తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deeapam November 23: తన దీపాన్నే ముంచుకున్న జ్యోత్స్న, కార్తీక్ పంచ్‍లు.. పారిజాతం పీకపట్టుకున్న జ్యో

Karthika Deeapam November 23: తన దీపాన్నే ముంచుకున్న జ్యోత్స్న, కార్తీక్ పంచ్‍లు.. పారిజాతం పీకపట్టుకున్న జ్యో

23 November 2024, 10:59 IST

google News
    • Karthika Deeapam 2 Today November 23 Episode: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. కార్తీక్ మాటలతో దీప ఎమోషనల్ అవుతుంది. కన్నీళ్లు పెట్టుకుంటుంది. దీపాలు వెలిగించే చోట ఎదురైన అవమానానికి కోపంగా ఉంటుంది జ్యోత్స్న. పారిజయం పీక పట్టుకుంటుంది. నేటి ఎపిసోడ్‍లో ఏం జరిగిందో పూర్తిగా ఇక్కడ చూడండి.
Karthika Deeapam November 23: తన దీపాన్నే ముంచుకున్న జ్యోత్స్న, కార్తీక్ పంచ్‍లు.. పారిజాతం పీకపట్టుకున్న జ్యో
Karthika Deeapam November 23: తన దీపాన్నే ముంచుకున్న జ్యోత్స్న, కార్తీక్ పంచ్‍లు.. పారిజాతం పీకపట్టుకున్న జ్యో

Karthika Deeapam November 23: తన దీపాన్నే ముంచుకున్న జ్యోత్స్న, కార్తీక్ పంచ్‍లు.. పారిజాతం పీకపట్టుకున్న జ్యో

కార్తీక దీపం 2 నేటి (నవంబర్ 23) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. కార్తీక పౌర్ణమి గురించి చెప్పాలని దీపను జ్యోత్స్న అడుగుతుంది. దీంతో దీప వివరిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున భక్తులు వెలిగించే దీపాలను పంచభూతాలు శివుడి వద్దకు చేర్చుతాయని నమ్మకమని అంటుంది. దేవుడికి దీపం పెడితే కోరిన కోరికను దేవుడు తీరుస్తాడని తన తండ్రి చెప్పాడని, తాను అదే నమ్ముతానని దీప చెప్పింది. తాను మంచి నాన్న కోసం కోరుకున్నానని, దేవుడు తనకు మంచి నాన్నను ఇచ్చి కోరిక తీర్చాడని శౌర్య అంటుంది.

బావ నా వాడు కావాలి

దీపాలు వెలిగించేందుకు అందరూ సిద్ధమవుతారు. అంతకు ముందు అందరూ కోరికలు కోరతారు. తన కూతురు సంతోషంగా ఉండాలి, రెండు కుటుంబాలు కలవాలని దీప కోరుకుంటుంది. శౌర్య ఆరోగ్యంగా ఉండాలని కార్తీక్ కోరుకుంటాడు. బావ జీవితంలో నుంచి దీప పోవాలని, నా వాడు కావాలని జ్యోత్స్న కోరుకుంటుంది. ఎప్పుడూ అమ్మానాన్నలతో ఉండాలని శౌర్య అనుకుంటుంది. ఆ తర్వాత కోనేటిలో నలుగురు దీపాలు వదులుతారు.

రాయి వేసిన జ్యోత్స్న.. తన దీపమే

తన అమ్మ దీప వదిలిన దీపమే ముందుగా వెళుతుందని శౌర్య అంటుంది. ఏదో బలమైన కోరికే కోరి ఉంటుందని కార్తీక్ అంటాడు. దీప వదిలిన దీపాన్ని పడేసేందుకు రాయి విసురుతుందని జ్యోత్స్న. దీన్ని చూసి ఆమెను కాస్త నెడతాడు కార్తీక్. దీంతో గురి తప్పి తన దీపాన్నే రాయితో కొడుతుంది జ్యోత్స్న. దీంత తన దీపమే మునిగిపోతుంది.

జ్యోత్స్నకు కార్తీక్ పంచ్‍లు

దీప వదిలిన దీపాన్ని ముంచాలని కుట్ర చేసి తన దీపాన్ని కొట్టిన జ్యోత్స్నపై పంచ్‍లు వేశాడు కార్తీక్. “కష్టాలు వచ్చినా నిలబడేవి కొన్ని ఉంటాయి. అవి నిజాయితీగా దేవుడి వద్దకు చేరతాయి. దీప వదిలిన కార్తీక దీపం అలాంటిదే. నిజాయితీ లేని కోరికలు కొన్ని ఉంటాయి. అవి దేవుడి వద్దకు చేరేలోపే కష్టాల్లో కొట్టుకుపోతాయి. నువ్వు వదిలిన దీపం అలాంటిదే. ఎవరికి చెడు చేయాలని చూడకు. అది నీకే రివర్స్ అయి ఏడ్వడానికి కన్నీళ్లే తప్ప ఇంకేమీ మిగలవు” అంటూ జ్యోత్స్నకు బుద్ధి చెబుతాడు కార్తీక్. ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోతారు.

ఊరు వదిలివెళ్లిపోదాం..

జ్యోత్స్న చేసిన పనికి ఇంటికి వచ్చాక కార్తీక్ బాధపడతాడు. దీపతో మాట్లాడతాడు. ఊరు వదిలి పాపను తీసుకెళ్లి ఎక్కడికైనా వెళ్లిపోదామా అని కార్తీక్ అంటాడు. జ్యోత్స్న ఎక్కడపడితే అక్కడ గొడవ చేస్తుండడాన్ని ప్రస్తావిస్తాడు. “వాళ్లకు వ్రతం అని ఉండదు. రిసెప్షన్ అని ఉండదు. రెస్టారెంట్ అని ఉండదు. చివరికి దేవుడికి మొక్కుకున్న దీపాన్ని కూడా ముందుకు వెళ్లనివ్వరు” అని కార్తీక్ అంటాడు. దీపాన్ని ముంచడానికి రాళ్లు విసిరినట్టే.. మనుషులను ఏడ్పించడానికి మాటలు విసురుతారని అంటాడు.

ఇక్కడే ఉంటే జ్యోత్స్న లాంటి వాళ్లు ప్రశాంతంగా ఉంచరని, అందుకే ఊరు వదిలి వెళ్లిపోదామని కార్తీక్ అంటాడు. దీంతో నాలాగే ఎవరూ లేకుండా ఉంటారా అని దీప అంటుంది. ఇంతకు ముందు తాను ఎవరూ లేని అనాథను అని, మీరు అలా ఉండకూడదు అని దీప చెబుతుంది. కుటుంబానికి దూరం చేయలేనని అంటుంది.

దీప ఎమోషనల్

“దేవుడి కోసం వెలిగించి కోనేటిలో వదిలిన కార్తీక దీపాల సాక్షిగా చెబుతున్నా. అప్పుడు.. ఇప్పుడు నేను నీ శ్రేయోభిలాషినే దీప. నీ శ్రేయస్సును, సుఖాన్ని, సంతోషాన్ని మనస్ఫూర్తిగా కోరుకునే ఆత్మీయ మిత్రుడిని. ఇవన్నీ కూడా ఒక భర్తగా కార్తీక దీపాల సాక్షిగా చెబుతున్నానని, ఎప్పుడూ నీ శ్రేయోభిలాషినే. ఇవన్నీ నేను ఓ భర్తగా కోరుకోవడంలో తప్పులేదు. అలాగని నువ్వు ఇవ్వని చనువు తీసుకోను. అవి నీ మనసును బాధ పెట్టవచ్చు” అని కార్తీక్ అంటాడు. తనతో ఎప్పుడూ భార్యలాగే ఉండాల్సిన అవసరం లేదని, స్నేహితురాలిగా ఉండొచ్చని అంటాడు. తనతో అన్ని విషయాలు చెప్పుకోవచ్చని చెబుతాడు.

నన్ను దేవుడు అంటావు కదా.. రక్తం ఇచ్చి కాపాడిన నువ్వు నాకు దేవతవే దీప అని కార్తీక్ అంటాడు. కార్తీక్ మాటలతో దీప ఎమోషనల్ అవుతుంది. కన్నీళ్లు పెట్టుకుంటుంది. కార్తీక్ కాళ్లకు నమస్కరిస్తుంది. మీ లాంటి నాన్న, మీ లాంటి శ్రేయోభిలాషి దొరకరు కార్తీక్ బాబు అని మనసులో అనుకుంటుంది దీప.

ఏడ్చేసిన జ్యోత్స్న

గుడిలో జరిగిన విషయాన్ని తలుచుకొని ఇంట్లో ఏడుస్తుంది జ్యోత్స్న. పారిజాతం ఆమెకు మరింత కోపం తెప్పించేలా మాట్లాడుతుంది. ఏం చేసిన రివర్స్ అవుతూ.. నీకు ఎదురుదెబ్బ తగులుతోందని అంటుంది. ఎప్పుడైనా నష్టం నీకే జరుగుతోందని చెబుతుంది.

భార్యగానే కాదు, మరదలిగానూ బావ మనసులో లేనని, అత్త కూడా పరాయి మనిషిలాగే చూసిందని జ్యోత్స్న బాధపడుతుంది. ఇష్టం లేనప్పుడు, అవసరాలు తీరినప్పుడు మనుషులు అలానే చేస్తారని పారిజాతం అంటుంది.

పారిజాతం పీకపట్టుకున్న జ్యోత్స్న

మా బావ మీద నేను ఆశ వదిలేసుకోవాల్సిందేనా అని జ్యోత్స్న అంటుంది. మనకు కావాల్సింది ఆస్తి అని, మిగిలిన వాటా కూడా మనకే వచ్చేలా తాత మనసు చెడగొట్టాలని పారిజాతం సలహా ఇస్తుంది. ఆస్తి మొత్తం చేజిక్కుంచుకోవాలని అంటుంది. కార్తీక్‍ను దీపకు వదిలేయాలని పారిజాతం అంటుంది. దీంతో కోపంగా పారిజాతం పీకపట్టుకుంటుంది జ్యోత్స్న. దీంతో పారిజాతం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఆ తర్వాత జ్యోత్స్న వదిలేస్తుంది. బావ తనకు దక్కలేదంటే నేను చస్తాను, నిన్ను చంపుతానని జ్యోత్స్న అంటుంది. నన్నెందుకు చంపుతావని పారిజాతం అంటే.. దెయ్యమయ్యాకైనా సలహాలు ఇవ్వడానికి నువ్వు నాతో ఉండాలి కదా అని జ్యోత్స్న చెబుతుంది. నేనంటే ఎంతో ప్రేమే అంటూ నవ్వుతుంది పారిజాతం.

చస్తే బావకు భార్యగానే చస్తానని, మరదలిగా చావనని జ్యోత్స్న అంటుంది. ముందు కార్తీక్, దీప సంసారం ఎలా చెడగొట్టాలో చూడాలని పారిజాతం అంటుంది. ఒక్క ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నానని, వారిని విడదీసేందుకు అది చాలని జ్యోత్స్న చెబుతుంది.

కుబేర్ కోసం దాసు.. చనిపోయాడంటూ..

దీపను పెంచిన తండ్రి కుబేర్ డ్రాయింగ్‍ను దాసు చూస్తాడు. వారసురాలికి కనుగొనేందుకు కీలక ఆధారమైన అతడిని ఎలాగైనా పట్టుకోవాలని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత కుబేర్‌ను వెతికేందుకు తాను పంపిన వ్యక్తి ముత్యాలమ్మ గూడెం నుంచి దాసుకు కాల్ చేస్తాడు. తాము వెతుకుతున్న వ్యక్తి పేరు కుబేర్ అని.. అతడు చనిపోయి చాలా కాలం అయిందని దాసుకు ఆ వ్యక్తి చెబుతాడు. ఇంటికి కూడా తాళాలు ఉన్నాయని అంటాడు. దీంతో దాసు బాధపడతాడు. అతడి పేరు తెలుసుకున్నా.. ఎలాగైనా వారసురాలి (దీప) గురించి కూడా తెలుసుకోవాలని మనసులో అనుకుంటాడు దాసు. అప్పుడే కాశీ వచ్చి నాన్న ఏమైనా సాయం కావాలా అని అడుగుతాడు. దీంతో నువ్వు చేసేది కాదంటూ డ్రాయింగ్ లాగేసుకుంటాడు దాసు. దీంతో కార్తీక దీపం 2 నేటి (నవంబర్ 23) ఎపిసోడ్ ముగిసింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం