తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kalki First Song Promo: కల్కి 2898 ఏడీ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో వచ్చేసింది: పంజాబీ స్టైల్‍లో పాట: ఫుల్ సాంగ్ ఎప్పుడంటే..

Kalki First Song Promo: కల్కి 2898 ఏడీ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో వచ్చేసింది: పంజాబీ స్టైల్‍లో పాట: ఫుల్ సాంగ్ ఎప్పుడంటే..

15 June 2024, 17:29 IST

google News
    • Kalki 2898 AD - Bhairava Anthem song: కల్కి 2898 ఏడీ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో వచ్చేసింది. భైరవ ఆంథమ్ అంటూ పాట వస్తోంది. దిల్‍జీత్ దోసంజ్ ఈ పాట పాడారు. ఫుల్ సాంగ్ రిలీజ్ డేట్ కూడా ఖరారైంది. 
Kalki Bhairava Anthem: కల్కి 2898 ఏడీ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. పంజాబీ స్టైల్‍లో పాట
Kalki Bhairava Anthem: కల్కి 2898 ఏడీ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. పంజాబీ స్టైల్‍లో పాట

Kalki Bhairava Anthem: కల్కి 2898 ఏడీ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. పంజాబీ స్టైల్‍లో పాట

Kalki 2898 AD - Bhairava Anthem: కల్కి 2898 ఏడీ సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్ది హైప్ పెరుగుతూనే ఉంది. ట్రైలర్‌ తర్వాత ఈ చిత్రంపై అంచనాలు మరింత భారీగా పెరిగాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ మూవీలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. భైరవ పాత్ర చేస్తున్నారు. ఈ గ్లోబల్ రేంజ్ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. కల్కి 2898 ఏడీ సినిమా జూన్ 27వ తేదీన రిలీజ్ కానుంది. ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ఎప్పుడు వస్తుందా అని సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో భైరవ ఆంథమ్ అంటూ ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేస్తోంది. ఈ పాటకు సంబంధించి ప్రోమోను నేడు (జూన్ 15) రిలీజ్ చేసింది మూవీ టీమ్.

పంజాబీ స్టైల్

కల్కి 2898 ఏడీ నుంచి వస్తున్న ఈ భైరవ ఆంథమ్ పంజాబీ స్టైల్ సాంగ్‍లా ఉంది. నేడు (జూన్ 15) వచ్చిన ప్రోమోతో ఇది అర్థమైంది. ఈ పాటను పంజాబీ స్టార్ సింగర్ దిల్‍జీత్ దోసంజ్ పాడారు. భైరవ ఆంథమ్ ప్రోమోలో ప్రభాస్‍తో పాటు దిల్జీత్ కూడా కనిపించారు. ఈ ప్రోమోలో పంజాబీ లిరిక్స్ ఉన్నాయి. ప్రోమో మంచి బీట్‍తో ఆకట్టుకుంది.

ప్రభాస్, దిల్‍జీత్ సింగ్ స్టైలిష్ ఎంట్రీతో భైరవ ఆంథమ్ ప్రోమో మొదలైంది. ఆ తర్వాత ఇద్దరూ చేతులు కలుపుతారు. సంతోష్ నారాయణ్ ఈ పాటకు మంచి ట్రెండీ ఫాస్ట్ బీట్ ఇచ్చినట్టు అనిపిస్తోంది. పాట మొత్తం పంజాబీ స్టైల్‍లోనే ఉంటుందా అనేది చూడాలి.

రేపే ఫుల్ సాంగ్

కల్కి 2898 ఏడీ మూవీ నుంచి భైరవ ఆంథమ్ ఫుల్ సాంగ్ రేపు (జూన్ 16) రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని ప్రోమోలోనే వెల్లడించారు మేకర్స్. ఇద్దరు ఐకాన్స్, ఒక్క ఆంథమ్ అంటూ ప్రభాస్, దిల్జీత్ చేతులు కలిపిన పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. తెలుగు, హిందీ పాటు తమిళం, కన్నడ, మలయాళంలోనూ ఈ పాట రేపు రానుంది. 

కల్కి 2898 ఏడీ సినిమాలో ఈ ఫస్ట్ సాంగ్‍ను నార్త్ ఆడియన్స్‌ను ఎక్కువగా దృష్టిలో పెట్టుకొని రూపొందించినట్టు తెలుస్తోంది. హిందీలో మరింత బజ్ కోసం ఈ పాట ఉపయోగపడుతుందని మూవీ టీమ్ భావిస్తోంది.

ప్రమోషన్లలో జోరు

కల్కి 2898 ఏడీ సినిమా ప్రమోషన్లలో క్రమంగా జోరు పెంచుతోంది మూవీ టీమ్. ఇప్పటి వరకు ఫ్యుచరిస్టిక్ కారు ‘బుజ్జి’ పరిచయం చేసే ఈవెంట్ మాత్రమే నిర్వహించింది. అయితే, త్వరలోనే దేశవ్యాప్తంగా ప్రమోషన్లను చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే బుజ్జికారును దేశంలోని వివిధ నగరాలకు తీసుకెళుతోంది. అలాగే, ఎల్‍ఈడీలతో కూడిన కొన్ని వాహనాలను దేశవ్యాప్తంగా ప్రమోషన్ల కోసం పంపించింది కల్కి టీమ్. త్వరలోనే అత్యంత భారీ స్థాయిలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది.

కల్కి 2898 ఏడీ సినిమాలో ప్రభాస్‍తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణ్, దిశా పటానీ, స్వస్తత ఛటర్జీ, రాజేంద్ర ప్రసాద్ కీలకపాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ ఈ మూవీని నిర్మించారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం