తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukunda Murari Serial April 6th: ఆదర్శ్ మనసులో విషాన్ని నింపిన ముకుంద.. మీరా ఇదంతా చేస్తుందని పసిగట్టేసిన కృష్ణ

Krishna mukunda murari serial april 6th: ఆదర్శ్ మనసులో విషాన్ని నింపిన ముకుంద.. మీరా ఇదంతా చేస్తుందని పసిగట్టేసిన కృష్ణ

Gunti Soundarya HT Telugu

06 April 2024, 8:47 IST

google News
    • Krishna mukunda murari serial april 6th episode: కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. ఆదర్శ్ మనసుని మీరా మారుస్తుందని కృష్ణ కనిపెట్టేస్తుంది. అటు ముకుంద కృష్ణ గురించి ఆదర్శ్ మనసులో విష బీజాన్ని వేస్తుంది.
కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఏప్రిల్ 6వ తేదీ ఎపిసోడ్
కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఏప్రిల్ 6వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఏప్రిల్ 6వ తేదీ ఎపిసోడ్

Krishna mukunda murari serial april 6th episode: ముకుంద ఎలాగైనా ఆదర్శ్ తో సంగీత పెళ్లి చేస్తానని రజినితో చెప్తుంది. కృష్ణ, మురారి ఇంటికి వచ్చేసరికి ఆదర్శ్ తాగుతూ కూర్చుంటాడు. మందు తాగడం మానితే కానీ ఆదర్శ్ మారడని కృష్ణ అంటుంది. పెద్దత్తయ్య ఉన్నారు కనీసం ఆవిడకు గౌరవం ఇచ్చి తాగకుండా ఉంటే బాగుంటుందని చెప్తుంది.

ఆదర్శ్ ని తాగొద్దన్న మురారి

మురారి ఆదర్శ్ తో మాట్లాడతానని చెప్పి కృష్ణని పంపించేస్తాడు. ఇంకెన్నాళ్ళు ఇలా అని మురారి అంటే ఆదర్శ్ పట్టించుకోకుండా యాటిట్యూడ్ చూపిస్తాడు. పెద్దమ్మ ఇంట్లో ఉంది నువ్వు ప్రతిరోజు తాగడం చూస్తే బాధపడుతుంది. మాకోసం కాకపోయినా పెద్దమ్మ కోసం ఒక్కసారి ఆలోచించమని అంటాడు.

అదంతా భవానీ చూస్తూనే ఉంటుంది. ఆదర్శ్ కోపంగా గ్లాసు పగలగొడతాడు. ఆవిడ నీకు పెద్దమ్మ అయితే నాకు తను అమ్మ నువ్వు నాకు నీతులు చెప్పొద్దని అరుస్తాడు. బాధ్యత మర్చిపోయి ఇలా ఉండొద్దని మురారి చెప్తాడు. నేను ఈరోజు ఇలా అయిపోవడానికి కారణం మీరు.

మురారిని అవమానించిన ఆదర్శ్

నువ్వు కృష్ణ కలిసి నా జీవితాన్ని సర్వనాశనం చేశారు. వీళ్ళ మాటలు విన్న ముకుంద ఆదర్శ్ మురారి మీద బాగా కక్ష పెట్టుకున్నాడు ముందు అది పోగొట్టాలని అనుకుంటుంది. నీ మాటలు నా చెవిలో పడుతుంటే నాకు కంపరంగా ఉంది. నీ మొహం చూస్తుంటే అసహ్యంగా ఉంది. నువ్వు ఉంటున్న ఇంట్లో నేను ఉంటుంటే నాకు ఏదో ఒకటి చేసుకుని చచ్చిపోవాలని ఉంది. నాకు ఇంత ద్రోహం చేసి సిగ్గులేకుండా నా ముందుకు ఎలా వస్తున్నావ్. నీ ప్లేస్ లో నేను ఉంటే ఇలా ఉండను.

నీకోసం ప్రాణాలు అయినా ఇస్తాను కానీ నీలా నమ్మకద్రోహం చేయను. పొరపాటున ఉండాల్సి వస్తే నా మొహం కూడా చూపించేవాడిని కాదు. ఎవరికి కనిపించకుండా వెళ్లిపోయేవాడిని. నీకు సిగ్గులేదు అందుకే నా ముందుకు వచ్చి నిలబడ్డావు. నేనే నీ ప్లేస్ లో ఉంటే నేను ఈ ఇంట్లో వాడిని కాదని ఆదర్శ్ ఘోరంగా మాట్లాడతాడు.

కృష్ణని చెడ్డదాన్ని చేయాలి

భవానీ కొడుకు మాటలకు చాలా బాధపడుతుంది. ఆ ఇద్దరు అన్నదమ్ములను కలిపే బాధ్యత తనదని ముకుంద మాట ఇస్తుంది. ప్రయత్నించు కానీ ఆదర్శ్ ని ఎక్కువగా బతిమలాడాల్సిన అవసరం లేదు. కానీ మురారి తప్పు ఏమి లేదని వాడు ఎప్పుడు అర్థం చేసుకుంటాడోనని అంటుంది.

మురారి మీద ఆదర్శ్ కి ఉన్న అభిప్రాయం పోవాలి. కృష్ణ మాత్రమే చెడ్డదానిలా కనిపించాలి అలాగే చేయాలని ముకుంద డిసైడ్ అవుతుంది. మురారి బాధపడుతుంటే కృష్ణ వచ్చి పట్టించుకోవద్దు వదిలేయమని చెప్తుంది. అందరూ మనల్ని అర్థం చేసుకున్నా ఆదర్శ్ ఎందుకు అర్థం చేసుకోవడం లేదు. శోభనం రోజు ముకుంద మొహం మీద ఇష్టం లేదని చెప్తే తన మీద కోపం రావాలి కానీ మన మీద ఎందుకని కృష్ణ డౌట్ పడుతుంది.

మీరా మీద డౌట్ పడిన కృష్ణ

నేను అదే అనుకున్నాను కానీ ముకుంద కోసం మనమే తనని తీసుకొచ్చాము కదా అందుకే మన మీద కోపంగా ఉన్నాడు. కానీ ముకుంద మీద వాడికి ఉన్న అభిప్రాయం అంత సడెన్ గా ఎలా మారిపోయిందని మురారి డౌట్ పడతాడు. ముకుంద గురించి ఎవరైనా పాజిటివ్ గా చెప్తూ ఉండి ఉంటారని కృష్ణ అంటుంది.

ఎవరు చెప్తారని మురారి అంటే మీరా అయి ఉంటుందని కృష్ణ అంటుంది. మీరా ముకుంద ఫ్రెండ్స్ కదా. ఆదర్శ్ ముకుంద గురించి చెడుగా మాట్లాడటం భరించలేక తన తప్పు లేదని ఒప్పించి ఉంటుందని అంటుంది. కానీ నా తప్పు లేదని మీరాకి తెలుసు కదా మళ్ళీ ఇప్పుడు తను నెగిటివ్ గా చెప్తుందా అంటాడు.

తనే ఇన్ఫ్లూయెన్స్ చేసి ఉంటుందని కృష్ణ అనుమానపడుతుంది. ఆదర్శ్ మీరా మాటలు బాగా నమ్ముతున్నాడు అందుకే తనకు ముకుంద అని పేరు కూడా పెట్టాడు. డౌటే లేదు మీరా ఆదర్శ్ ని పొల్యూట్ చేస్తుందని అంటుంది. మురారి బ్యాగ్ తీసుకుని బట్టలు సర్దుకుంటాడు.

ఇంట్లో నుంచి వెళ్లిపోదామన్న మురారి

ఎందుకు ఏమైందని కృష్ణ అంటే ఈ ఇంట్లో ఉండటం లేదు వెళ్లిపోతున్నామని మురారి చెప్తాడు. మనం ఎందుకు వెళ్లిపోవాలని కృష్ణ అంటుంది. మీరా చెప్తే వీడు నమ్మేయడం ఏంటి మన మీద నమ్మకం లేదా అంటాడు. ఆవేశ పడొద్దు అత్తయ్య వాళ్ళకోసం ఆలోచించమని కృష్ణ సర్ది చెప్తుంది.

మొదటి సారి నా మీద అనుమానం వచ్చినప్పుడే ఇంట్లో నుంచి వెళ్లిపోదామని అనుకున్నాను. కానీ అందరి గురించి ఆలోచించి ఆగిపోయాను. నన్ను లాకప్ డెత్ చేస్తారంటే కనీసం పట్టించుకోలేదు. ఇప్పుడు నాతో పాటు నిన్ను తిడుతున్నాడు. ఇలా చీటికి మాటికి అభిప్రాయం మార్చుకునే వాడి దగ్గర ఉండలేను బట్టలు సర్దుకో అని మురారి సీరియస్ గా చెప్తాడు.

ఆదర్శ్ తో మాట్లాడటానికి ముకుంద వస్తుంది. మురారి అంటే ఎందుకు కోపమని అడుగుతుంది. ఎందుకు మురారి మీద కోపం పెంచుకుంటున్నారని అడుగుతుంది. వాడు వాడి ప్రేమని దాచి పెట్టి మోసం చేశాడని అంటాడు. కుటుంబ గౌరవం కోసం అలా చేశాడని ముకుంద నాతో చెప్పింది. మీకు తెలిసినవన్నీ నిజాలు కాదు. మురారిని తప్పుగా అర్థం చేసుకున్నారు.

కృష్ణ హేళన చేసింది

మీకు తెలియనివి ముకుంద నాతో పంచుకున్న నిజాలు చెప్తాను. కృష్ణ ఈ ఇంట్లో అడుగుపెట్టిన కొద్ది రోజులకే కృష్ణ వాళ్ళ ప్రేమ గురించి తెలుసుకుంది. అది కూడా మురారి తన మంచితనంతో తన భార్య దగ్గర ఏ నిజం దాచకూడదని చెప్పాడు. కానీ కృష్ణ వదల్లేదు.

ముకుందకు ఏ కష్టం రాకూడదని మీరు ముకుంద కలిసి ఉండాలని మురారి ఆశ. కానీ విషయం తెలిసిన కృష్ణ ముకుందని అవహేళన చేసేది. నువ్వు ప్రేమలో ఒడిపోయావ్ లూజర్ అని అవహేళన చేసింది. ఆ సమయంలో మురారి మనసులో కృష్ణ లేదు. వాళ్ళది కాంట్రాక్ట్ మ్యారేజ్. మురారి మనసు గెలుచుకుంటాను నువ్వు చూస్తూ ఏడుస్తూ ఉండమని ముకుందని రెచ్చగొట్టింది.

కృష్ణ అన్నింటికీ కారణం

ముకుంద ముందు మురారితో చనువుగా ఉంటూ తనని రెచ్చగొట్టిందని అంటుంది. ఇంత జరిగిందా నాకు ఇవేవీ తెలియదు తనని అంతగా బాధపెట్టారా? అంటాడు. మీరు ఇక్కడ ఉంటేనే కదా తెలిసేది. మిమ్మల్ని కలపడానికి మురారి చేసిన ప్రయత్నాలన్నీ కృష్ణ చెడగొట్టింది. మురారి మిమ్మల్ని తీసుకొచ్చే టైమ్ కి ముకుందని రెచ్చగొట్టి మీకు వ్యతిరేకంగా మాట్లాడేలా చేసింది.

ముకుంద తప్పు అసలు లేదని చెప్పడం లేదు కానీ ప్రేమ విఫలమై ఎవరినో పెళ్లి చేసుకుని ఆ వ్యక్తి తనని దూరం పెడితే మరోపక్క ప్రేమించిన వ్యక్తి మరొక ఆడదానితో ఉంటుంటే ఏ ఒంటరి ఆడపిల్ల అయినా ఇలాగే చేస్తుంది కదా. ముకుంద కూడా అలాగే చేసింది. ముకుంద ప్రవర్తనకు, పతనానికి చావుకు ప్రత్యక్షంగా పరోక్షంగా కృష్ణ కారణం.

మురారి తప్పేమీ లేదు

ఇందులో మీ తప్పు కూడా ఉంది. కానీ ఇదే నిజం. ఆడపిల్ల మనసు తెలుసుకుని తనని మార్చుకోకుండా కృష్ణ లాంటి రాబందుకు ఆహారంగా వదిలేశారు. తన అసలు రంగు బయట పడుతుందని తను సేఫ్ అవాలని చెప్పి కృష్ణ ఇలా చేసింది. అది మీరు అర్థం చేసుకోకుండా మురారి మీద కోపం పెంచుకుంటున్నారు.

ముకుంద ఒక సమయంలో మురారిని మర్చిపోయి మీకోసం ఎదురుచూసింది. తను ఎప్పుడు మీరు మురారి కలిసి ఉండాలని అనుకుంది. కానీ కృష్ణ అలా కాదని అంటుంది. ఈ దెబ్బకు మురారి మీద కోపం పెరిగిపోయి కృష్ణ మీద కోపం వస్తుంది. కృష్ణని బయటకి పంపించడం నాకు ఈజీ అవుతుందని అనుకుంటుంది.

తరువాయి భాగంలో..

కృష్ణ, మురారి బ్యాగ్ పట్టుకుని వస్తే ఎక్కడికి వెళ్తున్నారని రేవతి అడుగుతుంది. తల్లిని కూడా తమతో వచ్చేయమని మురారి అడుగుతాడు. మురారి కోసం ఇంత చేస్తే ఇలా జరిగింది ఏంటని ముకుంద టెన్షన్ పడుతుంది. ఆదర్శ్ బాధకు మేమే కారణమని గట్టిగా నమ్ముతున్నాడు. మనం దూరం అయి ఆ బాధని దూరం చేద్దామని కృష్ణ అంటుంది. మురారి వాళ్ళని వెళ్లొద్దని ఇంట్లో వాళ్ళు బతిమలాడతారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం