Kalki 2898 AD day 6 box office collection: ఆరో రోజు మరింత తగ్గిన కల్కి 2898 ఏడీ కలెక్షన్లు.. బడ్జెట్‌ను మించి..
03 July 2024, 7:55 IST
- Kalki 2898 AD day 6 box office collection: కల్కి 2898 ఏడీ మూవీ ఆరోరోజు బాక్సాఫీస్ కలెక్షన్లు మరింత తగ్గాయి. అయితే వీక్ డేస్ లోనూ ఆ మూవీ చెప్పుకోదగిన స్థాయిలోనే వసూలు చేస్తూ ఇప్పటికే బడ్జెట్ ను మించి కలెక్ట్ చేసింది.
ఆరో రోజు మరింత తగ్గిన కల్కి 2898 ఏడీ కలెక్షన్లు.. బడ్జెట్‌ను మించి..
Kalki 2898 AD day 6 box office collection: ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ ఫస్ట్ వీకెండ్ లో కలెక్షన్ల సునామీ సృష్టించిన సంగతి తెలుసు కదా. అయితే ఐదో రోజు నుంచి కాస్త తగ్గింది. ఆరో రోజు ఈ కలెక్షన్లు మరింత తగ్గాయి. అయితే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమా బడ్జెట్ ను మించిపోవడం విశేషం.
కల్కి 2898 ఏడీ ఆరో రోజు కలెక్షన్లు
కల్కి 2898 ఏడీ మూవీ ఆరు రోజుల్లోనే తన బడ్జెట్ రూ.600 కోట్లను గ్రాస్ కలెక్షన్ల రూపంలో దాటిపోయింది. ప్రభాస్, దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటించిన ఈ మూవీ గత గురువారం (జూన్ 27) రిలీజ్ కాగా.. తొలి రోజే రూ.191.5 కోట్లు వసూలు చేసింది. ఇక ఆరో రోజు ఈ సినిమా ఇండియాలో రూ.27.85 కోట్లు మాత్రమే వసూలు చేసినట్లు sacnilk.com వెల్లడించింది.
సోమవారం సగానికి సగం కలెక్షన్లు తగ్గగా.. మంగళవారం (జులై 2) మరో 18.5 శాతం తగ్గాయి. దీంతో ఆరు రోజులు కలిపి ఇండియాలో రూ.371 కోట్లకు చేరాయి. ఆరో రోజు తెలుగులో రూ.11.2 కోట్లు, హిందీలో రూ.14 కోట్లు, తమిళంలో రూ.1.4 కోట్లు, మలయాళంలో రూ.1.2 కోట్లు, కన్నడలో రూ.0.25 కోట్లు వసూలు చేసింది. ఒక్క తెలుగులోనే ఆరు రోజులు కలిపి సుమారు రూ.200 కోట్ల వరకు రావడం విశేషం.
కల్కి 2898 ఏడీ రోజువారీ కలెక్షన్లు
కల్కి 2898 ఏడీ మూవీపై ఉన్న హైప్ తో తొలి రోజే ఇండియాలో రూ.95.3 కోట్ల కలెక్షన్లతో ఈ సినిమా ప్రకంపనలు సృష్టించింది. ఆ తర్వాత రెండో రోజు ఇవి ఏకంగా రూ.59.3 కోట్లకు పడిపోయాయి. మూడో రోజు కాస్త పెరిగి రూ.66.2 కోట్లు రాగా.. నాలుగో రోజు రూ.88.2 కోట్లకు చేరింది. ఇక ఐదో రోజు తొలి సోమవారం రూ.34.15 కోట్లు మాత్రమే రాబట్టింది.
నిజానికి ఈ సినిమా ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.625 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సొంతం చేసుకోవడం విశేషం. ఆరో రోజు ఇవి మరింత పెరిగాయి. తొలి రోజు నుంచే ఈ సినిమాకు ఎక్కడా నెగటివ్ టాక్ రాలేదు. సాధారణ ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ పాజటివ్ రివ్యూలే ఇవ్వడం కూడా కల్కి 2898 ఏడీకి బాగా కలిసి వస్తోంది.
హిందీలోనే ఎక్కువ..
తెలుగులోనే కాదు.. హిందీ బెల్ట్ లోనూ ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. నిజానికి నాలుగో రోజు నుంచి తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయి. నాలుగో రోజైన ఆదివారం హిందీలో అత్యధికంగా రూ.40 కోట్లు వచ్చాయి.
హిందూ పురాణాలకు సైన్స్ ఫిక్షన్ ను జోడించి తీసిన ఈ సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఓ కొత్త కాన్సెప్ట్ తోపాటు యాక్షన్, గ్రాఫిక్స్ లోనూ ఇండియన్ సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లిందీ మూవీ.
టాపిక్