Jio OTT Plan: 15 ఓటీటీలు ఫ్రీ.. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్‌లను జియో కొత్త ప్లాన్‌తో ఫ్రీగా చూసేయండి
14 May 2024, 10:48 IST
- Jio OTT Plan: జియో ఫైబర్ కొత్త ప్లాన్ తో ఏకంగా 15 ఓటీటీలను ఫ్రీగా చూసే వీలుంది. అందులో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్, సోనీలివ్ లాంటి టాప్ ఓటీటీలు కూడా ఉండటం విశేషం.
15 ఓటీటీలు ఫ్రీ.. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్‌లను జియో కొత్త ప్లాన్‌తో ఫ్రీగా చూసేయండి
Jio OTT Plan: జియో ఫైబర్ మరోసారి అందుబాటు ధరలోనే అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ తోపాటు ఏకంగా 15 ఓటీటీలను ఫ్రీగా చూసేలా కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. ఒక్కో ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలంటే తడిసి మోపెడవుతోంది. అలాంటి యూజర్ల కోసం జియో ఫైబర్ అల్టిమేట్ స్ట్రీమింగ్ ప్లాన్ పేరుతో ఈ కొత్త ప్లాన్ తీసుకురావడం విశేషం.
జియో ఫైబర్‌తో 15 ఓటీటీలు ఫ్రీ
జియో ఫైబర్ తీసుకొచ్చిన ఈ సరికొత్త పోస్ట్ పెయిడ్ ప్లాన్ ధర నెలకు రూ.888. ఇది కేవలం జియో ఫైబర్, జియో ఎయిర్‌ఫైబర్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 30 ఎంబీపీఎస్ స్పీడు ఇంటర్నెట్ తోపాటు 15 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు కూడా ఈ ప్లాన్ ద్వారా పొందవచ్చు. వీటిలో ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని టాప్ ఓటీటీలు ఉండటం విశేషం.
ఆ 15 ఓటీటీలు ఇవే
నెట్‌ఫ్లిక్స్ (బేసిక్ ప్లాన్), ప్రైమ్ వీడియో (లైట్), జియో సినిమా ప్రీమియం, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, సోనీలివ్, జీ5, సన్ నెక్ట్స్, హోయ్‌చొయ్, డిస్కవరీ+, ఏఎల్‌టీ బాలాజీ, ఎరోస్ నవ్, లయన్స్‌గేట్ ప్లే, షెమారూమీ, డాక్యుబే, ఎపికాన్, ఈటీవీ విన్ లాంటి ఓటీటీల యాక్సెస్ ఈ కొత్త ప్లాన్ ద్వారా యూజర్లకు లభిస్తుంది. ప్రస్తుతం అన్ని భాషల్లోనూ టాప్ మూవీస్, వెబ్ సిరీస్ వచ్చే ఓటీటీలన్నీ ఇందులో ఉన్నాయి.
అందరు యూజర్లకూ కొత్త ప్లాన్
ఈ కొత్త ప్లాన్ ను కేవలం కొత్త యూజర్లకే కాకుండా ఇప్పటికే ఉన్న యూజర్లకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది జియో ఫైబర్. తక్కువ స్పీడు ప్లాన్ ఉన్న వాళ్లు, ప్రీపెయిడ్ కస్టమర్లు కూడా ఈ కొత్త రూ.888 పోస్ట్ పెయిడ్ కు మారే అవకాశం ఇస్తోంది. ఈ ప్లాన్ ఐపీఎల్ ధన్ ధనా ధన్ ఆఫర్ ను కూడా అందిస్తోంది.
అర్హత కలిగిన కస్టమర్లకు 50 రోజుల డిస్కౌంట్ క్రెడిట్ వోచర్ కూడా లభిస్తుంది. అందుబాటు ధరలో ఇంటర్నెట్ తోపాటు 15 అత్యుత్తమ ఓటీటీల సబ్‌స్క్రిప్షన్లు కావడంతో ఈ ప్లాన్ కు క్రమంగా డిమాండ్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జియో సినిమా ప్లాన్
జియో ఈ మధ్యే తమ ఓటీటీ జియో సినిమా ప్రీమియం ప్లాన్ ధరను కూడా తగ్గించిన విషయం తెలిసిందే. నెలకు కేవలం రూ.29తో ప్రీమియం ప్లాన్ తీసుకొచ్చింది. గతంలో ఇది రూ.59గా ఉండేది. ఇక నాలుగు స్క్రీన్లపై ఒకేసారి చూడాలనుంటే నెలకు రూ.89తో ఫ్యామిలీ ప్లాన్ కూడా అందిస్తోంది. జియో సినిమా ఒరిజినల్స్ తోపాటు పెద్ద ఎత్తున హాలీవుడ్ కంటెంట్ కూడా జియో సినిమాలో అందుబాటులో ఉంది.
ఫ్రీగా ఐపీఎల్
ఇక ఎలాగూ ఐపీఎల్ కూడా ఇందులోనే వస్తోంది. ఇది సబ్‌స్క్రిప్షన్ తో సంబంధం లేకుండా అందరికీ ఫ్రీగా ఏ డివైస్ లో అయినా ఐపీఎల్ చూసే అవకాశం జియో సినిమా కల్పిస్తున్న విషయం తెలిసిందే. గతేడాది నుంచి ఐపీఎల్ డిజిటల్ హక్కులను జియో సొంతం చేసుకుంది. అంతకుముందు హాట్‌స్టార్ లో ఈ మెగా లీగ్ స్ట్రీమింగ్ అయ్యేది.
టాపిక్