Allu Aravind On Nepotism: అంద‌రూ హీరోలు కాలేరు -నెపోటిజంపై అల్లు అర‌వింద్ సురేష్‌బాబు కామెంట్స్-allu aravind suresh babu open ups about nepotism in unstoppable show ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Allu Aravind Suresh Babu Open Ups About Nepotism In Unstoppable Show

Allu Aravind On Nepotism: అంద‌రూ హీరోలు కాలేరు -నెపోటిజంపై అల్లు అర‌వింద్ సురేష్‌బాబు కామెంట్స్

Nelki Naresh Kumar HT Telugu
Dec 03, 2022 04:50 PM IST

Allu Aravind On Nepotism: బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ షోలో నెపోటిజంపై అగ్ర నిర్మాత‌లు అల్లు అర‌వింద్‌, సురేష్‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

అల్లు అర‌వింద్‌, బాల‌కృష్ణ‌,  రాఘ‌వేంద్ర‌రావు, సురేష్‌బాబు
అల్లు అర‌వింద్‌, బాల‌కృష్ణ‌, రాఘ‌వేంద్ర‌రావు, సురేష్‌బాబు

Allu Aravind On Nepotism: బాలీవుడ్‌, టాలీవుడ్ అనే భేదాలు లేకుండా ప్ర‌తి ఇండస్ట్రీలో నెపోటిజం క‌నిపిస్తుంటుంది. ఈ నెపోటిజం కార‌ణంగా అగ్ర హీరోలు, ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌తో పాటు వారి త‌న‌యులు చాలా సార్లు విమ‌ర్శ‌ల‌కు గుర‌య్యారు. ఈ నెపోటిజం బాధితుల్లో అల్లు అర‌వింద్‌తో పాటు ఆయ‌న త‌న‌యుడు అల్లు అర్జున్ కూడా ఉన్నారు. కెరీర్ ఆరంభంలో నెపోటిజంతోనే అల్లు అర్జున్ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చాడంటూ చాలా మంది ట్రోల్స్ చేశారు. కానీ త‌న టాలెంట్‌తో అల్లు అర్జున్ పాన్ ఇండియ‌న్ స్టార్‌గా ఎదిగి ఆ విమ‌ర్శ‌ల‌కు బ‌దులిచ్చాడు.

తాజాగా బాల‌కృష్ణ అన్‌స్టాపబుల్ టాక్‌షోలో నెపోటిజంపై అల్లు అర‌వింద్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. నెపోటిజం అనే మాట విన‌గానే మీకు ఏం గుర్తొస్తుంద‌ని హోస్ట్ బాల‌కృష్ణ అడిగిన ప్ర‌శ్న‌కు అల్లు అర‌వింద్ స్పందిస్తూ ఈ స‌మాధానం చెప్పినందుకు త‌న‌ను కొద్ది మంది ట్రోల్ చేస్తార‌ని తెలుసున‌ని అన్నాడు.

కానీ ట్రోల్ చేసే ముందు మీ కుటుంబం ఇండ‌స్ట్రీలో ఉంటే, మీకు అవ‌కాశం ఉండికూడా వార‌సుల్ని ప‌రిచ‌యం చేయకుండా ఇది నెపోటిజం అని ప‌క్క‌కు వెళ్లిపోతాం అని గుండెల మీద చేయి వేసుకొని నా గురించి ట్రోల్ చేయండి అంటూ అల్లు అర‌వింద్ అన్నాడు. సినిమా వాతావ‌ర‌ణంలోనే ఉండి. యాక్టింగ్ ప‌ట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లు ఈ ఫీల్డ్ లోకి రావడం సహజం. దానిని ఎవ‌రూ ఆప‌లేరు.

సినిమా రంగంతో పాటు రాజ‌కీయం, వైద్యంతో పాటు అన్ని రంగాల్లో నెపోటిజం ఉంది. నెపోటిజానికి వ్య‌తిరేకంగా ఉండేవాళ్లు అవ‌కాశాలు లేక ఇలా విమర్శలు, ట్రోల్స్ చేస్తున్నారా అంటూ వారిని నేను ప్ర‌శ్న అడుగుతున్నా అని అల్లు అర‌వింద్ పేర్కొన్నాడు. ఆ త‌ర్వాత సురేష్‌బాబు కూడా నెపోటిజం అనేది అవ‌కాశాలు రావ‌డానికి మాత్ర‌మే ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని, కానీ టాలెంట్ లేక‌పోతే స‌క్సెస్ మాత్రం ద‌క్క‌ద‌ని అన్నాడు.

ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టి స‌క్సెస్ కానీ పెద్ద హీరోలు, డైరెక్ట‌ర్ల పిల్ల‌లు, ఫ్యామిలీ మెంబ‌ర్స్ చాలా మంది ఉన్నార‌ని పేర్కొన్నాడు. ఆ త‌ర్వాత డైరెక్ట‌ర్ల‌, హీరోల త‌న‌యులు ఎందుకు హీరోలే కావాల‌ని అనుకుంటున్నారు. డైరెక్ట‌ర్లు, ప్రొడ్యూస‌ర్లు కావ‌చ్చుక‌దా అని బాల‌కృష్ణ వారిని మ‌రో ప్ర‌శ్న అడిగాడు. అందుకు డైరెక్ట‌ర్లు కావ‌డం క‌ష్టం హీరోలు కావ‌డం ఈజీ అనుకుంటున్నారు కానీ అంద‌రూ హీరోలు కాలేరు. కొంద‌రే అవుతారు అంటూ సురేష్‌బాబు స‌మాధానం చెప్ప‌డం ఆస‌క్తిని పంచుతోంది. నెపోటిజంపై అల్లు అర‌వింద్‌, సురేష్‌బాబు చెప్పిన స‌మాధానాలు హాట్ టాపిక్‌గా మారాయి.

IPL_Entry_Point