Karthika Deepam November 22: జ్యోత్స్నను నిలదీన కాంచన.. రెచ్చగొట్టడం, రచ్చ చేయడం అంటూ కార్తీక్ ఫైర్-karthika deepam today november 22st episode kanchana karthik blames jyotshna in temple ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam November 22: జ్యోత్స్నను నిలదీన కాంచన.. రెచ్చగొట్టడం, రచ్చ చేయడం అంటూ కార్తీక్ ఫైర్

Karthika Deepam November 22: జ్యోత్స్నను నిలదీన కాంచన.. రెచ్చగొట్టడం, రచ్చ చేయడం అంటూ కార్తీక్ ఫైర్

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 22, 2024 08:33 AM IST

Karthika Deepam November 22nd Episode: కార్తీక్ దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. కార్తీక్ పుట్టిన రోజు సందర్భంగా తన తాతకు తెలియకుండా గుడికి వస్తుంది జ్యోత్స్న. దీపను బాధపెట్టాలని చూస్తుంది. జ్యోత్స్నకు గట్టిగా తగిలేలా మాటలు అంటాడు కార్తీక్. నేటి ఎపిసోడ్‍లో ఏం జరిగిందో పూర్తిగా ఇక్కడ చూడండి.

Karthika Deepam November 22st: జ్యోత్స్నను నిలదీన కాంచన.. రెచ్చగొట్టడం, రచ్చ చేయడం అంటూ కార్తీక్ ఫైర్
Karthika Deepam November 22st: జ్యోత్స్నను నిలదీన కాంచన.. రెచ్చగొట్టడం, రచ్చ చేయడం అంటూ కార్తీక్ ఫైర్

కార్తీక దీపం 2 నేటి (నవంబర్ 22) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేందుకు కార్తీక్‍కు జ్యోత్స్న కాల్ చేస్తుంది. అయితే, కార్తీక్ ఫోన్‍ను కాంచన లిఫ్ట్ చేస్తుంది. అది తెలియక “మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బావా” అని జ్యోత్స్న అంటే.. థాంక్యూ చెబుతుంది కాంచన. అత్తా నువ్వా.. బావ ఫోన్ నువ్వెందుకు లిఫ్ట్ చేశావని జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. అసలు నువ్వెందుకు కాల్ చేశావని కాంచన అడుగుతుంది.

నా కోడలితో గొడవ పడ్డావా

రెస్టారెంట్‍లో దీపతో గొడవ పడిన విషయంపై జ్యోత్స్నను కాంచన నిలదీస్తుంది. “రెస్టారెంట్‍లో నా కోడలితో గొడవ పడ్డావంట” అని అడుగుతుంది. దీంతో నేనెవర్ని అని జ్యోత్స్న అడిగితే.. నువ్వు నా మేన కోడలివే.. దీప నా కోడలు అని కాంచన చెబుతుంది. క్లారిటీ అదిరిపోయిందని, ఫోన్‍ను కార్తీక్‍కు ఇవ్వాలని జ్యోత్స్న అడుగుతుంది. మీరు ఏనాడో నాకు మొగుడిని చేసిన నీ కొడుకుకు బర్త్ డే విషెస్ చెప్పేందుకని జ్యోత్స్న అంటుంది. అయితే, ముందుగా అతడికి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెప్పాలని కాంచన అంటుంది. ఆ తర్వాత బర్త్ డే విషెస్ చెప్పు అని అంటుంది. తాము గుడికి వెళ్లాలని అంటుంది. జ్యోత్స్న ఎంత అడిగినా కార్తీక్‍కు ఫోన్ ఇవ్వకుండానే కాల్ కట్ చేస్తుందని కాంచన. జ్యోత్స్న ఫోన్ నంబర్ డిలీట్ చేయాలని ఆలోచిస్తుంది.

దీపకు బొట్టు పెట్టిన కార్తీక్

కార్తీక్ పుట్టిన రోజు సందర్భంగా దేవాలయంలో పూజలు చేస్తారు. ఈ సందర్భంగా కార్తీక్, దీప చూపులు కలుస్తాయి. ఇద్దరూ ప్రేమగా చూసుకుంటారు. బ్యాక్‍గ్రౌండ్‍లో పాటలు వస్తాయి. ఆ తర్వాత అర్చన చేయిస్తుంది కాంచన. పూజారి చెప్పడంతో దీపకు బొట్టు పెడతాడు కార్తీక్. ఫ్రెండ్‍గా అప్పుడు గంట కొట్టించావని, ఇప్పుడు నాన్నవి కదా అని కార్తీక్‍తో శౌర్య అంటుంది. అందుకే అమ్మానాన్నలుగా కార్తీక్, దీప ఇద్దరూ కలిసి తనను ఎత్తుకొని గంట కొట్టించాలని శౌర్య అడుగుతుంది. ఆ తర్వాత ఇద్దరూ శౌర్యను ఎత్తుకొని గంట కొట్టిస్తారు. దీంతో శౌర్య సంతోషిస్తుంది.

నవ్వితే చూడాలని ఉంది

ఆ తర్వాత గుడిలోని చెట్టుకు దారం చుడుతూ పూజ చేస్తుంది దీప. దీంతో ఈ పూజను శౌర్యకు తల్లిగా చేస్తున్నావా, నాకు భార్యగా చేస్తున్నావా.. శౌర్యకు అమ్మగా చేస్తున్నావా అని కార్తీక్ ప్రశ్నిస్తాడు. శౌర్య సంతోషంగా ఉండడం ఈరోజు చూశానని, నీ ముఖంలోని అది చూడాలని అనుకుంటున్నానని దీపతో కార్తీక్ చెబుతాడు. బలవంతంగా తాళి కట్టానని, అన్ని విషయాల్లో ఇబ్బంది పెట్టలేనని అంటాడు. నువ్వు నవ్వితే.. పని చేస్తూ పాటలు పాడితే చూడాలని ఉందంటూ దీపతో కార్తీక్ చెబుతాడు. ఇలా కష్టాలన్నీ తీరిపోయి సంతోషంగా ఉండాలని ఎదురుచూస్తున్నానని అంటాడు. నువ్వు నీలా ఉండు దీప.. నవ్వుతూ ఉండూ అని అంటాడు. దీప శ్రద్ధగా పూజ చేస్తూ ఉంటుంది.

తాతకు చెప్పకుండా గుడికి వెళ్లిన జ్యోత్స్న

గుడికి వెళ్లాలని జ్యోత్స్న కూడా రెడీ అవుతుంది. కార్తీక్ ఇంటికి వెళ్లొద్దని తాత చెప్పాడు కదే అని జ్యోత్స్నను వారిస్తుంది పారిజాతం. అందుకే గుడికి వెళుతున్నానని జ్యోత్స్న అంటుంది. కార్తీక్ ప్రతీ పుట్టిన పుట్టిన రోజున అత్త శివాలయంలో దీపాలు వెలిగిస్తుంది కదా.. పైగా ఈసారి కొత్త కోడలు, కొత్త మనవరాలు కూడా ఉండడంతో సెలెబ్రేషన్స్ మామూలుగా ఉండవని జ్యోత్స్న అంటుంది. తరించడానికి వెళుతున్నాననో.. తగలేయడానికి వెళుతున్నాననో చూడు అంటూ పారిజాతంతో జ్యోత్స్న అంటుంది. దీంతో ఏ గొడవ చేయవద్దని పారిజాతం చెబుతుంది. గుడికి వెళ్లామని తెలిస్తే తాట తీస్తాడని అంటుంది. తాత ఒప్పుకోడని పారిజాతం అంటే.. అసలు అడగనని జ్యోత్స్న చెబుతుంది.

తన పుట్టిన రోజుకు కార్తీక్ తీసుకొచ్చిన నెక్లెస్ వేసుకున్నానని జ్యోత్స్న అంటుంది. ఇది చూస్తే దీప గుండెకు గాయం అవుతుందని అంటుంది. వెళ్లొద్దని పారిజాతం వారిస్తుంది. తేడాగా వాడితే దీప కోనేట్లో ముంచేస్తుందని చెబుతుంది. అంతా తాను చూసుకుంటానని గుడికి వెళుతుంది జ్యోత్స్న.

దీపాలు వెలిగించేందుకు కార్తీక్, దీప, శౌర్య సిద్ధమవుతుంటారు. నీ పుట్టిన రోజు అందరం కలిసి అప్పట్లో దీపాలు వదిలేవారమని కార్తీక్‍తో చెబుతుంది కాంచన. అలా బాధపడకూడదనే నేను వచ్చాను అత్తా అంటూ జ్యోత్స్న ఎంట్రీ ఇస్తుంది.

నువ్వొస్తే కొత్త బాధ

“నువ్వొస్తే ఉన్న బాధలు పోవడం కాదు. కొత్త బాధ మొదలవుతుంది” అని కార్తీక్ అంటాడు. కాంచన అభ్యంతరం చెప్పడంతో.. నువ్వు బాధపడతావని రెస్టారెంట్‍లో జరిగింది పూర్తిగా చెప్పలేదమన్నా అని కార్తీక్ అంటాడు. గొడవ పడడానికే వచ్చావా అంటూ జ్యోత్స్నతో కాంచన అంటుంది. ఎందుకొచ్చావని నిలదీస్తుంది. బావ పేరుతో కోనేట్లో దీపాలు వెలిగించేందుకు వచ్చానని జ్యోత్స్న అంటే.. ఆ మాట మీ తాతకు చెప్పావా అని కార్తీక్ అంటాడు. బావ ఎంత వెటకారంగా మాట్లాడుతున్నాడో చూశావా అత్తా.. ఇంట్లో చెబితే పంపిస్తారా అని జ్యోత్స్న అంటుంది. ఎవరికీ తెలియకుండా వచ్చానని చెబుతుంది.

ఇంటికి రాలేదు కదా అని కాంచన అంటుంది. ఎక్కడికైతే ఏంటి శివన్నారాయణ అందరినీ ఉతికి ఆరేయడానికి అని వెటకారంగా అంటాడు కార్తీక్.

బావకు కూడా నేనంటే ఇష్టం

“బావంటే నాకు ఎంత ప్రేమో నీకు తెలుసు కదా. బావకు కూడా నేనంటే చాలా ఇష్టం. నా ప్రతీ పుట్టిన రోజుకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేవాడు. ఈ మెడలో ఉన్న నెక్లెస్ బావ గిఫ్టుగా ఇచ్చేందే” అని దీపను బాధపెట్టేందుకు జ్యోత్స్న మాట్లాడుతుంది. అయితే, తనకు గుర్తుందని, అయితే ఇది అది కాదే అని శౌర్య అంటుంది.

రెచ్చగొట్టడం రచ్చ చేయడం

“కత్తితో చేసిన గాయం కంటే.. మాటతో చేసిన గాయం జీవితాంతం బాధపెడుతుంది. గాయం చేసిన వారు ఉన్నారు.. అలాంటి గాయం చేసిన వారు ఉన్నారా” అని దీపను జ్యోత్స్న కక్ష సాధిస్తున్న విషయాన్ని కార్తీక్ లేవనెత్తుతాడు. "ఎదుటి వారు ఏడుపుతో కొట్టుకుకుపోతున్నా మనకు ఏం పట్టదు. రెచ్చగొట్టడం.. రచ్చ చేయడం. చదువుకోని పెద్దవాళ్లు అలానే ఉన్నారు. చదువుకున్న చిన్నవాళ్లు అలానే ఉన్నారు” అని కార్తీక్ అంటాడు. దీంతో నన్ను, గ్రానీని కలిపి తిడుతున్నావని నాకు అర్థమైందని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. ఎంతైనా తిట్టుకో.. నీతో కలిసిపోయేందుకే వచ్చానని, దీపను ఏడిపిస్తానని అనుకుంటుంది. మనలాంటి వాళ్లు అలాంటి వాళ్లకు దూరంగా ఉండాలని కార్తీక్ అంటాడు. లేకపోతే వాదిస్తూ కూర్చోవాలని, ఓ టైమ్ తర్వాత ఎందుకు గొడవ పడుతున్నామో అర్థం కాదని చెబుతాడు.

వెళ్లిపోతాన్న జ్యోత్స్నను ఆపిన కాంచన

ఓర్పు సహనంతో దేన్నయినా గెలవొచ్చని దీప అంటుంది. మనుషులను గెలవొచ్చు.. మూర్ఖులను కాదు అని కోపంగా అంటాడు కార్తీక్. బావ పుట్టిన రోజున ఆనందంగా వచ్చానని, ఎవరినీ బాధపెట్టాలని కాదు అని జ్యోత్స్న అంటుంది. తన కారణంగా ఎవరూ ఇబ్బంది పడొద్దని వెళ్లిపోయేందుకు జ్యోత్స్న రెడీ అవుతుంది. అయితే జ్యోత్స్నను కాంచన ఆపుతుంది. కార్తీక్ పుట్టిన ఎవరినీ బాధపెట్టనని, అందరం కలిసి దీపాలు వెలిగిస్తామని చెప్పారు. ఈరోజు మాతో ఉండు అనిపించినా ఆ తర్వాత నా కొడుకుతో ఉండు అనిపిస్తానని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. కొందరికి దూరంగానే ఉంటేనే మనశ్శాంతిగా ఉంటామమ్మా.. కానీ నువ్వు ఉండు అన్నాక వెళ్లిపోమంటే బాధపడతావంటూ మనసులో అనుకుంటాడు కార్తీక్. జ్యోత్స్న కారణంగా నేను దీప పడుతున్న బాధలు చాలు అంటూ తనలో తాను మాట్లాడుకుంటాడు. శివుడిని తలచుకొని దీపాలు వదలాలని కాంచన చెబుతుంది. కార్తీక దీపాలు ఎందుకు వలుతారో తెలియని వాళ్లు కూడా ఉన్నారని పంచ్ వేస్తాడు కార్తీక్. నన్నే ఉంటున్నావు కదా అని.. దీపాలు ఎందుకు వదులుతారో చెప్పాలని దీపను జ్యోత్స్న అడుగుతుంది. దీంతో కార్తీక దీపం 2 నేటి (నవంబర్ 22) ఎపిసోడ్ ముగిసింది.

Whats_app_banner