తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kantara Telugu Trp Rating: కాంతార తెలుగు టీఆర్‌పీ రేటింగ్‌ - టాప్ ఫైవ్‌లో రిష‌బ్‌శెట్టి మూవీ

Kantara Telugu Trp Rating: కాంతార తెలుగు టీఆర్‌పీ రేటింగ్‌ - టాప్ ఫైవ్‌లో రిష‌బ్‌శెట్టి మూవీ

04 February 2023, 7:53 IST

  • Kantara Telugu Trp Rating: కాంతార తెలుగు డ‌బ్బింగ్ వెర్ష‌న్ రికార్డ్ టీఆర్‌పీ రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది. హ‌య్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్ ద‌క్కించుకున్న టాప్ ఫైవ్ తెలుగు డ‌బ్బింగ్ సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది.

కాంతార
కాంతార

కాంతార

Kantara Telugu Trp Rating: తెలుగు డ‌బ్బింగ్ సినిమాల్లో కాంతార కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. హ‌య్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్ రాబ‌ట్టిన తెలుగు డ‌బ్బింగ్ సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. గ‌త ఏడాది విడుద‌లైన ఈ క‌న్న‌డ చిత్రం బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దాదాపు 16 కోట్ల వ్య‌యంతో రూపొందిన ఈ సినిమా 400 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.

ట్రెండింగ్ వార్తలు

Geethanjali Malli Vachindi OTT: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే! ఎక్కడ చూడొచ్చంటే..

Gam Gam Ganesha: ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే మంచి క్రైమ్ కామెడీ మూవీ: డైరెక్టర్

Anil Ravipudi: దర్శకరత్న దాసరి జయంతి వేడుకలు.. ఐపీఎల్‌పై అనిల్ రావిపూడి కాంట్రవర్సీ కామెంట్స్

Aha OTT: ఓటీటీలో ఆహా అనిపించే 3 సినిమాలు.. అన్ని ఒకేదాంట్లో ఒకే రోజు నుంచి స్ట్రీమింగ్.. మీరు చూశారా?

తెలుగులో కాంతార టైటిల్‌తోనే నిర్మాత అల్లు అర‌వింద్ ఈ సినిమాను రిలీజ్ చేశారు. తెలుగు వెర్ష‌న్ కూడా యాభై కోట్ల వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్న‌ది. నిర్మాత‌ల‌కు అత్య‌ధిక లాభాల‌ను మిగిల్చిన తెలుగు డ‌బ్బింగ్ సినిమాల్లో ఒక‌టిగా కాంతార నిలిచింది. తాజాగా ఈ సినిమా బుల్లితెర‌పై రికార్డ్ టీఆర్‌పీ రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది.

ఇటీవ‌లే స్టార్ మా ఛానెల్‌లో తెలుగు ప్రీమియ‌ర్ టెలికాస్ట్ అయ్యింది. ఈ ఫ‌స్ట్ ప్రీమియ‌ర్‌కు 12.35 టీఆర్‌పీ రేటింగ్ రావ‌డం గ‌మ‌నార్హం.హ‌య్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్ సొంతం చేసుకున్న టాప్ ఫైవ్ తెలుగు డ‌బ్బింగ్ సినిమాల్లో ఒక‌టిగా కాంతార నిలిచింది. ర‌జ‌నీకాంత్‌ రోబో, బిచ్చ‌గాడు, క‌బాలి, కాంచ‌న 3 త‌ర్వాత కాంతార నిలిచింది.

రిష‌బ్‌శెట్టి హీరోగా న‌టిస్తూ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. త‌మ‌కు దానంగా ఇచ్చిన భూముల‌ను ఆక్ర‌మించుకున్న‌రాజ‌వంశీయుల‌పై దేవుడి స‌హాయంతో శివ అనే యువ‌కుడు ఎలాంటి పోరాటం సాగించాడ‌న్న‌దే ఈ సినిమా క‌థ‌. కాంతార సినిమాలో రియ‌లిస్టిక్ యాక్టింగ్‌తో రిష‌బ్‌శెట్టి అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాడు. క‌ర్ణాట‌క‌లోని భూత‌కోళ అనే క‌ళ‌ను క‌థ‌లో అంత‌ర్భాగం చేసిన విధానం ప్రేక్ష‌కుల్ని ఆకట్టుకున్నది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.