Devara 2 Actors: దేవర 2లో యానిమల్ హీరో.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్ కొరటాల శివ.. అంతకుమించిన ప్లాన్!
Koratala Siva On Ranbir Kapoor In Jr NTR Devara 2: జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీకి సీక్వెల్‌గా రానున్న దేవర పార్ట్ 2లో యానిమల్ హీరో రణ్‌బీర్ కపూర్‌ను చూడాలని ఉందని డైరెక్టర్ కొరటాల శివ చెప్పారు. రణ్‌బీర్ కాకుంటే మరో స్టార్ హీరో అయిన సరే అని మనసులో మాట రివీల్ చేశారు దేవర డైరెక్టర్ కొరటాల శివ.
Koratala Siva Ranbir Kapoor Jr NTR Devara 2: జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జోడీ కట్టిన దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతూ దూసుకుపోతోంది. దీంతో దేవర పార్ట్ 1 సీక్వెల్ దేవర 2ని అంతకుముంచి అనేలా ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్ కొరటాల శివ. అందుకు కారణం రీసెంట్‌గా ఆయన చెప్పిన విషయాలే.
దేవరలో ఇద్దరు
కొరటాల శివ ఈ దేవర ఫ్రాంచైజీలో నార్త్-సౌత్ క్రాస్ ఓవర్‌ను ఇంకా పూర్తి చేయేలేదు. అంటే, బాలీవుడ్ యాక్టర్స్‌ను దేవర సినిమాలో దింపడాన్ని మొదటి పార్ట్ వరకే పరిమితం చేయలేదు కొరటాల శివ. ఇదివరకే దేవర మూవీలో హిందీ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్, బ్యూటిఫుల్ జాన్వీ కపూర్ నటించిన విషయం తెలిసిందే.
జూమ్ ఇంటర్వ్యూలో
దేవర సీక్వెల్ కోసం కూడా డైరెక్టర్ కొరటాల శివ భారీ ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జూమ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవర 2 సినిమాలో ఎవరెవరు నటించాలని అనుకుంటున్నారు అనే ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు కొరటాల శివ.
ఆ ఇద్దరిలో ఒకరు
''నిజానికి నా కోరికల జాబితాలో చాలా మందే ఉన్నారు. ఉంది. అది జరుగుతుందో లేదో నాకు తెలియదు. కానీ, నిజం చెప్పాలంటే రణ్ వీర్ సింగ్ లేదా రణ్ బీర్ కపూర్‌లను దేవర ప్రపంచంలో చూడాలనుకుంటున్నాను. తెలుగు, తమిళ ఇండస్ట్రీల నుంచి ఎక్కువ పేర్లు చెప్పను. ఎందుకంటే నేను కొందరి పేర్లు బయటపెడితే భారీ ఎక్స్‌పెక్టేషన్స్, ఎక్కువ రూమర్స్ వస్తాయి'' అని కొరటాల శివ తెలిపారు.
అందుకు ఇష్టపడను
ఈ రోజుల్లో ట్రెండ్‌కు భిన్నంగా, కేవలం అతిథి పాత్రల కోసం ఈ బాలీవుడ్ అగ్ర హీరోలను తీసుకోవడానికి తాను ఇష్టపడనని, కానీ.. కీలకమైన, అతి ముఖ్యమైన పాత్రలలో నటించేందుకు వారిని తీసుకోడానికి ఇష్టపడతానని కొరటాల శివ పేర్కొన్నారు. వాటిని క్యామియోలు అనడం కరెక్ట్ కాదని, వారు సినిమాలో చాలా పాత్రలేనని, త్వరలోనే పాత్రల వారీగా దేవరను ఆవిష్కరిస్తానని కొరటాల శివ చెప్పారు.
అంతకుమించి అనేలా
ప్రస్తుతం డైరెక్టర్ కొరటాల శివ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇవి విన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర 2 నెక్ట్స్ లెవెల్‌లో ఉంటుందని భావిస్తున్నారు. అలాగే, దేవర సీక్వెల్‌ను ఊహించని విధంగా అంతకుమించి అనేలా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దేవర వరల్డ్‌లోకి బాలీవుడ్ మాత్రమే కాకుండా సౌత్ ఇతర సినీ పరిశ్రమల్లోని అగ్ర నటీనటులు ఎంట్రీ ఇస్తారని కొరటాల శివ మాటల ద్వారా అర్థం చేసుకోవచ్చు.
ఎన్టీఆర్ డ్యుయల్ రోల్
ఇదిలా ఉంటే, దేవర పార్ట్ 2 సినిమాలో తారక్, జాన్వీ, సైఫ్‌తోపాటు ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ మేకా, టామ్ షైన్ చాకో, నరైన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాలో తారక్ ద్విపాత్రాభినయం చేశాడు. దేవర, వరదుడు అనే ఇద్దరి పాత్రల్లో నటించి మెప్పించాడు.
జాన్వీ గ్లామర్ టచ్
ఎర్ర సముద్రం తీర ప్రాంత నేపథ్యంలో దేవర సినిమా సాగుతుంది. ఇద్దరి విభిన్నమైన సంకల్పాలు, నాటకీయ సంఘర్షణ చుట్టూ దేవర పార్ట్ 1 కథ నడుస్తుంది. సైఫ్ విలన్‌గా నటించగా.. జాన్వీ తంగం పాత్రలో గ్లామర్ టచ్ ఇచ్చింది.