Kantara TRP Rating: కాంతార టీఆర్‌పీ రేటింగ్ - కేజీఎఫ్ -2 రికార్డ్‌ను బ్రేక్ చేసిన రిష‌బ్‌శెట్టి -rishab shetty kantara gets highest trp rating in first tv premiere ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Rishab Shetty Kantara Gets Highest Trp Rating In First Tv Premiere

Kantara TRP Rating: కాంతార టీఆర్‌పీ రేటింగ్ - కేజీఎఫ్ -2 రికార్డ్‌ను బ్రేక్ చేసిన రిష‌బ్‌శెట్టి

Nelki Naresh Kumar HT Telugu
Jan 28, 2023 05:36 PM IST

Kantara TRP Rating: బాక్సాఫీస్ వ‌ద్ద ప‌లు రికార్డులు బ్రేక్ చేసిన క‌న్న‌డ చిత్రం కాంతార బుల్లితెర‌పై కూడా అద్భుత‌మైన ఆద‌ర‌ణ‌ను సొంతం చేసుకున్న‌ది. క‌న్న‌డ చిత్ర‌సీమ‌లో హ‌య్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్ ద‌క్కించుకున్న సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది.

కాంతార
కాంతార

Kantara TRP Rating: థియేట‌ర్ల‌లో సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిన కాంతార సినిమా బుల్లితెర‌పై స‌త్తాచాటింది. ఇటీవ‌లే స్టార్ సువ‌ర్ణ ఛాన‌ల్‌లో టెలికాస్ట్ అయిన ఈ సినిమా 15.8 టీఆర్‌పీ రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది. సాండ‌ల్‌వుడ్‌లో హ‌య్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్ ద‌క్కించుకున్న సినిమాల్లో ఒక‌టిగా కాంతార రికార్డ్ క్రియేట్ చేసింది.

గ‌త ఏడాది విడుద‌లైన కేజీఎఫ్‌-2 క‌న్న‌డ వెర్ష‌న్ కు 10.2 టీఆర్‌పీ రేటింగ్ మాత్ర‌మే వ‌చ్చింది. తెలుగు వెర్ష‌న్ 9.3 టీఆర్‌పీ రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది. కేజీఎఫ్ -2 తో పోలిస్తే కాంతార సినిమానే బుల్లితెర‌పై అత్య‌ధిక టీఆర్‌పీ రేటింగ్‌ను ద‌క్కించుకోవ‌డం గ‌మ‌నార్హం. బుల్లితెర‌పై య‌శ్ సినిమా రికార్డ్‌ను రిష‌బ్‌శెట్టి బీట్ చేయ‌డం సాండ‌ల్‌వుడ్‌లో ఆస‌క్తిక‌రంగా మారింది.

దాదాపు 16 కోట్ల వ్య‌యంతో రూపొందిన కాంతార సినిమా వ‌ర‌ల్డ్‌వైడ్‌గా 400 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. కాంతార‌లో హీరోగా న‌టిస్తూనే ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు రిష‌బ్‌శెట్టి. భూత‌కోళ అనే క‌ళ నేప‌థ్యంలో కాంతార సినిమా రూపొందింది.

త‌మ‌కు దానంగా ఇచ్చిన భూముల‌ను ఆక్ర‌మించుకోవాల‌ని చూసిన రాజ‌వంశీయుల‌పై శివ అనే యువ‌కుడు దేవుడి స‌హాయంతో ఎలా పోరాటం చేశాడ‌న్న‌దే ఈ సినిమా క‌థ‌. కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిల్మ్స్ కాంతార సినిమాను నిర్మించింది. స‌ప్త‌మి గౌడ‌, అచ్యుత్ కుమార్, కిషోర్ కీల‌క పాత్ర‌లు పోషించారు. తెలుగులో అదే పేరుతో రిలీజైన కాంతార యాభై కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.

IPL_Entry_Point

టాపిక్