Kalki Bujji, Bhairava OTT: బుజ్జీ, భైరవ యానిమేషన్ సిరీస్ గురించి అప్‍డేట్ ఇచ్చిన కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్
15 July 2024, 15:11 IST
- Kalki 2898 AD - Bujji & Bhairava Series: కల్కి 2898 ఏడీ సినిమా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. ఈ మూవీ కంటే ముందే బుజ్జి, భైరవ అంటూ యానిమేటెడ్ సిరీస్‍లో రెండు ఎపిసోడ్లు వచ్చాయి. అయితే, తదుపరి ఎపిసోడ్ల గురించి ఇప్పుడు అప్‍డేట్ ఇచ్చారు డైరెక్టర్ నాగ్ అశ్విన్.
Kalki Bujji -Bhairava OTT: బుజ్జీ, భైరవ యానిమేషన్ సిరీస్ గురించి అప్‍డేట్ ఇచ్చిన కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద తిరుగులేకుండా దూసుకుపోతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన సైన్స్ ఫిక్షన్ మూవీ రికార్డులను బద్దలుకొడుతోంది. జూన్ 27న రిలీజైన ఈ మూవీ ఇప్పటికే రూ.1000 కోట్ల భారీ మైల్‍స్టోన్ దాటింది. అయితే, కల్కి 2898 ఏడీ విడుదలకు ముందు బుజ్జి, భైరవ అంటూ ఓ యానిమేటెడ్ సిరీస్‍ను మూవీ టీమ్ తీసుకొచ్చింది. రెండు ఎపిసోడ్లను అందుబాటులోకి తెచ్చింది. ఇవి చాలా ఇంట్రెస్టింగ్‍గా సాగాయి. మూవీ థీమ్‍ను తెలియజేశాయి. అయితే, ఈ సిరీస్‍లో మిగిలిన ఎపిసోడ్లు ఎప్పుడొస్తాయా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
కల్కిలోని స్పెషల్ ఫ్యుచరిస్టిక్ కారు, భైరవ మధ్య బంధాన్ని, ఈ చిత్రంలోని ప్రపంచాలను పరిచయం చేసేందుకు మే 31వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో బుజ్జి, భైరవ యానిమేటెడ్ సిరీస్‍ను మూవీ టీమ్ స్ట్రీమింగ్‍కు తెచ్చింది. రెండు ఎపిసోడ్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే, తాజాగా ఈ సిరీస్ తదుపరి ఎపిసోడ్ల గురించి నాగ్ అశ్విన్ వెల్లడించారు.
మరో రెండు ఎపిసోడ్లు.. నాలుగో ప్రపంచం
బుజ్జి, భైరవ యానిమేటెడ్ సిరీస్‍లో మరో రెండు ఎపిసోడ్లు ఉంటాయని నాగ్ అశ్విన్ తాజాగా తెలిపారు. అమెరికాలో ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా స్క్రీనింగ్‍కు హాజరైన నాగ్ అశ్విన్ ఈ బిగ్ అప్‍డేట్ వెల్లడించారు. అలాగే, ఈ ఎపిసోడ్లలో కల్కిలోని నాలుగో ప్రపంచం ఫ్లక్స్ ల్యాండ్స్ ఉంటుందని పేర్కొన్నారు.
కల్కి 2898 ఏడీ చిత్రంలో కాంప్లెక్స్ సైన్యం దాడి చేసినప్పుడు దీపికా పదుకొణ్‍తో పాటు అక్కడి వారిని శంబాల నుంచి వేరే చోటికి తీసుకెళ్లేందుకు శోభన, పశుపతి ప్రయత్నిస్తారు. అదే నాలుగో ప్రపంచం. ఇప్పటికే కల్కి చిత్రంలో కాశీ, కాంప్లెక్స్, శంబాలను చూపించగా.. ఇది కొత్త ప్రదేశంగా ఉండనుంది. ఈ కొత్త ప్రపంచాన్ని బుజ్జి, భైరవ తదుపరి ఎపిసోడ్లలో పరిచయం చేయనున్నట్టు నాగ్ అశ్విన్ వెల్లడించారు.
అయితే, బుజ్జీ, భైరవ యానిమేటెడ్ సిరీస్‍లో తదుపరి రెండు ఎపిసోడ్లు ఎప్పుడు వస్తాయో నాగ్ అశ్విన్ క్లారిటీ ఇవ్వలేదు. దీనికి ఎక్కువ సమయమే పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రూ.1,000 కోట్లు దాటి..
కల్కి 2898 ఏడీ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1,000కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ దాటింది. రెండు రూ.1,000 కోట్ల చిత్రాలు ఉన్న ఏకైక దక్షిణాది నటుడిగా ప్రభాస్ రికార్డులకెక్కారు. కల్కి చిత్రం ఇంకా భారీగా వసూళ్లను రాబడుతోంది. గత వారం వచ్చిన ఇండియన్ 2, సర్ఫిరా చిత్రాలకు మిక్స్డ్ టాక్ రావటం ఈ మూవీకి మరింత ప్లస్‍గా మారింది. వాటితో పోలిస్తే కల్కికి ఇప్పటికీ భారీగా టికెట్ల బుకింగ్స్ జరుగుతున్నాయి.
కల్కి 2898 ఏడీ చిత్రంలో ప్రభాస్‍తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణ్ ప్రధాన పాత్రలు పోషించారు. భారత పురాణాల ఆధారంగా గ్రాండ్ విజువల్స్‌లో సైన్ ఫిక్షన్ చిత్రంలో తెరకెక్కించారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. వైజయంతీ మూవీస్ బ్యానర్ భారీ బడ్జెట్‍తో నిర్మించిన ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం ఇచ్చారు.