Krishna mukunda murari april 9th: కథ అడ్డం తిరిగిందిరోయ్.. ముకుంద ప్రేమలో ఆదర్శ్, ఒక్కటైన అన్నదమ్ములు
09 April 2024, 9:18 IST
- Krishna mukunda murari serial april 9th episode: కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఏప్రిల్ 9వ తేదీ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. మీరా మీద ఆదర్శ్ ఫీలింగ్స్ మొదలైపోయాయి. ఇక ముకుంద ప్లాన్ చేసి ఆదర్శ్, మురారి కలిసిపోయేలా చేస్తుంది. వాళ్ళిద్దరూ ఒక్కటి కావడంతో ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు.
కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఏప్రిల్ 9వ తేదీ ఎపిసోడ్
Krishna mukunda murari serial april 9th episode: ఆదర్శ్ తన పట్ల ప్రవర్తిస్తున్న తీరు తలుచుకుని మురారి చాలా బాధపడతాడు. ఎప్పటికైనా ఆదర్శ్ మారతాడని పెద్దత్తయ్య అంత చూసుకుంటుందని ఏమి ఆలోచించొద్దని కృష్ణ ధైర్యం చెప్తుంది. రేవతి ఒంటరిగా ఉంటే భవానీ వచ్చి మాట్లాడుతుంది. వాళ్ళు ఆవేశంగా వెళ్లిపోతుంటే వద్దని చెప్పాలి కదా నువ్వు కూడా ఎలా బయల్దేరావని అంటుంది.
భవానీ అనుమానం
ఒకరికి మేం ఇంట్లో ఉండటం ఇష్టం లేదు, ఒకడేమో ఇంట్లో ఉండలేక పోతున్నాడు ఇంకేం చేయమంటావు. ఇద్దరూ నా బిడ్డలే మేం వెళ్లిపోతేనన్న సమస్యలు ఆగిపోతాయని రేవతి అంటుంది. వీళ్ళ మాటలు ముకుంద వింటుంది. ఆదర్శ్ మనసులో ఎందుకు ఇంత విషాన్ని నింపుకుని ద్వేషాన్ని పెంచుకున్నాడో అర్థం కావడం లేదని బాధపడుతుంది.
ఏది ఏమైనా మురారిని ఇంట్లో నుంచి వెళ్లమనే హక్కు ఆదర్శ కి లేదు. మొన్న ఇల్లు రాయమన్నాడు. ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మన్నాడు. అసలు ఇది వాడి మనస్తత్వం కాదు ఇష్టం లేకపోతే తప్పుకుంటాడే తప్ప వాడిని ఇలా వెళ్లమనడు. అప్పుడు ముకుంద విషయంలో కూడా వెళ్ళిపోయాడు.
ఇది ఆదర్శ్ కి వచ్చిన ఆలోచన కాదు ఎవరో వాడికి బాగా నూరిపోస్తున్నారని భవానీ అనుమానపడుతుంది. వీళ్ళు ఇంతగా ఆలోచిస్తున్నారంటే నామీద అనుమానం రాకుండా చేయాలని ముకుంద అనుకుంటుంది. మధు వస్తే తనని ఆపి హోలీ పండుగ చేసుకుందామని అంటుంది. ముకుంద పోయి ఎన్నో రోజులు కాలేదు ఈ పండుగలు ఎందుకని భవానీ అంటుంది.
హోలీ చేసుకుందామన్న ముకుంద
ముకుంద కోసం అయితే ఆలోచించక్కరలేదు తనకోసం మనం ఏ పండగ వదులుకోవాల్సిన అవసరం లేదని అంటుంది. తను నీ ఫ్రెండ్ కదా ఆలోచించొద్దని అంటావ్ ఏంటని రేవతి అడుగుతుంది. ముకుంద కోసం చేసుకోవాలని చెప్తుంది. ఇంట్లో ఎవరైనా చనిపోతే సంవత్సరం వరకు ఎటువంటి పండుగ చేసుకోకూడదని భవానీ అంటుంది.
ముకుంద పోయిందన్న బాధ ఒక పక్క, ఆదర్శ్ మురారి గొడవ పడుతున్నారని మరొక బాధ. వాటిని మర్చిపోయేలా చేయడమే మన కర్తవ్యం. ముకుంద లేదనే బాధ మర్చిపోయి వాళ్ళిద్దరినీ కలపాలి. అప్పుడే ముకుంద సంతోషిస్తుందని చెప్తుంది.
పండగ చేస్తే కలిసిపోతారా అని భవానీ అంటుంది. కలిసిపోతారని తనకి ఆ నమ్మకం ఉందని చెప్తుంది. మధు కూడా తనకి సపోర్ట్ చేస్తాడు. దీంతో భవానీ సరే అంటుంది. నువ్వు వచ్చాక ఈ ఇంట్లో సమస్యలు తీరిపోయాయి, చక్కబెడతావని నమ్మకం ఉందని భవానీ అంటుంది. అత్తయ్యని ఒప్పించాను ఇప్పుడు ఆదర్శ్, మురారిని ఎలా కలపాలో ఆలోచించాలని అనుకుంటుంది.
ముకుందకు ఫిదా
ఆదర్శ్ బయటకు వెళ్తుంటే ముకుంద ఎదురుపడుతుంది. హ్యాపీ హోలీ అని ముకుంద చెయ్యి ఇస్తుంది. తన స్పర్శ తగలగానే ఆదర్శ్ ఏదోలా ఫీల్ అవుతాడు. హోలీ పండుగ కదా అందరం కలిసి హోలీ అడుకుందామని అడుగుతుంది. ముకుంద అడగటం ఈ ఆదర్శ్ కాదనడం ఉంటుందా అంటాడు. థాంక్స్ చెప్తుంది.
ఎందుకని అంటే మురారి, కృష్ణ వాళ్ళు ఇంటి నుంచి వెళ్ళకుండా ఆపినందుకు. మీరు వాళ్ళ మీద కోపం చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు బాధపడతారో లేదో కానీ అందరి కంటే ఒకరు ఎక్కువ బాధపడుతున్నారని అంటుంది. ఎవరని అంటే మీ అమ్మ భవానీ గారు.
రౌడీలు ఎంట్రీ
ఇక నుంచి వాళ్ళని మీరు ఏమైనా అనే ముందు మీ అమ్మని తలుచుకోండి. వాళ్ళని అనే ప్రతి మాట మీ అమ్మని వెయ్యి రెట్లు బాధిస్తుంది. అయినా మురారిది ఏ తప్పు లేదని చెప్పాను కానీ మీరు నా మాట నమ్మడం లేదు. నమ్మితే ఇలా ఉండరని అంటుంది.
రౌడీలు ఇద్దరు వచ్చి మురారి ఉన్నాడా అని పొగరుగా అడుగుతారు. మీరు ఎవరని ఆదర్శ్ అంటాడు. నీకు చెప్పేది ఏంటి మురారిని రమ్మను వాడితోనే మాట్లాడతానని చెప్తారు. మర్యాదగా మాట్లాడమని ఆదర్శ్ సీరియస్ గా చెప్తాడు. గొడవ రాజుకుంది తన ప్లాన్ వర్కౌట్ అవుతుందని ముకుంద సంతోషపడుతుంది.
నువ్వు ఎవరో తెలియదు ఇంకొక్క క్షణం ఇక్కడే ఉంటే ఏం చేస్తానో తెలియదని రౌడీలు ఆదర్శ్ కాలర్ పట్టుకుంటారు. మురారి వచ్చి ఎవడు నువ్వు అని తోసేస్తాడు. నన్ను చితక్కొట్టి జైలులో తోయించావు కదా నిన్ను చంపి మళ్ళీ జైలుకు వెళ్తానని రౌడీ మురారిని కొట్టబోతుంటే ఆదర్శ్ రౌడీని ఆపుతాడు.
హీరోల్లా ఫైట్ చేసిన మురారి, ఆదర్శ్
మురారి కోసం ఆదర్శ్.. ఆదర్శ్ కోసం మురారి ఫైట్ చేస్తారు. ఇద్దరూ కలిసి హీరోలుగా ఫైట్ చేస్తుంటే మధు విజిల్స్ వేస్తాడు. ఆ సీన్ చూడటానికి బాగుంది. రామలక్ష్మణులు ఇద్దరూ ఒకటైపోయారని మధు అంటాడు. ఇద్దరు రౌడీలను ఆదర్శ్, మురారి కుళ్ళబొడుస్తారు. దీంతో రౌడీలు పారిపోతారు.
మురారిని ఆదర్శ్ దెబ్బలు ఏమైనా తగిలాయా అని అడుగుతాడు. మురారి సంతోషంగా లేదని అంటాడు. సారీరా అనేసి ఇద్దరూ ఒకరికొకరు చెప్పుకుంటారు. ఇప్పుడు ప్రాణం లేచొచ్చినట్టు ఉందని మురారి అంటాడు. ప్లాన్ సక్సెస్ అయ్యింది ఇక ఆదర్శ్ నా మురారిని ఒక్క మాట కూడా అనడని ముకుంద అనుకుంటుంది.
కృష్ణని ద్వేషించిన ఆదర్శ్
ఎవరో బయట ఉన్న వాళ్ళు చెయ్యి ఎత్తితే కానీ లోపల ఉన్న ప్రేమ బయటకు రాలేదని కృష్ణ ఆదర్శ్ ని పలకరిస్తుంది. కానీ ఆదర్శ్ మాత్రం మొహం పక్కకి తిప్పుకుంటాడు. ముకుంద హోలీ సెలబ్రేషన్స్ చేసుకుందామని అన్నావ్ కదా ఇంకెందుకు అలస్యమని ఆదర్శ్ అంటాడు. మురారితో కలిసిపోయినందుకు ఆదర్శ్ ముకుంద వైపు ప్రేమగా చూస్తాడు.
ఆదర్శ్, మురారిని ఒకటి చేయడం అయ్యింది. ఇక కృష్ణ, మురారిని విడదీయడమే మిగిలి ఉందని ముకుంద మనసులో అనుకుంటుంది. త్వరలోనే అది కూడా చేద్దామని అంటుంది. ఇక రేపటి ఎపిసోడ్లో అందరూ సంతోషంగా హోలీ ఆడుకుంటారు. కృష్ణ, మురారి సంతోషంగా హోలీ ఆడుకోవడం చూసి ముకుంద రగిలిపోతుంది.
టాపిక్