స్ట్రీమింగ్.. 2 మాత్రమే స్పెషల్.. కానీ!

OTT Movies: ఈవారం ఓటీటీల్లో సినిమాలు వెబ్ సిరీసులు కలిపి 21 స్ట్రీమింగ్.. 2 మాత్రమే స్పెషల్.. కానీ!

Sanjiv Kumar HT Telugu

31 January 2024, 11:10 IST

google News
  • This Week OTT Movies: ఈవారం కూడా ఓటీటీల్లో సందడి చేసేందుకు కొత్త సినిమాలు రెడీ అయిపోయాయి. థియేటర్లలో ఈవారం దాదాపుగా 8కిపైగా సినిమాలు విడుదల అవుతున్నాయి. అయితే ఓటీటీ వేదికల్లో మాత్రం అంతకుమించి అనేలా సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి మొత్తంగా 21 రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి.

ఈవారం ఓటీటీల్లో సినిమాలు వెబ్ సిరీసులు కలిపి 21 స్ట్రీమింగ్.. 2 మాత్రమే స్పెషల్.. కానీ!
ఈవారం ఓటీటీల్లో సినిమాలు వెబ్ సిరీసులు కలిపి 21 స్ట్రీమింగ్.. 2 మాత్రమే స్పెషల్.. కానీ!

ఈవారం ఓటీటీల్లో సినిమాలు వెబ్ సిరీసులు కలిపి 21 స్ట్రీమింగ్.. 2 మాత్రమే స్పెషల్.. కానీ!

This Week OTT Releases: ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. సంక్రాంతి సినిమాల సందడి తగ్గింది. రిపబ్లిక్ డే ఫీవర్ పోయింది. ఇప్పుడు థియేటర్‌లో క్యూ కట్టేందుకు చిన్న సినిమాలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఈ వారం సుహాస్ అంబాజీపేట మ్యారేజి బ్యాండు, బిగ్ బాస్ సోహెల్ బూట్ కట్ బాలరాజు, గేమ్ ఆన్, కిస్మత్ చిత్రాలతో కలిపి మొత్తం 8కి పైగా సినిమాలు విడుదల కానున్నాయి. ఇక ఓటీటీలో అయితే సినిమాలు, వెబ్ సిరీస్‌లు కలిపి ఏకంగా 21 రిలీజ్ కానున్నాయి. మరి అవేంటో చూద్దామా.

అమెజాన్ ప్రైమ్ వీడియో

మరిచి (కన్నడ సినిమా)- జనవరి 29 (స్ట్రీమింగ్ అవుతోంది)

డీ ప్రాంక్ షో (డచ్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 2

మిస్టర్ అండ్ మిస్ స్మిత్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 2

సైంధవ్ (తెలుగు సినిమా)- ఫిబ్రవరి 2 (ప్రచారం సాగుతోంది)

నెట్ ఫ్లిక్స్

మైటీ భీమ్స్ ప్లే టైమ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జనవరి 29 (ఆల్రెడీ స్ట్రీమింగ్)

ది గ్రేటెస్ట్ నైట్ ఇన్ పాప్ (ఇంగ్లీష్ మూవీ)- జనవరి 29 (ఆల్రెడీ స్ట్రీమింగ్)

జాక్ వైట్ హాల్: సెటిల్ డౌన్ (ఇంగ్లీష్ సినిమా)- జనవరి 30 (ఆల్రెడీ స్ట్రీమింగ్)

నాస్కర్: ఫుల్ స్పీడ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జనవరి 30 (ఆల్రెడీ స్ట్రీమింగ్)

అలెగ్జాండర్: ది మేకింగ్ ఆఫ్ ఏ గాడ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జనవరి 31

బేబీ బండిటో (ఇంగ్లీష్ సిరీస్)- జనవరి 31

ది సెవెన్ డెడ్లీ సిన్స్ (జపనీస్ వెబ్ సిరీస్)- జనవరి 31

విల్ (డచ్ మూవీ)- జనవరి 31

ఆఫ్టర్ ఎవ్రీథింగ్ (ఇంగ్లీష్ చిత్రం)- జనవరి 31

లెట్స్ టాక్ అబౌట్ చు (మాండరీన్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 2

ఓరియన్ అండ్ ది డార్క్ (ఇంగ్లీష్ సినిమా)- ఫిబ్రవరి 2

డిస్నీ ప్లస్ హాట్ స్టార్

కోయిర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జనవరి 31

మిస్ పర్ఫెక్ట్ (తెలుగు వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 2

సెల్ఫ్ (ఇంగ్లీష్ మూవీ)- ఫిబ్రవరి 2

ఇన్ ద నో (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జియో సినిమా ఓటీటీ- జనవరి 29 (ఆల్రెడీ స్ట్రీమింగ్)

అసెడియో (స్పానిష్ చిత్రం)- బుక్ మై షో ఓటీటీ ప్లాట్ ఫామ్- జనవరి 30 (స్ట్రీమింగ్ అవుతోంది)

ఓ మై డార్లింగ్ (మలయాళ చిత్రం)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- ఫిబ్రవరి 2

ఇలా ఈవారం ఏకంగా 21 సినిమాలు, వెబ్ సిరీసులు విడుదల కానుండగా ఇప్పటికే కొన్ని స్ట్రీమింగ్ అవుతోన్నాయి. అయితే వీటిలో సైంధవ్ ఫిబ్రవరి 2 నుంచి స్ట్రీమింగ్ కానుందని ప్రచారం సాగుతోంది. కానీ, వచ్చేవరకు పూర్తి క్లారిటీ రాదు. సైంధవ్‌తోపాటు లావణ్య త్రిపాఠి, బిగ్ బాస్ అభిజీత్ నటించిన మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రెండు మాత్రమే ఈవారం స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి. ఇక ఫిబ్రవరి 8న అంటే శుక్రవారం రోజున 8 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం