Kantara 100 Days : దుమ్మురేపిన కాంతార.. హిందీలో 100 డేస్ కంప్లీట్-kantara completes 100 days since hindi release hombale films express gratitude ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Kantara Completes 100 Days Since Hindi Release Hombale Films Express Gratitude

Kantara 100 Days : దుమ్మురేపిన కాంతార.. హిందీలో 100 డేస్ కంప్లీట్

Anand Sai HT Telugu
Jan 23, 2023 06:18 AM IST

Kantara Completes 100 days In Hindi : చిన్న సినిమాగా మెుదలైన కాంతార.. చాలా రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పుడు తాజాగా మరో మైలు రాయిని చేరుకుంది. కాంతార హిందీ వెర్షన్ వంద రోజులు పూర్తి చేసుకుంది.

కాంతార 100 డేస్
కాంతార 100 డేస్ (twitter)

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన కాంతార సినిమా(Kantara Cinema) ప్రభంజనం సృష్టించింది. రిషబ్ శెట్టి(Rishab Shetty) దర్శకత్వం వహించిన ఈ చిత్రం రికార్డుల గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. అయితే తాజాగా ఈ సినిమా హిందీలో 100 రోజులు ఆడింది. ఇటీవలి కాలంలో వారం, పది రోజులు థియేటర్లలో సినిమా ఆడటమే కష్టంగా ఉంది. అలాంటిది హిందీ వెర్షన్ వంద రోజులు ఆడటంపై చిత్ర నిర్మాణ సంస్థ హోంబళే ఫిలిమ్స్.. సంతోషం వ్యక్తం చేసింది. రిషబ్ శెట్టి కూడా ఆనందం వ్యక్తం చేశాడు.

ఈ సినిమాలో నటించిన అందరికీ పాన్ ఇండియా(Pan India) స్థాయిలో గుర్తింపు వచ్చింది. రిషబ్ శెట్టి, సప్తమి గౌడ, మానసి సుధీర్, అచ్యుత్ కుమార్, కిషోర్ వంటి కళాకారుల నటనను అన్ని భాషల్లో మెచ్చుకున్నారు. బాలీవుడ్‌(Bollywood)లో అనేక మంది సెలబ్రిటీలు రెస్పాండ్ అయ్యారు. కంగనా రనౌత్, వివేక్ అగ్నిహోత్రి, హృతిక్ రోషన్ వంటి వారికి ఈ సినిమా చాలా నచ్చింది.

కాంతార కన్నడలో సెప్టెంబర్ 30న విడుదల కాగా, హిందీ వెర్షన్ అక్టోబర్ 14న విడుదలైంది. ఈ చిత్రానికి రిషబ్ శెట్టి రచన మరియు దర్శకత్వం వహించాడు. హోంబలే ఫిల్మ్స్(Hombale Films) పతాకంపై విజయ్ కిరగందూర్ మరియు చలువే గౌడ చిత్రాన్ని నిర్మించారు.

కాంతార విజయం తర్వాత అందరి దృష్టి కాంతార 2(Kantara 2)పై పడింది. మెుదట్లో పార్ట్ 2 మీద పెద్దగా స్పందిచలేదు చిత్రబృందం. ఆ తర్వాత కాంతార 2 రానున్నట్టుగా హోంబళే ఫిలిమ్స్ ప్రకటించింది. రిషబ్ శెట్టి సినిమా రెండో భాగాన్ని రూపొందిస్తున్నాడు. అయితే, ఇది సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ గా రానుంది. హోంబలే ఫిలింస్ వ్యవస్థాపకుడు విజయ్ కిరగందూర్ ఈ విషయాన్ని పంచుకున్నాడు. ఇప్పటికే కాంతార 2 కోసం రిషబ్ శెట్టి పని మెుదలుపెట్టాడు. జూన్‌లో షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాడు. షూటింగ్‌కి వర్షాకాలం అవసరమని, వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మేలో సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని హోంబళే ఫిలిమ్స్ చూస్తోంది.

IPL_Entry_Point