తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Devara North Rights: దేవర ఉత్తరాది హక్కులను దక్కించుకున్న రెండు బడా ప్రొడక్షన్ హౌస్‍లు: వివరాలివే

Devara North Rights: దేవర ఉత్తరాది హక్కులను దక్కించుకున్న రెండు బడా ప్రొడక్షన్ హౌస్‍లు: వివరాలివే

10 April 2024, 15:52 IST

google News
    • Devara Movie North Indian Rights: దేవర సినిమాపై దేశవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నచిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ తరుణంలో ఈ సినిమా నార్త్ ఇండియా హక్కులను రెండు బడా ప్రొడక్షన్ హౌస్‍లు సొంతం చేసుకున్నాయి.
Devara North Rights: దేవర ఉత్తరాది హక్కులను దక్కించుకున్న రెండు బడా ప్రొడక్షన్ హౌస్‍లు: వివరాలివే
Devara North Rights: దేవర ఉత్తరాది హక్కులను దక్కించుకున్న రెండు బడా ప్రొడక్షన్ హౌస్‍లు: వివరాలివే

Devara North Rights: దేవర ఉత్తరాది హక్కులను దక్కించుకున్న రెండు బడా ప్రొడక్షన్ హౌస్‍లు: వివరాలివే

Devara Movie: ఆర్ఆర్ఆర్ సినిమాతో మ్యాన్ ఆఫ్ ది మాసెస్ జూనియర్ ఎన్టీఆర్.. పాన్ ఇండియా రేంజ్‍లో పాపులర్ అయ్యారు. ఆ చిత్రంలో ఆయన నటనకు హిందీ అభిమానులు కూడా ఫిదా అయ్యారు. గ్లోబల్ స్థాయిలో ఎన్టీఆర్‌కు క్రేజ్ ఏర్పడింది. ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. భారీ బడ్జెట్‍తో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. దేవరపై తెలుగుతో పాటు బాలీవుడ్‍లోనూ చాలా క్రేజ్ ఉంది. దీంతో ఈ సినిమా నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ హక్కులను రెండు దిగ్గజ ప్రొడక్షన్ హౌస్‍లు సొంతం చేసుకున్నాయి.

రెండు దిగ్గజ సంస్థలు

దేవర సినిమా ఉత్తరాది హిందీ థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాత కరణ్‍జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్, అనిత్ తందానీకి చెందిన ఏఏ ఫిల్మ్స్ సొంతం చేస్తున్నాయి. ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు అధికారంగా వెల్లడించింది.

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ, కరణ్ జోహార్, అనిల్ తందానీ కలిసిన ఫొటోనూ టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. “దేవర నార్త్ ఇండియా థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ కోసం దేశంలో డైనమిక్ డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్న కరణ్ జోహార్, ఏఏ ఫిల్మ్స్ సంస్థలతో కలవడం చాలా సంతోషంగా ఉంది. అక్టోబర్ 10వ తేదీన అద్భుత రిలీజ్ కోసం వేచిచూస్తున్నాం” అని దేవర టీమ్ ట్వీట్ చేసింది.

అక్టోబర్ 10వ తేదీన తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ దేవర రిలీజ్ కానుంది. ఏప్రిల్‍లోనే విడుదల చేస్తామని తొలుత మేకర్స్ ప్రకటించగా.. వాయిదా పడింది. ఏకంగా అక్టోబర్‌కు వెళ్లింది.

అప్పట్లో బాహుబలి

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమాను అప్పట్లో హిందీలో ధర్మ ప్రొడక్షన్స్, ఏఏ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూట్ చేశాయి. ఆ చిత్రం ఉత్తరాదిలో కూడా భారీ వసూళ్లను దక్కించుకుంది. ఇప్పుడు, దేవర మూవీని కూడా ఆ రెండు భారీ డిస్ట్రిబ్యూషన్ హౌస్‍లు కలిపి తీసుకున్నాయి. దీంతో ఉత్తరాదిలో భారీస్థాయిలో దేవర రిలీజ్ కానుంది.

దేవర సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఈ చిత్రంతోనే ఆమె టాలీవుడ్‍లో అడుగుపెడుతున్నారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఈ చిత్రంలో విలన్‍ పాత్ర పోషిస్తున్నారు. దీంతో హిందీలోనూ దేవరకు చాలా క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో కూడా కీరోల్స్ చేస్తున్నారు.

దేవర చిత్రంలో వీఎఫ్‍ఎక్స్ కూడా భారీగా ఉండనుంది. లార్జ్ స్కేల్‍లో ఈ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ఆలస్యమైనా ఈ మూవీ అత్యుత్తమంగా ఉండాలని టీమ్ డిసైడ్ అయింది. అందుకే రిలీజ్‍ను ఏప్రిల్ నుంచి అక్టోబర్‌కు మార్చింది. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

ఇటీవల టిల్లు స్క్వేర్ సక్సెస్ టీమ్‍కు హాజరైన జూనియర్ ఎన్టీఆర్ దేవర గురించి చెప్పారు. దేవర సినిమా ఆలస్యంగా వచ్చినా అభిమానులు కాలర్ ఎగరేసేలా గొప్పగా ఉంటుందని అన్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం