తెలుగు న్యూస్  /  Entertainment  /  Kajal Aggarwal Recreated Bahubali Scene With His Son For Ss Rajamouli

Kajal Aggarwal Bahubali: రాజమౌళి కోసం కొడుకుతో బాహుబలి సీన్‌ రీక్రియేట్‌ చేసిన కాజల్‌

HT Telugu Desk HT Telugu

11 August 2022, 10:34 IST

    • Kajal Aggarwal Bahubali: కాజల్‌ అగర్వాల్‌ ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత సోషల్‌ మీడియాలో మరింత యాక్టివ్‌ అయింది. తాజాగా తన కొడుకుతో కలిసి ఆమె బాహుబలిలోని ఓ సీన్‌ రీక్రియేట్‌ చేయడం వైరల్‌గా మారింది.
కాజల్
కాజల్ (Facebook)

కాజల్

టాలీవుడ్‌లో ఒకప్పుడు టాప్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన కాజల్‌ అగర్వాల్‌.. పెళ్లి తర్వాత క్రమంగా సిల్వర్‌ స్క్రీన్‌కు దూరంగా వెళ్లిపోయింది. ఆ మధ్య ఆచార్య మూవీలో నటించినా.. ఆ తర్వాత ఆమె నటించిన సీన్లను తొలగించారు. ఇక ఇప్పుడు ఇండియన్‌ 2లో నటించే ఛాన్స్‌ కొట్టేసింది. అయితే ఆ మధ్య బిడ్డకు జన్మనిచ్చిన కాజల్‌.. అప్పటి నుంచి సోషల్‌ మీడియాలో మరింత యాక్టివ్‌ అయింది.

తరచూ తాను కొడుకు నీల్‌తో ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకుంటోంది. అయితే తాజాగా దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళిపై తనకున్న గౌరవాన్ని చాటుకుంటూ అతని సూపర్‌ హిట్‌ మూవీ బాహుబలిలోని ఓ సీన్‌ను రీక్రియేట్‌ చేసింది. ఆ సినిమాలో బాహుబలి కాలుని తీసి తన తలపై పెట్టుకుంటాడు కట్టప్ప. ఈ సీన్‌ ఆడియెన్స్‌కు గూస్‌బంప్స్‌ తెప్పించాయి.

ఇప్పుడదే సీన్‌ను రీక్రియేట్‌ చేస్తూ తన తనయుడి కాలిని తన తలపై పెట్టుకున్న ఫొటోను కాజల్‌ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేసింది. ఎస్‌ఎస్‌ రాజమౌళి సర్‌.. దీనిని నేను, నీల్‌ మీకు అంకితమిస్తున్నాం. అలా చేయకుండా ఎలా ఉండగలం? అని ఆ ఫొటోను కాజల్‌ క్యాప్షన్‌ పెట్టింది. ఈ ఫొటో ఇప్పుడు ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది.

రాజమౌళితో కలిసి మగధీరలో కాజల్‌ పని చేసిన విషయం తెలిసిందే. ఆ మూవీతో రామ్‌చరణ్‌తోపాటు కాజల్‌ రేంజ్‌ కూడా ఎక్కడికో వెళ్లిపోయింది. ఇక ప్రస్తుతం ఇండియన్‌ 2 మూవీ కోసం కాజల్‌ సిద్దమవుతోంది. ఈ సినిమా షూటింగ్‌ సెప్టెంబర్‌ 13 నుంచి ప్రారంభం కానుంది.

<p>కాజల్ రీక్రియేట్ చేసిన బాహుబలి సీన్</p>
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.