Extra Ordinary Man OTT: ఓటీటీలోకి నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్.. సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్.. ఎక్కడంటే?-extra ordinary man ott streaming on netflix from pongal festival ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Extra Ordinary Man Ott: ఓటీటీలోకి నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్.. సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

Extra Ordinary Man OTT: ఓటీటీలోకి నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్.. సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu
Jan 05, 2024 01:06 PM IST

Extra Ordinary Man OTT Release: నితిన్, శ్రీలీల జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్. డిసెంబర్ 8న విడుదలైన ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్ మూవీ ఓటీటీలోకి రానుంది. దీనికి సంబంధించిన ఓటీటీ ప్లాట్ ఫామ్, స్ట్రీమింగ్ వివరాల్లోకి వెళితే..

ఓటీటీలోకి నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్.. సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్.. ఎక్కడంటే?
ఓటీటీలోకి నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్.. సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

Extra Ordinary Man OTT Streaming Date: యంగ్ హీరో నితిన్, బ్యూటీ డాల్ శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటించిన ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘ఎక్స్‌ట్రా - ఆర్డిన‌రి మ్యాన్’. రైట‌ర్ అండ్ డైరెక్ట‌ర్ వ‌క్కంతం వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఎక్స్‌ట్రా ఆర్డీనరి మ్యాన్ మూవీపై మొదటి నుంచి మంచి అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా డేంజర్ పిల్ల పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్ ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంది.

ఇలా చాలా గ్రాండ్‌గా ఎన్నో అంచనాలతో ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 8న రిలీజ్ అయింది. కానీ, ప్రేక్షకులు ఊహించనంతలా హిట్ కొట్టలేకపోయింది. సినిమాలో కామెడీ ఉన్న అంతగా వర్కౌట్ కాలేదని టాక్ వచ్చింది. అంతేకాకుండా రైటర్‌గా వక్కంతం వంశీ బెస్ట్ అని, కానీ డైరెక్షన్ మాత్రం చేయకండి అంటూ కొంతమంది రివ్యూలు ఇచ్చారు. ఇలా ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది.

అంతేకాకుండా ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్ సినిమా రిలీజ్ సమయంలో పోటీగా నాని హాయ్ నాన్న విడుదలైంది. ఓవైపు హాయ్ నాన్నకు మంచి రివ్యూస్ రావడం, మరోవైపు ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్ మూవీకి బ్యాడ్ టాక్ రావడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద కుదేలైంది. దాంతో సినిమాకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్ మూవీ ద్వారా హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా నితిన్‌కు కూడా భారీ నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్ ఓటీటీలోకి రానుంది. దీనికి సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్ చిత్రం హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని ప్రచారం జరుగుతోంది. అది కూడా ఈ సంక్రాంతి పండుగ కానుకగా ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

నితిన్, శ్రీలీల జోడీ కట్టిన ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్ సినిమాను నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో సంక్రాంతి వారంలో విడుదల చేయనున్నారు. అంటే, సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13 నుంచి 16 తేదిల్లో రిలీజ్ చేసే అవకాశం ఉందని సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతోంది. అయితే, ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్ ఓటీటీ విడుదలపై అధికారికంగా ప్రకటన ఇంతవరకు రాలేదు. అఫిషీయల్ అనౌన్స్‌మెంట్ వస్తే గానీ.. ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్ ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ రాదు.

కాగా ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్ సినిమాలో డా.రాజశేఖర్, సుధేవ్ నాయర్, రావు రమేష్, రోహిణి, బ్రహ్మాజీ, అజయ్, హర్షవర్ధన్, అన్నపూర్ణమ్మ, పవిత్రా నరేష్, రవివర్మ, హైపర్ ఆది, వెంకటేష్ ముమ్ముడి, జగదీష్ తదితరులు నటించారు. ఈ మూవీని శ్రేష్ఠ్ మూవీస్‌, ఆదిత్య‌మూవీస్ & ఎంట‌ర్ టైన్‌మెంట్స్, రుచిర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యాన‌ర్స్‌పై ఎన్.సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మించారు. ఎక్స్‌ట్రా ఆర్డీనరీ మ్యాన్ సినిమాకు పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ హరీస్ జయ‌రాజ్ సంగీత అందించారు.

ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్ సినిమాలో నితిన్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న జూనియర్ ఆర్టిస్ట్‌గా నటించాడు. కొన్ని కామెడీ సన్నివేశాలు తప్పా కథలో బలం లేకపోయేసరికి మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇందులో సీనియర్ హీరో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. ఇకపోతే ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్ మూవీకి దర్శకత్వం వహించిన రైటర్ వక్కంతం వంశీ ఇదివరకు అల్లు అర్జున్‌తో నా పేరు సూర్య ఇల్లు ఇండియా చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే.

IPL_Entry_Point