తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kapil Sharma Racist Joke: కోలీవుడ్ దర్శకుడు అట్లీ లుక్‌పై కపిల్ శర్మ వెటకారం.. ఉతికారేస్తున్న నెటిజన్లు

Kapil Sharma Racist Joke: కోలీవుడ్ దర్శకుడు అట్లీ లుక్‌పై కపిల్ శర్మ వెటకారం.. ఉతికారేస్తున్న నెటిజన్లు

Galeti Rajendra HT Telugu

16 December 2024, 15:15 IST

google News
  • Kapil Sharma Racist Joke: డైరెక్టర్ అట్లీపై కపిల్ శర్మ వేసిన జోక్‌పై నెటిజన్లు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. అట్లీ రూపంపై వెటకారం చేస్తూ కపిల్ ప్రశ్న అడగ్గా.. అట్లీ గట్టిగా చురకలు అంటిచేస్తూ సమాధానం ఇచ్చాడు. 

అట్లీ, కపిల్ శర్మ
అట్లీ, కపిల్ శర్మ

అట్లీ, కపిల్ శర్మ

కోలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరుగా ఉన్న అట్లీపై బాలీవుడ్ కమెడియన్ కపిల్ శర్మ నోరుజారాడు. బాలీవుడ్‌లో జవాన్ సినిమాతో బ్లాక్‌బాస్టర్ హిట్ అందుకున్న అట్లీ.. త్వరలోనే ‘బేబీ జాన్‌’ సినిమాతో రాబోతున్నాడు. 

బేజీ జాన్‌తో రాబోతున్న అట్లీ

వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్‌టైనర్ మూవీ ఈ ‘బేజీ బాన్’కాగా.. డిసెంబరు 20న థియేటర్లలోకి రాబోతోంది. దాంతో.. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ‘ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షో’కి అట్లీ వెళ్లాడు. అక్కడ కపిల్ చాలా వెటకారంగా అట్లీ రూపం గురించి మాట్లాడాడు. దాంతో నెటిజన్లు కపిల్‌పై ఓ రేంజ్‌లో చురకలు అంటించేస్తున్నారు.

అట్లీపై వెటకారం

‘ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షో’లో కపిల్ ఏమన్నాంటే.. మీరు ఎవరైనా హీరోకి కథ చెప్పడానికి వెళ్లినప్పుడు.. వాళ్లు అట్లీ ఎక్కడ అని అడుగుతారా? అంటూ వెటకారంగా ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకి అట్లీ నొచ్చుకున్నా.. చాలా హుందాగా సమాధానం ఇచ్చాడు. 

‘‘మీరు ఎందుకు నన్ను ఈ ప్రశ్న అడిగారో నాకు అర్థమైంది. వాస్తవానికి మనం ఎలా ఉన్నామనేది ముఖ్యం కాదు.. టాలెంట్ ముఖ్యం. మనలో టాలెంట్ ఉంటే.. మన రూపం ఎలా ఉన్నా పెద్ద మ్యాటరే కాదు’ అని అట్లీ బదులిచ్చాడు.

కపిల్‌కి చురకలు

మురుగదాస్‌ తొలి అవకాశం ఇవ్వడం గురించి అట్లీ మాట్లాడుతూ ‘‘నేను మొదటిసారి మురగదాస్ దగ్గరికి వెళ్లినప్పుడు..అతను నా స్క్రిప్ట్ వర్క్‌ను చూశారు తప్ప నా రూపాన్ని కాదు. నా టాలెంట్ చూసి ఆయనే ప్రొడ్యూసర్‌గా మారారు. కేవలం మనిషి రూపాన్ని కాదు.. అతనిలో ఉన్న టాలెంట్‌పై మనం నమ్మకం ఉంచాలి’’ అని కపిల్‌కి గట్టిగా కౌంటర్ ఇచ్చాడు.

పిలిచి అవమానిస్తావా?

అట్లీ సమాధానంతో చాలా మంది నెటిజన్లు ఏకీభవిస్తూ.. ‘ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షో’కి పిలిచి అవమానిస్తావా? అంటూ కపిల్‌ను ఏకిపారేస్తున్నారు. మరి కపిల్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్తాడా? లేదా తన షోకి మరింత పబ్లిసిటీ దొరికిందని ఊరుకుంటాడో చూడాలి.

తదుపరి వ్యాసం