తెలుగు న్యూస్  /  Entertainment  /  Kantara Prequel Announced By The Director Of The Movie Rishabh Shetty

Kantara Prequel: కాంతారా సీక్వెల్ కాదు ప్రీక్వెల్.. 100 డేస్ సందర్భంగా అనౌన్స్ చేసిన రిషబ్ శెట్టి

Hari Prasad S HT Telugu

06 February 2023, 21:26 IST

    • Kantara Prequel: కాంతారా సీక్వెల్ కాదు ప్రీక్వెల్ రాబోతోంది. ఈ విషయాన్ని కాంతారా 100 డేస్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మూవీ హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి అనౌన్స్ చేయడం విశేషం. ఈ ప్రీక్వెల్ గురించి అతడు ఇంకా ఏమన్నాడో చూడండి.
కాంతారా మూవీలో రిషబ్ శెట్టి
కాంతారా మూవీలో రిషబ్ శెట్టి (MINT_PRINT)

కాంతారా మూవీలో రిషబ్ శెట్టి

Kantara Prequel: కాంతారా.. 2022లో ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయం సాధించిన సినిమా. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 లాంటి మూవీస్ ఎంతో హైప్ క్రియేట్ చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందుకు తగినట్లే సక్సెస్ సాధించాయి. కానీ కాంతారా పూర్తిగా భిన్నం. కర్ణాటకలోనే మొదట్లో ఓ అనామక సినిమాగా రిలీజై తర్వాత కలెక్షన్ల వర్షం కురిపించింది.

ట్రెండింగ్ వార్తలు

SS Rajamouli: అనిల్ రావిపూడి మీద ముసుగేసి గుద్దేస్తే 10వేలు ఇస్తా: దర్శక ధీరుడు రాజమౌళి.. ఎందుకు ఇలా అన్నారంటే..

OTT Movies This Weekend: ఈ వీకెండ్ ఓటీటీల్లోకి రానున్న ఈ 4 చిత్రాలను మిస్ అవొద్దండి!

Rajinikanth Biopic: రజినీకాంత్ బయోపిక్ హక్కులను తీసుకున్న బాలీవుడ్ నిర్మాత! వివరాలివే

Panchayat S3 Release: ఈనెలలోనే స్ట్రీమింగ్‍కు రానున్న పంచాయత్ సీజన్ 3.. డేట్ కోసం ఫ్యాన్స్‌కు పని పెట్టిన ఓటీటీ

ఆ తర్వాత తెలుగు, హిందీ సహా ఇతర భాషల్లోకీ వచ్చి అందరు ప్రేక్షకులనూ ఆకట్టుకుంది. ఏకంగా రూ.450 కోట్లు వసూలు చేసింది. అలాంటి సినిమా నుంచి సీక్వెల్ రాబోతోందని గతంలో వార్తలు రావడంతో దీనిపై ప్రేక్షకులు ఎంతో ఆసక్తి కనబరిచారు. కానీ తాజాగా ఈ సినిమా డైరెక్టర్, హీరో రిషబ్ శెట్టి.. దీనికి ప్రీక్వెల్ తీసుకొస్తున్నామంటూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

కాంతారా పార్ట్ 2 చూశారు.. పార్ట్ 1 తీసుకొస్తున్నా..

ఈ మధ్యే కాంతారా మూవీ 100 రోజులు పూర్తి చేసుకుంది. దీనిని సెలబ్రేట్ చేసుకోవాలని మూవీ యూనిట్ భావించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్ లో రిషబ్ శెట్టి మాట్లాడాడు. నిజానికి ప్రేక్షకులు కాంతారా పార్ట్ 2 చూశారని, ఇక తాను పార్ట్ 1 తీసుకురాబోతున్నట్లు చెప్పి ఆశ్చర్య పరిచాడు. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నట్లు కూడా చెప్పాడు.

"కాంతారా సినిమాపై తమ ప్రేమాభిమానాలు కురిపించిన ఆడియెన్స్ అందరికీ థ్యాంక్స్. ఎంతో ఆనందంగా ఉంది. దేవుడి ఆశీస్సులతో ఈ మూవీ 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నేను కాంతారా ప్రీక్వెల్ ను అనౌన్స్ చేస్తున్నాను. మీరు చూసింది పార్ట్ 1. వచ్చే ఏడాది పార్ట్ 1 తీసుకొస్తా" అని రిషబ్ శెట్టి చెప్పాడు.

"ఈ ప్రీక్వెల్ ఆలోచన కాంతారా షూటింగ్ చేస్తున్నప్పుడే వచ్చింది. ఎందుకంటే కాంతారా చరిత్ర చాలా లోతైనది. ప్రస్తుతం కథ కోసం మరింత లోతుగా వివరాలను సేకరిస్తున్నాం. దీనిపై మా రీసెర్చ్ ఇంకా కొనసాగుతోంది. అందుకే ఈ సినిమా గురించి మరీ ఎక్కువగా ఏమీ చెప్పలేను" అని రిషబ్ తెలిపాడు. నిజానికి ఈ సినిమా ప్రొడ్యూసర్స్ గతంలోనే సీక్వెల్ తీసుకొస్తున్నట్లు చెప్పారు. కానీ ఇప్పుడది సీక్వెల్ కాదు ప్రీక్వెల్ అని తేలింది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.