తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kanguva Ott Rights: సూర్య కంగువ డిజిటల్ హక్కుల కోసం ప్రైమ్ వీడియో ఎన్ని కోట్లు పెట్టిందో తెలుసా?

Kanguva OTT Rights: సూర్య కంగువ డిజిటల్ హక్కుల కోసం ప్రైమ్ వీడియో ఎన్ని కోట్లు పెట్టిందో తెలుసా?

Hari Prasad S HT Telugu

02 May 2023, 18:52 IST

google News
    • Kanguva OTT Rights: సూర్య కంగువ డిజిటల్ హక్కుల కోసం ప్రైమ్ వీడియో ఎన్ని కోట్లు పెట్టిందో తెలుసా? అసలు కోలీవుడ్ చరిత్రలోనే డిజిటల్ హక్కుల కోసం ఇంత భారీగా ఖర్చు చేయడం తొలిసారని నిర్మాత చెబుతున్నాడు.
కంగువ మూవీ
కంగువ మూవీ (MINT_PRINT)

కంగువ మూవీ

Kanguva OTT Rights: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ కంగువ. గత నెలలోనే ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా రిలీజ్ కు ముందే ఎంతో హైప్ క్రియేట్ చేస్తోంది. ఆ మధ్య మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్స్ కు కూడా ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ మూవీ డిజిటల్ హక్కుల వార్త వైరల్ అవుతోంది.

ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. దీనికోసం ప్రైమ్ వీడియో ఏకంగా రూ.80 కోట్లు చెల్లించినట్లు మూవీ ప్రొడ్యూసర్ కేఈ జ్ఞానవేల్ రాజా చెప్పడం విశేషం. కేవలం సౌతిండియా భాషలైన తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం కోసమే ప్రైమ్ వీడియో ఇంత భారీ మొత్తం చెల్లించినట్లు కూడా అతడు వెల్లడించాడు.

హిందీ సహా ఇతర భాషల కోసం ఎంత మొత్తం చెల్లించారన్నది ఇంకా తెలియలేదు. కోలీవుడ్ లో ఇంత భారీ మొత్తం అనేది ఓ బెంచ్ మార్క్ అని జ్ఞానవేల్ రాజా అన్నాడు. ఈ సినిమాలో సూర్య సరసన బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ నటిస్తోంది. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఈ మూవీ భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. మొత్తం పది భాషల్లో, 3డీ ఫార్మాట్ లోనూ రిలీజ్ కాబోతోంది. వ‌చ్చే ఏడాది ప్ర‌థ‌మార్థంలో కంగువ‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. కంగువ‌ షూటింగ్ 50 శాతం వ‌ర‌కు పూర్త‌యిన‌ట్లు స‌మాచారం.

గోవా, చెన్నైల‌లో షూటింగ్ చేశారు. వీఎఫ్ఎక్స్‌, సీజీకి ఎక్కువ‌గా ఇంపార్టెన్స్ ఉన్న సినిమా కావ‌డంతో ప్రీ ప్రొడ‌క్ష‌న్‌కు స‌మ‌యం ప‌డుతోంద‌ని, అందుకే వ‌చ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

ఈ సినిమాలో యోగిబాబు కీల‌క పాత్ర‌ను పోషిస్తోన్నారు. సూర్య హీరోగా న‌టిస్తోన్న 42వ మూవీ ఇది. అయితే కంగువ అంటే అత్యంత ప‌రాక్ర‌మ‌వంతుడు అని అర్థం. క‌థానుగుణంగానే ఈ టైటిల్‌ను ఫిక్స్ చేసిన‌ట్లు కోలీవుడ్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు సూర్య ఫ్యాన్స్ మాత్రం ఈ టైటిల్‌పై విమ‌ర్శ‌లు వ్య‌క్తం చేస్తున్నారు. కంగువ అనే పేరు వీడియో గేమ్ పేరులా ఉంద‌ని, క‌థ‌కు త‌గ్గ‌ట్లుగా ప‌వ‌ర్‌ఫుల్‌గా లేద‌ని చెబుతోన్నారు.

తదుపరి వ్యాసం