Kalki 2898 AD 1000 Crores: రూ.1,000 కోట్ల అద్భుత మైలురాయి దాటిన కల్కి 2898 ఏడీ: రికార్డులు ఇవే-kalki 2898 ad crosses 1000 crores box office collections landmark know the records of prabhas kalki collections ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Kalki 2898 Ad 1000 Crores: రూ.1,000 కోట్ల అద్భుత మైలురాయి దాటిన కల్కి 2898 ఏడీ: రికార్డులు ఇవే

Kalki 2898 AD 1000 Crores: రూ.1,000 కోట్ల అద్భుత మైలురాయి దాటిన కల్కి 2898 ఏడీ: రికార్డులు ఇవే

Published Jul 13, 2024 03:47 PM IST Chatakonda Krishna Prakash
Published Jul 13, 2024 03:47 PM IST

  • Kalki 2898 AD 1000 Crores: కల్కి 2898 ఏడీ సినిమా రూ.1,000 కోట్ల కలెక్షన్ల మైలురాయి దాటింది. దీంతో హీరో ప్రభాస్ ఖాతాలో మరిన్ని రికార్డులు చేరాయి.

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడీ చిత్రం జూన్  27వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఆరంభం నుంచే భారీ కలెక్షన్లను సాధిస్తూ దూసుకెళుతోంది. ఈ చిత్రం రూ.1,000 కోట్ల కలెక్షన్లు దాటేసిందని మూవీ టీమ్ నేడు (జూలై 13) అధికారికంగా వెల్లడించింది. 

(1 / 6)

కల్కి 2898 ఏడీ సినిమా రూ.1000 కోట్ల పోస్టర్‌ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. కర్ణుడిగా ప్రభాస్ లుక్‍తో దీన్ని తీసుకొచ్చింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ మైథో ఎపిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో ప్రభాస్‍తో పాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణ్, కమల్ హాసన్ కూడా ప్రధాన పాత్రలు పోషించారు. 

(2 / 6)

ప్రభాస్‍కు ఇది రెండో రూ.1,000 కోట్ల కలెక్షన్లు దాటిన చిత్రంగా ఉంది.  బాహుబలి 2 (రూ.1,810 కోట్లు) తర్వాత ఇప్పుడు కల్కితో ఆ మ్యాజిక్ మార్క్ సాధించారు ప్రభాస్. రెండు రూ.1000 కోట్ల చిత్రాలు ఉన్న ఏకైక దక్షిణ భారత నటుడిగా ప్రభాస్ చరిత్ర సృష్టించారు. టాలీవుడ్ నుంచి రామ్‍చరణ్ (ఆర్ఆర్ఆర్), జూనియర్ ఎన్టీఆర్ (ఆర్ఆర్ఆర్)కు ఓ రూ.1000 కోట్ల చిత్రం ఉంది.

(3 / 6)

ఇండియాలో షారుఖ్ ఖాన్ (పఠాన్, జవాన్) తర్వాత రెండు రూ.1000 కోట్ల కలెక్షన్ల సినిమాలు ఉన్న హీరోగా ప్రభాస్ నిలిచారు. ఫుల్ రన్‍లో పఠాన్ (రూ.1,050 కోట్లు), జవాన్  (రూ.1,148 కోట్లు) కలెక్షన్లను కల్కి సులువుగా దాటేయడం ఖాయంగా కనిపిస్తోంది. 

(4 / 6)

టాలీవుడ్ నుంచి కల్కి 2898 ఏడీ చిత్రం మూడో రూ.1,000 కోట్ల చిత్రంగా ఉంది. బాహుబలి 2 (రూ.1,810 కోట్లు), ఆర్ఆర్ఆర్ (రూ.1,387 కోట్లు) తర్వాత రూ.1000 కోట్ల మార్క్ దాటిన మూడో టాలీవుడ్ మూవీగా కల్కి నిలిచింది. 

(5 / 6)

మహాభారతం ఆధారంగా ఎపిక్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కల్కి 2898 ఏడీని దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. భారీగా ప్రశంసలు రావటంతో పాటు కమర్షియల్‍గానూ ఈ చిత్రం భారీ బ్లాక్‍బస్టర్ అయింది. ఇంకా జోరు చూపిస్తోంది. 

(6 / 6)

ఇతర గ్యాలరీలు