Kalki 2898 AD: ఆ విషయంలో ఆర్ఆర్ఆర్ రికార్డును బద్దలుకొట్టే దిశగా కల్కి 2898 ఏడీ సినిమా
Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ సినిమాకు చాలా క్రేజ్ ఉంది. ఈ మూవీకి భారీ ఓపెనింగ్ పక్కాగా కనిపిస్తోంది. అయితే, నార్త్ అమెరికా ప్రీమియర్ కలెక్షన్లలో ఈ చిత్రం రికార్డులను తిరగరాయడం పక్కాగా కనిపిస్తోంది.
Kalki 2898 AD: సినీ ప్రపంచమంతా ఇప్పుడు ‘కల్కి 2898 ఏడీ’ మేనియాలో ఉంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ మూవీపై క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. జూన్ 27వ తేదీన ఈ చిత్రంల రిలీజ్ కానుంది. సోమవారం వచ్చిన ట్రైలర్ విజువల్ వండర్‌గా, అద్భుతమైన వీఎఫ్‍ఎక్స్‌తో అందరినీ మెప్పింది. దీంతో కల్కి ఇప్పటికే ఉన్న అంచనాలు మరింత భారీగా పెరిగాయి. ఇండియాతో ఓవర్సీస్ మార్కెట్‍లోనూ ఈ చిత్రానికి చాలా హైప్ ఉంది. ఈ క్రమంలో నార్త్ ఇండియా ప్రీమియర్ కలెక్షన్ల విషయంలో ‘ఆర్ఆర్ఆర్’ రికార్డులను కల్కి 2898 ఏడీ బద్దలుకొట్టేలా ఉంది.

అప్పుడే మిలియన్ మార్క్ దాటేసి..
కల్కి 2898 ఏడీ సినిమా జూన్ 27వ తేదీన విడుదల కానుంది. అయితే, నార్త్ అమెరికాలో ఒక్క రోజు ముందే జూన్ 26న ప్రీమియర్లు ఉండనున్నాయి. అయితే, ఈ ప్రీమియర్లకు ఇప్పటి నుంచే టికెట్లు భారీ అమ్ముడవుతున్నాయి. దీంతో ప్రీమియర్ టికెట్ల ప్రీ-సేల్స్ అప్పుడే (జూన్ 11 నాటికి) మిలియన్ డాలర్ మార్క్ దాటేశాయి. రిలీజ్‍కు 15 రోజుల ముందే ఏకంగా ఈ మార్క్ అధిగమించింది కల్కి. ప్రీమియర్ల టికెట్ల సేల్ ఇంకా జోరుగా పెరిగే అవకాశం ఉంది.
ఆర్ఆర్ఆర్ రికార్డు బద్దలు కానుందా!
రాజమౌళి దర్శకత్వంలో రామ్‍చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కేవలం నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోల ద్వారానే మూడు మిలియన్ డాలర్ల కలెక్షన్లను దక్కించుకుంది. అయితే, కల్కి 2898 ఏడీ సినిమా ఈ ప్రీమియర్ రికార్డును బద్దలుకొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రీమియర్లకు ఇంకా రెండు వారాల సమయం ఉండటంతో మూడు మిలియన్ల మార్కును కల్కి దాటే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
కల్కి 2898 ఏడీ సినిమా రికార్డుస్థాయి ఓపెనింగ్ దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రభాస్ క్రేజ్‍తో పాటు ట్రైలర్ అద్భుతంగా ఉండటంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తే ప్రపంచవ్యాప్తంగా రూ.1,000 కోట్ల కలెక్షన్ల మార్కును సునాసాయంగా దాటే అవకాశాలు ఉన్నాయి.
కల్కి 2898 ఏడీ సినిమా ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళుతుందని దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పగా.. ట్రైలర్ చూశాక అది కచ్చితమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారతీయ పురాణాల స్ఫూర్తితో సైన్స్ ఫిక్షన్‍గా ఈ మూవీని ఆయన తెరకెక్కించారు. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణ్, దిశా పటానీ, సస్వత ఛటర్జీ, రాజేంద్ర ప్రసాద్ కీలకపాత్రలు పోషించారు.
కల్కి 2898 ఏడీ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ నిర్మించింది. సుమారు రూ.600కోట్ల భారీ బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందింది. భారతీయ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఖరీదైన మూవీగా వస్తోంది. దేశవ్యాప్తంగా భారీగా ప్రమోషన్లను చేసేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేసుకుంది. ఏపీలోని అమరావతిలో అత్యంత గ్రాండ్‍గా ప్రీ-రిలీజ్ ఈవెంటు జరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. జూన్ 27వ తేదీన కల్కి మూవీ రిలీజ్ కానుంది.
టాపిక్