Krishna mukunda murari february 20th: నిజం చెప్పేసిన ముకుంద, ట్విస్ట్ ఇచ్చిన ఆదర్శ్.. పట్టరాని సంతోషంలో మురారి
20 February 2024, 7:26 IST
- ఆదర్శ్ కి ఎలాగైనా నిజం చెప్పాలని ముకుంద అనుకుంటుంది. అటు రెండు జంటలకు శోభనం ఏర్పాట్లు చేసి కృష్ణ సర్ ప్రైజ్ స్తుంది. అది చూసి మురారి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫిబ్రవరి 20 వ తేదీ ఎపిసోడ్
Krishna mukunda murari serial february 20th episode: ఆదర్శ్ ఫోన్ వస్తే పక్కకి వెళ్ళిపోతాడు. మందు గ్లాస్ తీసుకుని వెళ్ళమని మురారి అంటే వద్దులే నేనే తీసుకుని వెళ్తానని చెప్పి ముకుంద వెళ్తుంది. ఇదే కరెక్ట్ టైమ్ నిజం చెప్పాలని ముకుంద అనుకుంటుంది. కృష్ణని బంగారం అని పిలిచేసరికి బిత్తరపోతుంది. ఒక పెగ్గు పడగానే తింగరి కాస్త బంగారం అయిపోయిందని అంటుంది. జీవితంలో మరచిపోలేని గిఫ్ట్ ఇస్తానని చెప్పావ్ కదా అది ఏంటని అడుగుతాడు. కాసేపు ఆగితే మీకే తెలిసిపోతుందని చెప్తుంది. ధైర్యం తెచ్చుకోవడం కోసం ముకుంద ఆదర్శ్ కి తీసుకెళ్లిన మందు తాగుతుంది.
ఆదర్శ్ కి నిజం చెప్పేసిన ముకుంద
అది మురారి, కృష్ణ చూసి ఆశ్చర్యపోతారు. ఆదర్శ్ ఫోన్ మాట్లాడి వెనక్కి తిరగబోతుంటే వద్దని ముకుంద ఆపుతుంది. నీతో ఒక విషయం చెప్పాలి తప్పక చెప్తున్నాను. మురారి మాట కాదనలేక నిన్ను పెళ్లి చేసుకున్నాను కానీ నాకు మన పెళ్లి ఇష్టం లేదు. ఇప్పటికే కాదుఎప్పటికీ మీ మీద ఇష్టం కలగదు. మీ భార్యగా ఉండలేక మీకు సంతోషాన్ని ఇవ్వలేక ఈ బతుకు నేను బతకలేను. మీరు తప్పుగా అనుకున్న పరవాలేదు మీరు ప్లీజ్ ఇంకొక పెళ్లి చేసుకోండి. ఆ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండండి. అంత ఇష్టం లేనప్పుడు ఎందుకు రమ్మన్నావ్ అంటే సోరి నేను రమ్మనలేదు. నా మౌనాన్ని ఇష్టంగా అర్థం చేసుకుని మిమ్మల్ని తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా రూమ్స్ నేను బుక్ చేయలేదు కృష్ణ వాళ్ళే చేసినట్టు ఉన్నారు. ఐయామ్ సోరి నన్ను ఒక పీడ కల అనుకుని మర్చిపోండని చెప్తుంది.
ఆదర్శ్ చెవిలో బ్లూటూత్ ఉండటం వల్ల ముకుంద చెప్పింది ఏదీ ఆదర్శ్ కి వినిపించదు. చెవిలో నుంచి వాటిని తీసి ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగేసరికి ముకుంద షాక్ అవుతుంది. ఇంతసేపు నేను చెప్పింది వినలేదు ఇప్పుడు మాత్రం ఏమైంది మళ్ళీ చెప్తానని అనుకుంటుంది. మురారి వాళ్ళు వచ్చి రూమ్ కి వెళ్లిపోతున్నామని అంటారు. మంచి అవకాశం మిస్ చేసుకున్నాను తొందరపడి చెప్పాను ఇప్పుడు మళ్ళీ ఎలా చెప్పాలి. పైగా ఇప్పుడు తనతో ఒంటరిగా ఒకే గదిలో ఉండాలి ఎలా అవాయిడ్ చేయాలని ముకుంద టెన్షన్ పడుతుంది.
శోభనానికి ఏర్పాట్లు.. షాకైన ముకుంద
ఆదర్శ్ గదికి వచ్చి చూసేసరికి బెడ్ మొత్తం పూలతో అలంకరించి ఉంటుంది. ముకుంద ఈ ట్రిప్ ప్లాన్ చేసింది ఇందుకా? నేను తను నన్ను ప్రేమిస్తుందో లేదోనని అనవసరంగా అనుమానించాను. తప్పుగా అర్థం చేసుకున్నానుని ఆదర్శ్ ఫీల్ అవుతాడు. ముకుంద గదిలోకి వచ్చి బెడ్ చూసి షాక్ అవుతుంది. ఇదంతా ఎవరు చేశారు నా పేరు మీద రూమ్స్ బుక్ చేయడమే కాకుండా శోభనానికి కూడా ఏర్పాట్లు చేశారు బాగా ఇరుక్కుపోయానని ముకుంద కంగారుపడుతుంది.
డార్లింగ్ చాలా థాంక్యూ అని ముకుందని హగ్ చేసుకోబోతుంటే గట్టిగా అరిచి ఆగమని చెప్తుంది. దీంతో షాక్ అవుతాడు. ముకుంద నిన్ను అపార్థం చేసుకున్నాను నేనంటే నీకు ఇష్టం లేదని అనుకున్నాను. కానీ నీ ఇష్టాన్ని ఇంత గొప్పగా చూపిస్తావని అనుకోలేదు. నువ్వు ఏంటో నాకు పూర్తిగా అర్థం అయ్యిందని అంటాడు. నేను కాదని ముకుంద చెప్తుంది.
నువ్వు సడెన్ గా ట్రిప్ ప్లాన్ చేస్తే ఏదో అనుకున్నాను కానీ ఇలా సర్ ప్రైజ్ చేస్తావని అనుకోలేదని మెచ్చుకుంటాడు. ఇదంతా ఎవరు చేస్తున్నారు? కృష్ణ వాళ్ళు ప్లాన్ చేయలేదు కదా. ఇలాంటిది ప్లాన్ చేశారని ముందే తెలిసి ఉంటే ఏదో ఒకటి చెప్పి తప్పించుకునే దాన్ని.. ఇప్పుడు ఈ గండం నుంచి ఎలా తప్పించుకోవాలని టెన్షన్ పడుతుంది. అటు మురారి గదికి వచ్చి బెడ్ మొత్తం పూలతో అలంకరించి ఉండటం చూసి పాపం ఎవరో శోభనం సెటప్ చేసుకున్నారు దారి తప్పి వచ్చానని అనుకుంటాడు.
పట్టరాని సంతోషంలో మురారి
ఎదురుగా కృష్ణ ఉండటం చూసి నువ్వు కూడా దారి తప్పి వచ్చావా? అంటాడు. తర్వాత శోభనం మనకేనా మర్చిపోలేని గిఫ్ట్ ఇస్తానని అన్నావ్ ఇదేనా అని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతాడు. వెంటనే కృష్ణని హగ్ చేసుకుంటాడు. ముహూర్తాలు అన్నావ్ కదా అంటే చూడలేదు మీ బాధ చూడలేక ఏర్పాటు చేశానని అంటుంది. రూమ్స్ బుక్ చేసింది కూడా తనేనని చెప్తుంది. మరి ముకుంద చేయించిందని ఎందుకు చెప్పావని అడుగుతాడు.
ముకుంద ఇదంతా చేయించిందని ఆదర్శ్ అనుకోవాలి. అప్పుడే తన మనసులో ఏమైనా అనుమానం ఉంటే మొత్తం పోతుంది. వాళ్ళు హ్యాపీగా ఉంటారని కృష్ణ చెప్తుంది. శోభనం అనేసరికి ఎగ్జైట్ మెంట్ తో కాళ్ళు, చేతులు వణికిపోతున్నాయని ఒక పెగ్గు మందు తెచ్చుకుంటాను ఆదర్శ్ గదిలో ఉంది వెళ్ళి తెచ్చుకుందామని తనని తీసుకుని వెళతాడు. ఆదర్శ్ బయటకి వెళ్ళాడు లోపలికి వచ్చాక తప్పించుకోవడం కష్టం. దేవ్ ఏదో చేస్తానని అన్నాడు లొకేషన్ కూడా పంపించాను. తను ఏదైనా చేస్తే బాగుండని అనుకుంటుంది.
ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద
ఆదర్శ్ ముకుంద చేతిని పట్టుకుని మనం గడపబోయే ప్రతీ క్షణం మధుర జ్ఞాపకంగా ఉండాలని అంటాడు. ఆదర్శ్ పట్టుకుని ముద్దు పెట్టుకోబోతుంటే ఆదర్శ్ అని గట్టిగా అరుస్తుంది. ఇంకొక చిన్న సర్ ప్రైజ్ ఉందని అబద్ధం చెప్తుంది. ఈరోజుకి ఇచ్చినవి చాలు ఈ జీవితానికి ఇవి సరిపోతుందని అంటాడు. సర్ ప్రైజ్ అంటే నా సంతోషానికని చెప్తుంది.
ఇందాక పూల చెట్టు దగ్గర ఫోటో దిగారు కదా ఆ పువ్వు మీకు గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకుంటున్నాను వెళ్ళి తీసుకొస్తానని వెళ్లబోతుంటే ఈ టైమ్ లో ఎందుకని చేతులు పట్టుకుంటాడు. అప్పుడే ముకుంద ఫోన్ ఆదర్శ్ చేతిలో వదిలేసి తను బయటకి వెళ్ళిపోతుంది. మురారి వచ్చి ఏరా శోభనం పెళ్లి కొడుకా ఏంటి సంగతులు అంటాడు. నేనే కాదు నువ్వే శోభనం పెళ్లి కొడుకు కదా అంటాడు. ముకుంద ఎక్కడని కృష్ణ అంటే పువ్వు తీసుకురావడానికి వెళ్ళిందని చెప్తాడు.
ఇందాక నేను ఒక పువ్వు దగ్గర సెల్ఫీ దిగాను అది నాకు శోభనం రాత్రి గిఫ్ట్ గా ఇవ్వడం కోసం వెళ్ళిందని అంటాడు. చూశావా ముకుందకి నీమీద ఎంత ప్రేమ ఉందోనని కృష్ణ అంటుంది. ఈ టైమ్ లో ముకుందని ఎందుకు ఒంటరిగా పంపించావని మురారి అంటాడు. ముకుంద చెట్టు దగ్గర నిలబనది కంగారుగా ఉంటుంది. గది నుంచి తప్పించుకుని ఇక్కడికి వచ్చాను. ఇక ఎన్నాళ్ళు అందరినీ తప్పించుకుని తిరగాలి. ఎన్నాళ్ళు మోసం చేస్తూ బతకాలని అనుకుంటుంది.
తరువాయి భాగంలో..
ముకుంద కాలు బెణికి నొప్పితో ఉన్నట్టు ఉంటుంది. కృష్ణ అది చూసి అనుమానం వస్తుంది. నిజంగా కాలు బెణికిందా లేదంటే ఆదర్శ్ తో రూమ్ లో ఉండాల్సి వస్తుందని నాటకం ఆడుతుందా? అని డౌట్ పడుతుంది. చాలా కాలంగా వాళ్ళు దూరంగా ఉన్నారు కదా ఇప్పుడు ఒకటి కావాలని అనుకుంటున్న టైమ్ లో ఇలా జరిగితే అదొక బ్యాడ్ సెంటిమెంట్ గా మిగిలిపోతుందని మురారి అంటాడు. నిజంగా దెబ్బతగిలి ఉంటే ముకుంద బాధపడి ఉండేది కానీ తను నాటకం ఆడుతుందని కృష్ణ చెప్తుంది.Krishn