Devara OTT Records: ఓటీటీలో జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ సెన్సేషనల్ రికార్డ్.. ఏడు దేశాల్లో ట్రెండింగ్
04 December 2024, 16:43 IST
Devara On OTT: మిక్స్‌డ్ టాక్‌తోనూ బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లని రాబట్టిన దేవర పార్ట్ -1 మూవీ.. ఓటీటీలో అదరగొట్టేస్తోంది. ఏడు దేశాల్లో టాప్-10 ట్రెండింగ్ మూవీస్‌లో ఒకటిగా దేవర కొనసాగుతోంది.
ఓటీటీలో దేవర జోరు
జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవర ఓటీటీలో సెన్సేషనల్ రికార్డ్‌ను క్రియేట్ చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్‌కి జోడీగా జాన్వీ కపూర్ నటించగా.. మూవీ సెప్టెంబరు 27న విడుదలైంది. అయితే.. థియేటర్లలో మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్న దేవర పార్ట్-1.. ఓటీటీలో మాత్రం దుమ్ముదులిపేసింది. తొలుత కొన్ని నెగటివ్ కామెంట్లు సినిమాపై వచ్చినా.. అవేవీ ఓటీటీలో దేవర దూకుడుని అడ్డుకోలేకపోయాయి.
రికార్డ్ వ్యూస్
దేవర ఓటీటీ రైట్స్‌ని భారీ ధరకి సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్.. నవంబరు 8 నుంచి స్ట్రీమింగ్‌కి ఉంచింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం బాషల్లో తొలుత స్ట్రీమింగ్‌కి ఉంచగా.. ఆ తర్వాత రెండు వారాల వ్యవధిలో ఇంగ్లీష్, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్‌కి ఉంచారు. దాంతో దేవర మూవీ వరల్డ్ వైడ్ రికార్డ్ వ్యూస్‌తో ఓటీటీలో దూసుకెళ్లింది.
ఏడు దేశాల్లో ట్రెండింగ్
ఓటీటీలో 2024లో అత్యధిక రోజులు ట్రెండింగ్‌లో ఉన్న మూవీగా రికార్డ్ నెలకొల్పిన దేవర పార్ట్-1.. నాన్ ఇంగ్లీష్ చిత్రాల్లో ప్రపంచవ్యాప్తంగా టాప్-6లో నిలిచింది. అలానే భారత్, బంగ్లాదేశ్, మల్దీవ్స్, పాకిస్థాన్, శ్రీలంక, యూఏఈతో పాటు మరో దేశంలో ఓటీటీలో టాప్ -10 సినిమాల్లో ఒకటిగా దేవర నిలిచింది.
గత వారం వారంలోనే 2.8 మిలియన్ వ్యూస్
నవంబరు 25 నుంచి డిసెంబరు 1 వరకు 2.8 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకున్న దేవర పార్ట్-1 మరికొన్ని రోజులు హవాని కొనసాగించే అవకాశం ఉంది. దేవర మూవీకి సీక్వెల్ కూడా రాబోతున్నట్లు దర్శకుడు కొరటాల శివ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.