తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kalki 2898 Ad Box Office: వావ్.. ఆర్ఆర్ఆర్ రికార్డు కూడా బ్రేక్ చేసిన కల్కి 2898 ఏడీ.. ఆ జాబితాలో మూడో స్థానానికి..

Kalki 2898 AD Box office: వావ్.. ఆర్ఆర్ఆర్ రికార్డు కూడా బ్రేక్ చేసిన కల్కి 2898 ఏడీ.. ఆ జాబితాలో మూడో స్థానానికి..

Hari Prasad S HT Telugu

22 July 2024, 12:37 IST

google News
    • Kalki 2898 AD Box office: కల్కి 2898 ఏడీ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఆర్ఆర్ఆర్ రికార్డును కూడా బ్రేక్ చేసింది. హిందీ బాక్సాఫీస్ దగ్గర అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ సినిమాల్లో మూడో స్థానానికి చేరింది.
వావ్.. ఆర్ఆర్ఆర్ రికార్డు కూడా బ్రేక్ చేసిన కల్కి 2898 ఏడీ.. ఆ జాబితాలో మూడో స్థానానికి..
వావ్.. ఆర్ఆర్ఆర్ రికార్డు కూడా బ్రేక్ చేసిన కల్కి 2898 ఏడీ.. ఆ జాబితాలో మూడో స్థానానికి..

వావ్.. ఆర్ఆర్ఆర్ రికార్డు కూడా బ్రేక్ చేసిన కల్కి 2898 ఏడీ.. ఆ జాబితాలో మూడో స్థానానికి..

Kalki 2898 AD Box office: ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. 25వ రోజు బాక్సాఫీస్ వసూళ్ల తర్వాత ఆ సినిమా మరో రికార్డును సొంతం చేసుకుంది. హిందీ బాక్సాఫీస్ దగ్గర అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ సినిమాల్లో ఆర్ఆర్ఆర్ ను వెనక్కి నెట్టి మూడో స్థానంలో నిలిచింది. నాలుగో ఆదివారం (జులై 21) కూడా ఆ సినిమా వసూళ్లు భారీగానే ఉన్నాయి.

కల్కి 2898 ఏడీ రికార్డు

ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ 25వ రోజు బాక్సాఫీస్ వసూళ్లు కూడా భారీగానే ఉన్నాయి. ఈ మధ్యే రిలీజైన తెలుగు, హిందీ సినిమాలను కూడా మించి వసూళ్లు సాధిస్తోంది. ఆదివారం (జులై 21) ఈ సినిమా డొమెస్టిక్ మార్కెట్ లో ఏకంగా రూ.8.25 కోట్లు వసూలు చేసింది. శనివారం (జులై 20) ఈ వసూళ్లు రూ.6.1 కోట్లుగా ఉండగా.. మరో 40 శాతం పెరిగాయి.

దీంతో 25 రోజుల్లో కలిపి ఇండియాలో కల్కి 2898 ఏడీ నెట్ వసూళ్లు రూ.616.7 కోట్లకు చేరాయి. ముఖ్యంగా హిందీ మార్కెట్ లో ఈ మూవీ జోరు కొనసాగుతోంది. తాజాగా రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీని మించి హిందీ మార్కెట్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ సినిమాల్లో మూడో స్థానానికి చేరింది. ఇన్నాళ్లూ రూ.306 కోట్లతో మూడో స్థానంలో ఉన్న ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు నాలుగో స్థానానికి పడిపోయింది.

25వ రోజూ జోరు తగ్గని వసూళ్లు

కల్కి 2898 ఏడీ మూవీ 25వ రోజు వసూళ్లు చూస్తే.. హిందీ మార్కెట్ లోనే రూ. 4.85 కోట్లు వచ్చాయి. దీంతో అక్కడ మొత్తం 25 రోజుల కలెక్షన్లు రూ.310 కోట్లకు చేరాయి. తొలి స్థానంలో బాహుబలి 2 రూ.702 కోట్లతో కొనసాగుతుండగా.. రెండో స్థానంలో కేజీఎఫ్ 2 రూ.525 కోట్లతో ఉంది. కల్కి మూడో స్థానానికి చేరగా.. ఆర్ఆర్ఆర్ నాలుగో స్థానానికి పడిపోయింది. ఆర్ఆర్ఆర్ హిందీ మార్కెట్ లో మొత్తంగా రూ.306.2 కోట్లు వసూలు చేసింది.

హిందీలో సర్ఫిరా, బ్యాడ్ న్యూస్ లాంటి సినిమాలు ఉన్నా.. వాటిని అధిగమించి ఈ కల్కి 2898 ఏడీ వసూళ్లు సాధిస్తోంది. ఇక ఇండియాలో త్వరలోనే రూ.650 కోట్ల మార్క్ కూడా అందుకునేలా ఉంది. అదే జరిగితే జవాన్ (రూ.640.25 కోట్లు) రికార్డు కూడా బ్రేకవడం ఖాయం. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకుపైగా వసూళ్లు సాధించిందీ మూవీ.

బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకు పెద్దగా పోటీ లేకపోవడం కూడా కలిసి వస్తోంది. 25 రోజులు అవుతున్నా.. తెలుగు కంటే కూడా హిందీ మార్కెట్ లో ఎక్కువ వసూళ్లు సాధిస్తుండటం విశేషం. ఈ సినిమా 25వ రోజు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా వైజయంతీ మూవీస్ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఎపిక్ మహా బ్లాక్‌బస్టర్ కల్కి 2898 ఏడీ విజయవంతంగా 25 రోజులు పూర్తి చేసుకుంది అనే క్యాప్షన్ తో ఈ అప్డేట్ షేర్ చేసింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం