Mystery Thriller OTT: ఓటీటీలోకి నేరుగా వస్తున్న కాజోల్, కృతి మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
30 September 2024, 15:32 IST
- Do Patti OTT Release Date: దో పత్తీ చిత్రం ఓటీటీలోకి నేరుగా వచ్చేస్తోంది. కాజోల్, కృతి సనన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మిస్టరీ థ్రిల్లర్ స్ట్రీమింగ్ డేట్ రివీల్ అయింది. ఓ స్పెషల్ వీడియో వచ్చింది.
Mystery Thriller OTT: ఓటీటీలోకి నేరుగా వస్తున్న కాజోల్, కృతి మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
దో పత్తీ చిత్రంపై కొంతకాలంగా క్యూరియాసిటీ ఉంది. ఈ మిస్టరీ థ్రిల్లర్ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ కాజోల్, యంగ్ నటి కృతి సనన్ ప్రధాన పాత్రలు పోషించారు. కృతి డ్యుయల్ రోల్ చేశారు. ఓటీటీ కోసమే ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ రూపొందింది. దో పత్తీ సినిమా స్ట్రీమింగ్ డేట్‍ను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ నేడు ప్రకటించింది.
స్ట్రీమింగ్ డేట్ ఇదే
దో పత్తీ సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అక్టోబర్ 25వ తేదీని స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని నెట్‍ఫ్లిక్స్ నేడు (సెప్టెంబర్ 30) అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళం, ఇంగ్లిష్‍లోనూ అక్టోబర్ 25న అందుబాటులోకి రానుంది. స్ట్రీమింగ్ డేట్ కోసం ఓ వీడియోను నెట్‍ఫ్లిక్స్ తీసుకొచ్చింది.
పోలీస్‍గా కాజోల్.. కృతి డ్యుయల్ రోల్
దో పత్తీ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించారు కాజోల్. ఓ హత్యాయత్నం కేసులో కృతి సనన్‍ను విచారించాలనుకుంటారు. కృతి ఈ చిత్రంలో డ్యుయల్ రోల్ చేశారు. కవలలుగా నటించారు. వీరి నుంచి నిజాలు రాబట్టేందుకు కాజోల్ ప్రయత్నిస్తుంటారు. ఉత్తరాఖండ్‍లోని దేవ్‍పూర్‌లో ఈ మూవీ స్టోరీ సాగుతుంది.
దో పత్తీ మూవీ థీమ్‍ను తెలుపుతూ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్‌మెంట్ వీడియో తీసుకొచ్చింది నెట్‍ఫ్లిక్స్. కాజోల్ ముందుగా ఓ కాఫీ షాప్‍కు వచ్చి ఆర్డర్ ఇస్తారు. అక్కడే కృతి సనన్ కూర్చొని బుక్ చదువుతుంటారు. దొరికిపోయిందని కాజోల్ ఫోన్‍లో చెబుతారు. కృతి భుజంపై చేయి వేస్తారు. కాజోల్‍ను చూసిన కృతి కంగారు పడతారు. ఆ తర్వాత వెళ్లాలని చెబితే కృతికి గన్ చూపిస్తారు కాజోల్. ఆ తర్వాత ఇంటరాగేషన్ చేసినట్టు ప్రశ్నలు అడుగుతారు. ఏం దాస్తున్నావని అడుగుతారు. ఆ తర్వాత అక్టోబర్ 25న తెలుస్తుందని కృతి చెబుతారు. ఇలా.. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‍ను నెట్‍ఫ్లిక్స్ రివీల్ చేసింది.
దో పత్తీ చిత్రానికి కొత్త డైరెక్టర్ శశాంక చతుర్వేది దర్శకత్వం వహించారు. కనిక థిల్లాన్ స్టోరీ అందించారు. మర్డర్ అటెంప్ట్ కేసు, ఇన్వెస్టిగేషన్, లవ్ స్టోరీ, ట్విస్టులతో థ్రిల్లర్ చిత్రంగా చతుర్వేది ఈ మూవీని తెరకెక్కించారని తెలుస్తోంది. కాజోల్, కృతితో పాటు షహీర్ షేక్ కూడా ఈ చిత్రంలో మెయిన్ రోల్ చేశారు. ఖత్నా పిక్చర్, కృతి సనన్‍కు చెందిన బ్లూ బటర్‌ఫ్లై బ్యానర్లు ఈ మూవీని ప్రొడ్యూజ్ చేశాయి. అక్టోబర్ 25న నుంచి నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో దో పత్తీ చిత్రాన్ని చూసేయవచ్చు.
సెక్టార్ 36కు సూపర్ రెస్పాన్స్
సెక్టార్ 36 చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి సెప్టెంబర్ 13న స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ హిందీ మూవీ కూడా థియేటర్లలో కాకుండా నేరుగా స్ట్రీమింగ్‍కు వచ్చింది. విక్రాంత్ మాసే లీడ్ రోల్ చేసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ మంచి వ్యూస్ దక్కించుకుంది. కొన్ని రోజులు టాప్‍లో ట్రెండ్ అయింది. ఇంకా నేషనల్ వైడ్ ట్రెండింగ్‍లో టాప్-5లో ఉంది.
సెక్టార్ 36 చిత్రాన్ని ఆదిత్య నింబల్కర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో విక్రాంత్‍తో పాటు దీపక్ దోబ్రియాల్, ఆకాశ్ ఖురానా, దర్శన్ జరివాలా, బహరుల్ ఇస్లాం కీరోల్స్ చేశారు.