OTT Movies This Week: ఈ వారం ఓటీటీలోకి 22.. 7 మాత్రమే సినిమాలు, వాటిలో 4 స్పెషల్.. ఎక్కడ చూడాలంటే?-ott movies release to this week bastar ott chorudu ott baahubali crown of blood ott release disney plus hotstar netflix ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Movies This Week: ఈ వారం ఓటీటీలోకి 22.. 7 మాత్రమే సినిమాలు, వాటిలో 4 స్పెషల్.. ఎక్కడ చూడాలంటే?

OTT Movies This Week: ఈ వారం ఓటీటీలోకి 22.. 7 మాత్రమే సినిమాలు, వాటిలో 4 స్పెషల్.. ఎక్కడ చూడాలంటే?

Sanjiv Kumar HT Telugu
May 14, 2024 10:40 AM IST

OTT Movies To Release This Week: ఓటీటీలోకి ఈ వారం దాదాపుగా 22 సినిమాలు విడుదల కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5, జియో సినిమా తరహా ఇతర ఓటీటీ సంస్థలు డిఫరెంట్ కంటెంట్ సినిమాలు, వెబ్ సిరీసులతో ఎంటర్టైన్‌మెంట్ పంచేందుకు రెడీగా ఉన్నాయి.

ఈ వారం ఓటీటీలోకి 22.. 7 మాత్రమే సినిమాలు, వాటిలో 4 స్పెషల్.. ఎక్కడ చూడాలంటే?
ఈ వారం ఓటీటీలోకి 22.. 7 మాత్రమే సినిమాలు, వాటిలో 4 స్పెషల్.. ఎక్కడ చూడాలంటే?

This Week OTT Release Movies: ఓటీటీలోకి ఈ వారం సుమారుగా 22 సినిమాలు, వెబ్ సిరీసుల వరకు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో పాటు కొన్ని డబ్బింగ్ చిత్రాలు సైతం ఉన్నాయి. అంతేకాకుండా డిఫరెంట్ కంటెంట్‌తో నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, జీ5 వంటి తదితర ఓటీటీలు ముందుకు రానున్నాయి.

yearly horoscope entry point

తెలుగు, హిందీ, ఇంగ్లీషు ఇతర భాషల్లో వివిధ జోనర్లలో సినిమాలు ఈ వారం అంటే మే 13 నుంచి 19 వరకు ఓటీటీల్లో స్ట్రీమింగ్‌కు వచ్చి సందడి చేయనున్నాయి. మరి ఆ సినిమాలు, వెబ్ సిరీసులు ఏంటీ, అవి ఏ ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతాయన్న వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

క్రాష్ (కొరియన్ వెబ్ సిరీస్)- మే 13

చోరుడు (తెలుగు డబ్బింగ్ చిత్రం)- మే 14

అంకుల్ సంషిక్ (కొరియన్ వెబ్ సిరీస్)- మే 15

బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ (హిందీ యానిమేటెడ్ వెబ్ సిరీస్)- మే 17

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ఆష్లే మ్యాడిసన్: సెక్స్ లైస్ అండ్ స్కాండల్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 15

బ్లడ్ ఆఫ్ జ్యూష్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 15

బ్రిడ్జర్టన్ సీజన్ 3 పార్ట్ 1 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 16

మేడమ్ వెబ్ (ఇంగ్లీష్ మూవీ)- మే 16

పవర్ (ఇంగ్లీష్ చిత్రం)- మే 17

ది 8 షో (కొరియన్ వెబ్ సిరీస్)- మే 17

థెల్మాద యూనికార్న్ (ఇంగ్లీష్ చిత్రం)- మే 17

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

ఔటర్ రేంజ్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 16

99 ఇంగ్లీష్ (వెబ్ సిరీస్)- మే 17

జీ5 ఓటీటీ

బస్తర్: ది నక్సల్ స్టోరీ (హిందీ చిత్రం)- మే 17

తళమై సెయలగమ్ (తమిళ వెబ్ సిరీస్)- మే 17

జియో సినిమా ఓటీటీ

డిమోన్ స్లేయర్ (జపనీస్ వెబ్ సిరీస్)- మే 13

C.H.U.E.C.O సీజన్ 2 (స్పానిష్ వెబ్ సిరీస్)- మే 14

జర హట్కే జర బచ్కే (హిందీ చిత్రం)- మే 17

గాడ్జిల్లా X కాంగ్: ది న్యూ ఎంపైర్ (తెలుగు డబ్బింగ్ హాలీవుడ్ మూవీ)- బుక్ మై షో ఓటీటీ- మే 13

లంపన్ (మరాఠీ వెబ్ సిరీస్)- సోనీ లివ్ ఓటీటీ- మే 16

ది బిగ్ సిగార్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 17

ఎల్లా (హిందీ మూవీ)- ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీ- మే 17

ఇలా ఈ వారం మొత్తం సినిమాలు, వెబ్ సిరీసులు అన్నీ కలుపుకుని 22 స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో ఎక్కువగా 11 సినిమాలు మే 17 శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి. కానీ, ఈ 22 వాటిలో కేవలం 7 మాత్రమే సినిమాలు. మిగతావన్నీ వెబ్ సిరీసులే.

ఇక స్ట్రీమింగ్ కానున్న 7 సినిమాల్లో ఆదా శర్మ నటించిన బస్తర్: ది నక్సల్ స్టోరీ, చోరుడు అనే తెలుగు డబ్బింగ్ మూవీ, హాలీవుడ్ బిగ్గెస్ట్ బజ్ క్రియేట్ చేసిన గాడ్జిల్లా X కాంగ్: ది న్యూ ఎంపైర్, జర హట్కే జర బచ్కే వంటి 4 సినిమాలు స్పెషల్ కానున్నాయి. అలాగే వెబ్ సిరీసుల్లో బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ ఒక్కటే ప్రత్యేకం కానుంది.

Whats_app_banner