Bahubali Scene : మంథనిలో బాహుబలి సీన్ రిపీట్-telangana rains bahubali scene repeated in manthani ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bahubali Scene : మంథనిలో బాహుబలి సీన్ రిపీట్

Bahubali Scene : మంథనిలో బాహుబలి సీన్ రిపీట్

HT Telugu Desk HT Telugu
Jul 14, 2022 02:26 PM IST

బాహుబలి సినిమా ఎం పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. కానీ అందులో గ్రాఫిక్స్ వాడిన విషయం అర్థమవుతోంది. కానీ మంథనిలో మాత్రం.. ఈ వరదలకు బాహుబలి సినిమా సీన్ రిపీట్ అయింది.

<p>మంథనిలో పాపను తీసుకెళ్తున్న దృశ్యం</p>
మంథనిలో పాపను తీసుకెళ్తున్న దృశ్యం

తెలుగు బ్లాక్‌బస్టర్ చిత్రం బాహుబలిలోని ఓ సన్నివేశం మంథనిలో జరిగింది. లోతైన నీటిలో శివగామి నడుస్తూ తన చేతుల్లో చిన్నప్పటి బాహుబలిని ఎత్తుకుని నదిని దాటుతుంది. ఇలాంటి ఘటనే.. మంథనిలో జరిగింది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు విపరీతంగా వరద నీరు వస్తోంది. ఇక గోదావరి నది పక్కనే ఉన్న మంథని పట్టణం జలదిగ్బంధంలోకి వెళ్లింది. జనాలు బయటపడేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. ఓ పిల్లాడిని బాహుబలి సినిమాలో తీసుకెళ్లినట్టుగా తల మీద పెట్టుకుని తీసుకెళ్లారు.

సేమ్ బాహుబలి సినిమాలో లాగే.. ఓ వ్యక్తి మూడు నెలల పాపను తలపై పెట్టుకుని బుట్టలో వేసుకున్నాడు. మంథని పట్టణం ముంపునకు గురవ్వడంతో తల్లిని, మూడు నెలల పాపను మర్రివాడ నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. బిడ్డను తలపై ఎత్తుకుని మెడలోతు నీటిలో నడిచాడు. తలపై మోస్తున్న ఆ వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది.

మరోవైపు మంథని పట్టణంలోని దాదాపు అన్ని ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకోవడంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. మంథని మండలం సూరయ్యపల్లి కూడా వరద నీటిలో పూర్తిగా మునిగిపోయింది. అప్రమత్తమైన రెవెన్యూ అధికారులు గ్రామస్తులను సమీపంలోని కాకర్లపల్లికి తరలించారు.

కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలతో మంథని జల దిగ్బంధమైంది. గోదావరి, మానేరు బ్యాక్‌వాటర్ వరద నీరు ఉప్పొంగుతోంది. పట్టణంలోకి నీరు వచ్చి చేరింది. మంథని ప్రధాన చౌరస్తాలోకి పెద్ద ఎత్తున వదర నీరు వచ్చి చేరింది. బొక్కల వాగు బ్యాక్ వాటర్‌తో పట్టణంలోని అంబేద్కర్ నగర్, మర్రివాడ, వాసవీనగర్‌, దొంతలవాడ, బోయిన్ పేట, లైన్ గడ్డలోని బర్రెకుంటలోకి వచ్చాయి. దీంటో చాలా ఇళ్లలోకి నీరు వచ్చింది.

పట్టణంలోని దుకాణాల్లోకి నీరు రావడంతో సామాగ్రి మెుత్తం తడిసిపోయింది. పట్టణంలోని వరద బాధితుల పునరావాస కేంద్రం, పోలీస్‌స్టేషన్‌, కూరగాయల మార్కెట్‌లోకి భారీగా వరద వచ్చింది. పాత పెట్రోల్‌ పంపు చౌరస్తాలోని ఇళ్లు నీటిలో మునిగాయి. ముంపు బాధితులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

Whats_app_banner