తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jailer Vs Bholaa Shankar Collections: జైలర్ సూపర్ హిట్.. భోళా శంకర్ అట్టర్ ఫ్లాప్.. కలెక్షన్లలో ఎంత తేడానో చూడండి

Jailer vs Bholaa Shankar Collections: జైలర్ సూపర్ హిట్.. భోళా శంకర్ అట్టర్ ఫ్లాప్.. కలెక్షన్లలో ఎంత తేడానో చూడండి

Hari Prasad S HT Telugu

17 August 2023, 7:34 IST

google News
    • Jailer vs Bholaa Shankar Collections: జైలర్ సూపర్ హిట్.. భోళా శంకర్ అట్టర్ ఫ్లాప్.. కలెక్షన్లలో ఈ రెండు సినిమాలకు ఉన్న తేడా స్పష్టంగా కనిపిస్తోంది. మెగాస్టార్ పై సూపర్ స్టార్ పైచేయి సాధించాడు.
జైలర్, భోళా శంకర్ బాక్సాఫీస్ కలెక్షన్లలో భారీ వ్యత్యాసం
జైలర్, భోళా శంకర్ బాక్సాఫీస్ కలెక్షన్లలో భారీ వ్యత్యాసం

జైలర్, భోళా శంకర్ బాక్సాఫీస్ కలెక్షన్లలో భారీ వ్యత్యాసం

Jailer vs Bholaa Shankar Collections: టాలీవుడ్ మెగస్టార్, కోలీవుడ్ సూపర్ స్టార్ నటించిన భోళా శంకర్, జైలర్ సినిమాలు గత వారం ఒక రోజు వ్యవధిలో రిలీజయ్యాయి. ఇద్దరూ ఒకప్పుడు ఆయా సినిమా ఇండస్ట్రీలను ఏలిన వాళ్లే. ఇప్పుడు ఔట్‌డేటెడ్ అయిపోయారు. కానీ 70 ప్లస్ వయసులో రజనీకాంత్ ఓ సూపర్ డూపర్ హిట్ సాధించగా.. ఆ 70కి దగ్గరవుతున్న చిరంజీవి మాత్రం బోల్తా పడ్డాడు.

నిండా ముంచిన డైరెక్టర్

మెహెర్ రమేష్ లాంటి ఓ ఫెయిల్యూర్ డైరెక్టర్ కు అవకాశం ఇచ్చి.. ఎప్పుడో రెండు దశాబ్దాల కిందట రావాల్సిన సినిమాను ఇప్పుడు తీసి చేతులు కాల్చుకున్నాడు మెగాస్టార్. భోళా శంకర్ ఐదు రోజుల కలెక్షన్ల షేర్ చూస్తే కనీసం రూ.30 కోట్లు కూడా అందుకోలేదు. చిరంజీవి కంటే కూడా అతని అభిమానులను ఈ కలెక్షన్లు చాలా బాధిస్తున్నాయి.

ముఖ్యంగా గాడ్ ఫాదర్, వాల్తేర్ వీరయ్య తర్వాత హ్యాట్రిక్ సాధిస్తాడనుకుంటే భోళా శంకర్ మొత్తానికే మోసం చేసింది. చిరు కెరీర్లోని డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిపోయింది. గతేడాది ఆచార్య గాయాన్ని మధ్యలో వచ్చిన రెండు సినిమాలు మానిస్తే.. ఇప్పుడు భోళా శంకర్ అంతకంటే పెద్ద గాయమే చేసింది. ఐదు రోజుల్లోనే ఈ సినిమాను చాలా థియేటర్లు తీసేశాయి.

ఫ్యాన్స్ కు చివుక్కుమనే మరో విషయం ఏంటంటే.. ఈ థియేటర్లలోకి జైలర్ సినిమా రావడం. ఇప్పటికే ఏజెంట్ మూవీతో భారీగా నష్టపోయిన అనిల్ సుంకరను ఇప్పుడు భోళా శంకర్ నిండా ముంచింది. అప్పుడెప్పుడో తమిళంలో వచ్చిన వేదాళం మూవీని అంతకంటే ఔట్‌డేటెడ్ గా తీసిన మెహెర్ రమేష్ ను నమ్ముకొని ఇటు మెగాస్టార్ చిరంజీవితోపాటు అటు నిర్మాత కూడా మోసపోయారు.

జైలర్ సూపర్ హిట్

మరోవైపు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ మూవీ మాత్రం సూపర్ హిట్ అయింది. నిజానికి చాన్నాళ్లుగా రజనీ పరిస్థితి కూడా దారుణంగా ఉంది. పెద్ద హిట్ కోసం ఎదురు చూస్తున్న అతనికి జైలర్ రూపంలో ఊరట లభించింది. ఈ సినిమా ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకుపైగా వసూలు చేయడం విశేషం.

బీస్ట్ మూవీతో పెద్ద డిజాస్టర్ ఎదుర్కొన్న డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కు అవకాశం ఇచ్చి రజనీకాంత్ పెద్ద తప్పు చేస్తున్నాడా అని అందరూ భావించారు. కానీ మూవీ రిలీజైన తర్వాత రజనీ చరిష్మా ఒంటిచేత్తో ఈ సినిమాను నడిపించింది. అటు అమెరికాలోనూ కేవలం తెలుగు వెర్షన్ జైలరే 10 లక్షల డాలర్లు వసూలు చేసింది. తెలుగులోకి డబ్ అయిన సినిమా అమెరికాలో ఇంత భారీ వసూళ్లు రాబట్టడం నిజంగా విశేషమే.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం