Sankranthi Movies OTT Partner: ఓటీటీలో సంక్రాంతి సినిమాలు.. గుంటూరు కారం, సైంధవ్, హనుమాన్ ఓటీటీ పార్టనర్స్ ఇవే!
Sankranthi Released Movies OTT Partner: ఈ ఏడాది సంక్రాంతి పండుగకు బడా హీరోలతోపాటు కుర్ర స్టార్స్ పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే గుంటూరు కారం, హనుమాన్, నా సామిరంగ సినిమాల ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఏంటనే వివరాల్లోకి వెళితే..
Sankranthi Releases Movies OTT Partner: ఈ సంవత్సరం సంక్రాంతి పండగకు స్టార్ హీరోలతోపాటు కుర్ర కథానాయకులు పోటీ పడుతున్నారు. పోటీ మంచి రసవత్తరంగా ఉండనుంది. వారిలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నుంచి యంగ్ హీరో తేజ సజ్జా వరకు ఉన్నారు. ఇలా జనవరిలో క్రేజీ సినిమాలతో సంక్రాంతి పండుగ మరింతగా కనువిందు కావడమే కాకుండా 2024 అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ సంక్రాంతి పండుగకు విడుదలవుతున్న స్టార్ హీరో సినిమాల ఓటీటీ వేదికలు ఏంటో చూద్దాం.
గుంటూరు కారం
సంక్రాంతి బరిలో ముందుగా చెప్పుకోవాల్సింది గుంటూరు కారం సినిమా. సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‍లో వస్తున్న మూడో సినిమా అయిన గుంటూరు కారంపై బీభత్సమైన అంచనాలు నెలకొన్నాయి. ఒకరకంగా చెప్పాలంటే సంక్రాంతి పండుగకు పెద్ద హిట్ గుంటూరు కారం మూవీనే అని ప్రచారం జరుగుతోంది. దానికితగినట్లుగానే గుంటూరు కారం సినిమాలో క్రేజీ బ్యూటి శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేస్తున్నారు.
గుంటూరు కారం ఓటీటీ
గుంటూరు కారం సినిమాలో హీరో హీరోయిన్లతోపాటు జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌తో సినిమా వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తోన్న గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. అయితే, గుంటూరు కారం సినిమాను ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుందని సమాచారం. అంటే థియేట్రికల్ రన్ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో గుంటూరు కారం ఓటీటీ (Guntur Kaaram OTT) స్ట్రీమింగ్ కానుంది.
హనుమాన్
సూపర్ స్టార్ మహేశ్ బాబుతో పోటీ పడుతూ సంక్రాంతి బరిలో దిగుతున్నాడు యంగ్ హీరో తేజ సజ్జా. మరో యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే హనుమాన్ మూవీ ట్రైలర్ అదిరిపోయే విజువల్స్‌తో ఆశ్చర్యపరిచింది. హనుమాన్ సినిమాను జనవరి 12న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంతోపాటు జపనీష్, స్పానిష్, చైనీస్ ఇతర భాషల్లో పాన్ వరల్డ్ మూవీగా రిలీజ్ చేస్తున్నారు. ఇక హనుమాన్ మూవీ ఓటీటీ పార్టనర్ జీ5 (Hanuman OTT).
సైంధవ్
హిట్ సిరీస్ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను.. విక్టరీ వెంకేటేష్‌తో కలిసి వస్తున్న సినిమా సైంధవ్. వెంకటేష్ 75వ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో నవాజిద్ధీన్ సిద్ధికీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, ఆండ్రియా జెర్మియా, జయప్రకాష్, జిషు సేన్ గుప్తా కీ రోల్స్ పోషిస్తున్నారు. వెంకటేష్ సైకోగా కనిపించిన సైంధవ్ మూవీ జనవరి 13న విడుదల కానుంది. ఇక సైంధవ్ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించుకుంది. రిలీజ్ అనంతరం అమెజాన్ ప్రైమ్‌లో సైంధవ్ స్ట్రీమింగ్ (Saindhav OTT) కానున్నట్లు తెలుస్తోంది.
నా సామిరంగ
టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన తాజా చిత్రం నా సామిరంగ. దీనికి విజయ్ బిన్ని దర్శకత్వం వహించారు. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా వస్తున్న నా సామిరంగ సినిమాలో ఆషికా రంగనాథ్, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, రుక్సార్ ధిల్లాన్, మిర్నా మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 1980, 1990 కాలం నేపథ్యంతో వస్తున్న నా సామిరంగ సినిమా జనవరి 14న థియేటర్లలో విడుదల కానుంది. ఇక నా సామిరంగ ఓటీటీ పార్టనర్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Naa Saami Ranga OTT).
తమిళ చిత్రాలు
ఇవే కాకుండా తమిళ స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్ మూవీ కెప్టెన్ మిల్లర్ మూవీ జనవరిలోనే విడుదల కానుంది. కానీ, డేట్ ఇంకా ప్రకటించలేదు. అయితే కెప్టెన్ మిల్లర్ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Captain Miller OTT) సొంతం చేసుకుంది. శివ కార్తికేయన్ తాజా చిత్రం అయలాన్ సినిమా జనవరి 12న విడుదల కానుంది. ఈ అయలాన్ మూవీ ఓటీటీ పార్టనర్ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో (Ayalaan OTT).